breaking news
kukatpaaly
-
Hyd: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి రాజీవ్‌గాంధీ నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం( జనవరి 13వ తేదీ) రాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసకుంది.గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. భారీ ఎత్తున మంటల ఎగిసి పడుతూ ఉండటంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. -
ఓపెన్ నాలాలో పడి ఒకరు మృతి
కూకట్పల్లి: కూకట్పల్లి పరిధిలోని ప్రశాంత్‌నగర్ ఓపెన్ నాలాలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇందిరా గాంధీ బస్తీకి చెందిన కురుమయ్య(40) క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన శుక్రవారం ప్రమాదవశాత్తూ ఓపెన్ నాలాలో పడి మృతి చెందాడు. అయితే అతను అనారోగ్యంతో ఉన్నాడని, ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. కాగా, అధికారుల నిర్లక్ష్యంతోనే తమ వ్యక్తి చనిపోయాడని ఆరోపిస్తూ మృతదేహంతో అతని బంధువులు ఆందోళనకు దిగారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.


