breaking news
justice sudharshan reddy
-
రోహిత్ ఆత్మహత్య కన్నీరు పెట్టించింది
-
దోపిడీ చరిత్రను తిరగ రాసే కుట్ర!
'సెక్షన్ 8' విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వ్యక్తిగత చిక్కుల్లోంచి బయటపడేందుకే తెరపైకి తెచ్చారు రాజ్యాంగాన్ని సవరించినా సెక్షన్ 8 అమలు కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఏపీ రాజధాని నిర్మాణం హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1956 నుంచి 2014 వరకు కొనసాగిన నిధులు, నియామకాలు, వనరుల దోపిడీ చరిత్రను తిరగరాసేందుకే ఏపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలగనప్పటికీ వ్యక్తిగత చిక్కుల్లోంచి బయటపడేందుకు 'సెక్షన్ 8' ను అనైతికంగా తెరపైకి తెస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక హైదరాబాద్ నగరశాఖ ఆధ్వర్యంలో 'సెక్షన్ 8 పేరిట హైదరాబాద్‌పై ఏపీ ప్రభుత్వం కుట్రలను ఓడిద్దాం' అనే అంశంపై బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సదస్సులో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు ప్రసంగించారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ సెక్షన్ 8 అనే అంశం రాజ్యాంగబద్ధంగా లేదని, రాజ్యాంగాన్ని సవరించినా సెక్షన్ 8 అమలు కాదని స్పష్టం చేశారు. దేశ ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ దేశ సమైక్యతకు విరుద్ధంగా ఉందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్ ప్రజాప్రతినిధి కాదని, రాజ్యాంగంలోని విధులు, బాధ్యతలు మాత్రమే ఆయన అధికారాలని వివరించారు. ఏపీ నూతన రాజధాని నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడానికి సెక్షన్ 6ను రూపొందించినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఏపీ రాజధాని నిర్మాణం జరుగుతుందని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. సెక్షన్ 6 ఎందుకు అమలు కావట్లేదని సీమాంధ్ర ప్రజలు, అక్కడి మేధావులు ప్రశ్నించాలని ఆయన సూచిం చారు. హైదరాబాద్‌లో ప్రజలు కలసిమెలసి జీవిస్తున్న విషయాన్ని పాలకవర్గాలు గమనించాలన్నారు. రెచ్చగొట్టేందుకే రాజకీయ నేతలు రకరకాల కుట్రలు చేస్తున్నారని... ప్రజల్లో చిచ్చురేపే ఆలోచనలను మానుకోవాలన్నారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ సెక్షన్ 8ను తొలి నుంచీ తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ అంశాన్ని తెరమీదకు తెస్తున్నారన్నారు. ఏపీ పాలకులు చేసే కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలన్నారు. చట్టాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పిం చేందుకు త్వరలోనే ఒక పుస్తకం తెస్తామన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నగర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవీందర్రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిప్పర్తి యాదయ్య, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బిల్లు చించడం, తగులబెట్టడం రాజ్యాంగ ద్రోహం
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభ తీర్మానం అక్కర్లేదు లోపాల సవరణకు అర్థవంతమైన చర్చ అవసరం ఉమ్మడి హైకోర్టు అనేది కుట్రలో భాగమే సాక్షి, హైదరాబాద్: ‘ఒక పార్టీ అత్యున్నత స్థాయిలో నిర్ణయం తీసుకొని, బిల్లు రూపొందించాక.. ఆ బిల్లును చించడం, తగులబెట్టడం, కాళ్లకింద వేసి తొక్కడం సంప్రదాయానికి విరుద్ధమే కాక రాజ్యాంగ ద్రోహంగా సుప్రీంకోర్టే స్పష్టం చేసింది’ అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును విభజనతోనే ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. పార్టీలు రాజ్యాంగంచేత గుర్తింబడిన వ్యవస్థలని, అవి గాడితప్పినపుడు, ప్రజలను విస్మరించినపుడు ప్రశ్నించడం మనందరి బాధ్యత అని సుప్రీంకోర్టు పేర్కొందన్నారు. సొంత పార్టీ చెప్పినట్లు కాకుండా ఇతరులతో జతకట్టి ఓటు వేసే వారు, పార్టీకి వెన్నుపోటు పొడిచేవారు కుట్రదారులు అవుతారని.. ఈ విషయాన్ని కూడా సుప్రీంకోర్టే తన తీర్పులో విశ్లేషించిందని సుదర్శన్‌రెడ్డి వివరించారు. ఇలాంటి కుట్రదారులు ఇప్పుడు రాజ్యాంగ ఆనవాయితీ గురించి మాట్లాడటం విస్మయం కలిగిస్తోందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు శాసనసభ తీర్మానం అక్కర్లేదని, కేంద్రం చేసిన బిల్లుపై అభిప్రాయాలు మాత్రమే పంపించాలని, తదుపరి ప్రక్రియను కేంద్రం చూసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర శాసనసభ కాదంటే తెలంగాణ ఆగదని, బిల్లులో లోపాలపై చర్చించాల్సిన అవసరం తెలంగాణ ప్రజాప్రతినిధులకే ఎక్కువగా ఉందన్నారు. న్యాయవ్యవస్థపై పట్టుపోతే తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందన్న భయంతో ఉమ్మడి హైకోర్టు డిమాండ్‌ను కుట్రదారులు తెరపైకి తెచ్చారన్నారు. 1956 నుంచే హైకోర్టులో వివక్ష మొదలైందని, ఏడుగురు జడ్జిలను జూనియర్లుగా మార్చి, ప్రధాన న్యాయమూర్తులు కాకుండా, సుప్రీంకోర్టుకు వెళ్లకుండా కుట్ర చేశారని హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ సీవీ రాములు పేర్కొన్నారు. తెలంగాణ జిల్లాల్లోని కోర్టుల్లో 20శాతం కంటే ఎక్కువగా స్థానికేతర ఉద్యోగులు ఉన్నారన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా జడ్జీలు, సీనియర్, జూనియర్ సివిల్ జడ్జీల్లో తెలంగాణకు సరైన ప్రాతినిధ్యం లేదన్నారు. హైకోర్టులో జడ్జీల నుంచి న్యాయవాదుల వరకు వివక్ష కొనసాగుతోందని, మానసికంగావిభజన ఏర్పడిందన్నారు. ఇలాంటి తరుణంలో వేర్వేరు హైకోర్టులు ఉండటమే అందరికి మంచిదన్నారు. రాష్ట్రం ఏర్పడితే సంపూర్ణ అధికారం ఉండాలని, లేదంటే అక్కడి ప్రజలకు న్యాయం చేయలేరని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు క్రియాశీలంగా వ్యవహరించారన్నారు. బిల్లులో సవరణలే ముఖ్యమని, ఇందుకోసం అందరూ కృషి చేయాలన్నారు. మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, హైకోర్టు మాజీ ఏజీ ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ జాఫ్రీ, హైకోర్టు న్యాయవాది రఘునాథ్ మాట్లాడారు. న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలంటూ తెలంగాణలోని అన్ని బార్ అసోసియేషన్లు చేసిన తీర్మానాలను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను, డైరీని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు గోవర్ధన్‌రెడ్డి, రవికుమార్, తిరుపతివర్మ, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.