kondur
-
కృష్ణా జిల్లాలో దారుణం.. సామూహిక లైంగిక దాడి
సాక్షి, కృష్ణా: కృష్ణాజిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కొందరు వ్యక్తులు మైనర్‌ను నాలుగు రోజుల పాటు నిర్భంధించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈనెల తొమ్మిదో తేదీన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన మైనర్(14) ఈనెల తొమ్మిదో తేదీన గన్నవరం మండలం వీరపనేని గూడెంలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అనంతరం, ఈనెల 13 న స్నేహితురాaలి ఇంటి నుంచి బయటికి వచ్చింది. రాత్రి సమయంలో ఒంటరిగా కనిపించిన బాలికను ఇద్దరు యువకులు ట్రాప్ చేశారు. ఆమెను బైక్‌పై కొంత దూరం తీసుకెళ్లి మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం, మరో నలుగురు ఆమెను నాలుగు రోజులు పాటు నిర్బంధించిన లైంగిక దాడి చేశారు.అనంతరం, ఈనెల 17న రాత్రి సమయంలో విజయవాడలోని మైలవరంలో కామాంధులు ఆమెను వదిలిపెట్టి వెళ్లారు. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్‌కి జరిగిన విషయాన్ని ఆమె తెలిపింది. దీంతో, సదరు ఆటోడ్రైవర్.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన ఆత్కూరు పోలీసులు.. బాధితురాలిని ఆసుపత్రికి తరలించింది. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును పోలీసులు కేసును ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. -
కొండూరులో విషజ్వరాలు
కొండూరు (అచ్చంపేట): గ్రామం మంచం పట్టింది. విష జ్వరాలతో జనం అల్లాడిపోతున్నారు. కొండూరు పంచాయతీ పరిధిలో రెండు గిరిజన తండాలు, నిండుజర్ల శివారు గ్రామం ఉంది. జనాభా 4 వేల మందికి పైగా జనాభా, 2600 మంది ఓటర్లు ఉన్నారు. వారం రోజులుగా గ్రామం అంతా జ్వరాలతో తల్లడిల్లిపోతోంది. ప్రధానంగా బీసీ, ఎస్సీ కాలనీల్లో ఇంటికొకరు జ్వర పీడితులున్నారు. బీసీ కాలనీలో సుమారు 40 కుటుంబాల వారు జ్వరాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. అధ్వాన పారిశుద్ధ్యం కారణంగానే రోగాలు ప్రభలాయని బాధితులు చెప్పారు. ఇంత మంది జ్వరాలతో బాధపడుతున్నా ప్రభుత్వ వైద్యులు మాత్రం కన్నెత్తి కూడా చూడలేదని అంటున్నారు. మూడు కిలోమీటర్ల పరిధిలోని దొడ్లేరులో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడిపైనే ఆధారపడి చికిత్స పొందుతున్నారు. తాత్కాలికంగా తగ్గుతున్నా మరలా తిరగబెడుతోందని బాధితులు వాపోయారు. తమకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే చాలు.... కుటుంబంలోని మిగతా వారందరికీ వస్తుందని ఆవేదన చెందారు. సత్తెనపల్లి, గుంటూరు వంటి ప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటుంటే వేలాది రూపాయలు ఖర్చవుతోందని పేర్కొన్నారు. అచ్చంపేట పీహెచ్సీ సెంటర్ నుంచి గానీ, పెదపాలెం సబ్ సెంటర్ నుంచి గానీ ఏ ఒక్క వైద్యుడు తమ వద్దకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే మెరుగైన వైద్యం కల్పించాలని కుంభా లక్ష్మణరావు, నాగరాజు తెలిపారు. ఇంట్లో తమ పిల్లలిద్దరూ జ్వరంతో బాధపడుతున్నారని, ఆర్ఎంపీతో చికిత్స చేయించినా తగ్గడం లేదని తెలిపారు. ఈ విషయంపై డాక్టర్ రమ్యను సాక్షి వివరణ అడగ్గా జన్మభూమి రోజు వైద్య శిబిరం ఏర్పాటుచేశామని, జ్వరాలు తగ్గేంత వరకు శిబిరం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అవసరమైన మందులు, వైద్య సిబ్బందిని నియమిస్తామన్నారు. -
వివాహిత ఆత్మహత్య
లేపాక్షి : మండలంలోని కొండూరుకు చెందిన రామకృష్ణ భార్య అశ్వర్థమ్మ(35) బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీధర్ గురువారం తెలిపారు. ఆమె తరచూ కడుపునొప్పితో బాధపడేదన్నారు. ఈ క్రమంలో నాటి రాత్రి నొప్పి ఎక్కువ కావడంతో భరించలేక ఇంటి పైకప్పునకు ఉరేసుకుని తనువు చాలించినట్లు వివరించారు. మృతురాలికి కుమారుడు(12), కుమార్తె(10) ఉన్నారు. మృతురాలి తండ్రి వెంకటరమణప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
వైభవంగా సప్పలమ్మ జాతర
లేపాక్షి : మండలంలోని కొండూరులో మంగళవారం సప్పలమ్మ జాతర నిర్వహించారు. గ్రామ పెద్దల సహకారంతో వాల్మీకులందరు కలిసి అమ్మవారికి జ్యోతులు మోశారు. ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి అర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ శివప్ప, ఎంపీపీ హనోక్, ఎంపీటీసీ సభ్యురాలు సావిత్రమ్మ, మాజీ ఎంపీపీ కొండూరు మల్లికార్జున, టీడీపీ నాయకులు అంబికా లక్ష్మినారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.