breaking news
Jennings
-
జెన్నింగ్స్ 'సెంచరీ' రికార్డు!
ముంబై:భారత్ తో జరుగుతున్న ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న నాల్గో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ కీనట్ జెన్నింగ్స్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ఈ స్టేడియంలో టెస్టు అరంగేట్రం చేసి సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు 2006లో ఇంగ్లండ్ ఆటగాడు ఓవై షా ఇక్కడ చేసిన 88 పరుగులే ఇక్కడ ఇప్పటివరకూ అరంగేట్రపు అత్యధిక వ్యక్తిగత స్కోరు. తాజాగా దాన్ని జెన్నింగ్స్ అధిగమించాడు. మరొకవైపు భారత్ లో 2006 నుంచి చూస్తే అరంగేట్రంలోనే 50కి పైగా సాధించిన ఐదో ఇంగ్లండ్ ఆటగాడిగా జెన్నింగ్స్ నిలిచాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఏడు అంతకుపైన వచ్చి భారత్‌లో 50 పైగా పరుగులు సాధించిన ఇంగ్లిష్ అరంగేట్రం ఆటగాళ్లలో అలెస్టకుక్, ఓవై షా, రూట్, హమిద్లున్నారు. ఈ మ్యాచ్ లో అలెస్టర్ కుక్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన జెన్నింగ్స్ ఎటువంటి తడబాటు లేకుండా బ్యాటింగ్ సాగించాడు. అటు భారత పేసర్లను, ఇటు స్పిన్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఇంగ్లండ్‌కు మంచి పునాది వేశాడు. 186 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో శతకం పూర్తి చేశాడు. ఓవరాల్‌గా అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ సాధించిన 19వ ఇంగ్లండ్ ఆటగాడిగా జెన్నింగ్స్ నిలిచాడు. కౌంటీ మ్యాచ్‌ల్లో అమోఘమైన పరుగుల రికార్డు ఉన్న జెన్నింగ్స్ సొంతం. 2016లో 1548 కౌంటీ పరుగులు సాధించాడు. తద్వారా కౌంటీల్లో అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా జెన్నింగ్స్ గుర్తింపు పొందాడు. ఈ పరుగులు సాధించే క్రమంలో అత్యధిక సెంచరీలు(7) రికార్డు కూడా అతని పేరిటే లిఖించబడటం విశేషం. -
ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు
జట్టుతో చేరనున్న జెన్నింగ్స్, డాసన్ వోక్స్‌కు కూడా గాయం న్యూఢిల్లీ: భారత్‌తో చివరి రెండు టెస్టులకు గాను ఇంగ్లండ్ జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లను ఎంపిక చేశారు. గాయపడ్డ ఓపెనర్ హమీద్ స్థానంలో కీటన్ జెన్నింగ్‌స... స్పిన్నర్ అన్సారీ స్థానంలో ఆల్‌రౌండర్ లియామ్ డాసన్ జట్టుతో చేరనున్నారు. హమీద్ స్వదేశానికి వెళ్లగా... అన్సారీ మాత్రం జట్టుతో పాటే ఉండి చికిత్స తీసుకుంటాడు. ఐపీఎల్లో బెంగళూరు కోచ్‌గా పని చేస్తున్న రే జెన్సింగ్‌స కుమారుడు కీటన్ జెన్నింగ్‌స. ఈ రెండు మార్పులను ప్రకటించిన తర్వాత ఇంగ్లండ్‌కు మరో షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ వోక్స్ బొటనవేలి గాయం తీవ్రమైంది. దీంతో తను నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చు.