breaking news
judge blocks
-
డోనాల్డ్ ట్రంప్ వీసా ఆంక్షలు ఎత్తివేత!
వాషింగ్టన్: అమెరికాకు ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధాన్ని అధికారులు తాత్కాలికంగా రద్దుచేశారు. అధ్యక్షుడు ట్రంప్ విధించిననిషేధంపై ఇటీవల సియాటిల్ కోర్టు స్పందిస్తూ.. నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. అయితే నేటి నుంచి పూర్తిస్థాయిలో కోర్టు ఉత్తర్వులను పాటించనున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. వీసా ఉన్న వారిని పూర్తి స్థాయిలో అమెరికాకు అనుమతిస్తున్నామని, వారిపై ఎలాంటి నియంత్రణ ఉండబోదని స్పష్టం చేశారు. వీసా ఆంక్షలను ఎత్తివేయడంతో అమెరికా, ఇతర దేశాల దేశాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ నిషేధిత దేశాల ప్రయాణికులను ఖతర్ ఎయిర్ వేస్ విమానాల్లోకి అనుమతిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ట్రంప్ మాత్రం తనమీద అంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా తన మాటకే కట్టుబడ్డారు. మధ్యలో ఒక్కసారి మాత్రం గ్రీన్ కార్డులు ఉన్నవారికి మినహాయింపు ఇచ్చినా, నిషేధం యథాతథంగా ఉంటుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశం నుంచి శాంతిభద్రతలను తరిమివేస్తున్నారని ఆరోపించిన ట్రంప్.. ఒక జడ్జి తన నిర్ణయాన్ని తప్పుబట్టడంపై కూడా మండిపడ్డారు. -
ట్రంప్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ!
వాషింగ్టన్: ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎద్దురు దెబ్బతగిలింది. ఏడు దేశాల ముస్లిం ప్రజలపై అధ్యక్షుడు విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ సియాటిల్ కోర్టు ఆదేశాలిచ్చింది. అమెరికా జిల్లాకోర్టు న్యాయమూర్తి జేమ్స్ ఎల్ రాబర్ట్ శుక్రవారం ఈ ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేశారు. వాషింగ్టన్ రాష్ట్ర అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గూసన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించి జడ్జి ఈ ఆదేశాలిచ్చారు. దేశవ్యాప్తంగా ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలపై స్పందించిన అటర్నీ జనరల్ ఫెర్గూసన్ రాజ్యాంగం నేడు విజయం సాధించిందనీ, ప్రెసిడెంట్ తో సహా అందరూ చట్టానికి అతీతులు కారని వ్యాఖ్యానించారు. ప్రజలపై మతపరమైన వివక్షను ప్రదర్శించడం, నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధమని ఫెర్గూసన్ తెలిపారు. ట్రంప్ నిషేధం పై దావా వాషింగ్టన్ రాష్ట్రం దాఖలు చేయగగా, ఆ తరువాత మిన్నెసోటా కూడా జత కలిసింది. కాగా ఏడు ముస్లిం దేశాలకు చెందిన వారు అమెరికా రాకుండా ట్రంప్ విధంచిన ఆంక్షల ఆదేశాలపై అమెరికా పౌర హక్కుల నేతల పిటిషన్‌ను విచారించిన డిస్ట్రిక్ట్ కోర్టు ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అటు ట్రంప్ వివాదాస్పద నిర్ణయంపై వ్యతిరేకంగా అమెరికా టెక్ దిగ్గజాలుకూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ట్రావెల్ బ్యాన్ ఆదేశాలపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే.