breaking news
indian origin cricketer
-
ఆస్ట్రేలియా జట్లలోకి మరో ఇద్దరు భారత సంతతి క్రికెటర్లు
భారత సంతతికి చెందిన మరో ఇద్దరు క్రికెటర్లు ఆస్ట్రేలియాలో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే ఢిల్లీలో పుట్టిన నిఖిల్ చౌదరి ఆసీస్ తరఫున అరంగేట్రం చేయగా.. తాజాగా జెర్సిస్ వాడియా, ఆర్యన్ శర్మ అనే ఇద్దరు కుర్రాళ్లు క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన వేర్వేరు జట్లకు ఎంపికయ్యారు.ముంబైలో జన్మించిన జెర్సిస్ వాడియా దక్షిణ ఆస్ట్రేలియా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టులో అతడికి అవకాశం లభించింది. ఇటీవల బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున బ్రిస్బేన్ హీట్‌పై తొలి మూడు బంతులకే వరుసగా మూడు సిక్సర్లు బాది సంచలనంగా మారాడు.మరోవైపు 18 ఏళ్ల ఆల్‌రౌండర్ ఆర్యన్ శర్మను చెన్నైలోని ఎంఆర్ఎఫ్ పేస్ అకాడమీ కార్యక్రమం కోసం ఆస్ట్రేలియా డెవలప్మెంట్ స్క్వాడ్‌లోకి ఎంపిక చేశారు. కుడిచేతి బ్యాటర్, ఎడమచేతి స్పిన్ బౌలర్ అయిన ఆర్యన్ ప్రస్తుతం ఆస్ట్రేలియా అండర్-19 జట్టు, మెల్బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.వలస కుటుంబంలో జన్మించిన ఆర్యన్ శర్మ చిన్నప్పటి నుంచే ఆస్ట్రేలియా తరఫున ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 10 ఏళ్ల వయసులోనే "18 ఏళ్లకు ఆస్ట్రేలియా జట్టుకు ఆడాలి" అని రాసుకున్న లక్ష్యాన్ని అండర్-19 జాతీయ జట్టులో చోటు దక్కించుకుని నిజం చేసుకున్నాడు.వీరిద్దరి ఎంట్రీతో క్రికెట్ ఆస్ట్రేలియాలో భారత సంతతి ఆటగాళ్ల సంఖ్య ఐదుకు చేరింది. నిఖిల్ చౌదరికి ముందు గురిందర్ సంధు, తన్వీర్ సంఘా ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేయగా.. తాజాగా జెర్సిస్ వాడియా, ఆర్యన్ శర్మ ఆసీస్ అరంగేట్రానికి రెడీ అయ్యారు. ఇంకా చాలామంది భారత సంతతి చెందిన క్రికెటర్లు ఆస్ట్రేలియాలో క్రికెట్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. -
T20 WC 2024: పాక్‌ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
టీ20 ప్రపంచకప్-2024లో నిన్న పెను సంచలనం నమోదైంది. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న యూఎస్ఏ.. అన్ని విభాగాల్లో తమకంటే పటిష్టమైన పాకిస్తాన్‌కు ఊహించని షాకిచ్చింది (సూపర్ ఓవర్లో). మెగా టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనూ తమ కంటే మెరుగైన కెనడాకు ఝలక్ ఇచ్చిన యూఎస్ఏ.. నిన్న ఓ సారి ప్రపంచ ఛాంపియన్ అయిన పాక్‌ను మట్టికరిపించి క్రికెట్ ప్రపంచం మొత్తం తమ వైపు చూసేలా చేసుకుంది.ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పాక్‌ను చిత్తు చేసిన యూఎస్ఏ జట్టులో సగం మందికి పైగా భారతీయులు, భారత సంతతికి చెందిన వారు ఉన్నారు. నిన్నటి మ్యాచ్‌లో పాక్‌ను మట్టికరిపించడంలో ప్రధాన పాత్రధారి అయిన సౌరభ్ నేత్రావాల్కర్ (32) ముంబైకి చెందిన వాడు. నేత్కావాల్కర్ అండర్-19 స్థాయిలో భారత జట్టుకు ఆడాడు. లెఫ్ట్ ఆర్మ ఫాస్ట్ బౌలర్ అయిన నేత్రావాల్కర్ ఉద్యోగరిత్యా అమెరికాలో సెటిల్ అయ్యాడు. పాక్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టిన నేత్రావాల్కర్.. సూపర్ ఓవర్లో మరింత మెరుగ్గా బౌలింగ్ చేసి పాక్ ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు.పాక్‌ను ఓడించడంలో మరో ప్రధాన పాత్ర అయిన మోనాంక్ పటేల్ కూడా భారతీయుడే. 31 ఏళ్ల మోనాంక్ యూఎస్ఏ జట్టుకు సారధి. నిన్నటి మ్యాచ్‌లో మోనాంక్ మెరుపు అర్ద సెంచరీ (38 బంతుల్లో 50) సాధించి పాక్ ఓటమికి బీజం వేశాడు. ఈ ప్రదర్శనకు గానూ మోనాంక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. మోనాంక్ గుజరాత్‌లోని ఆనంద్ ప్రాంతానికి చెందిన వాడు.నిన్నటి మ్యాచ్‌లో పాక్‌ను నామమాత్రపు స్కోర్‌కు పరిమితం చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన నోస్తుష్ కెంజిగే (4-0-30-3) కూడా భారతీయుడే. 33 ఏళ్ల కెంజిగే కర్ణాటకలోని చిక్మగళూరులో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. వీరే కాక పాక్‌ను మట్టికరిపించి అమెరికా జట్టులో మరో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. ముంబైలో పుట్టి పెరిగిన 31 ఏళ్ల హర్మీత్ సింగ్, పంజాబ్ మూలాలున్న 31 ఏళ్ల జస్దీప్ సింగ్ పాక్‌ను చిత్తు చేసిన అమెరికా జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఈ ఐదుగురే కాక మరో ఇద్దరు భారతీయులు అమెరికా జట్టులో ఉన్నారు. 33 ఏళ్ల మిలింద్ కుమార్ (ఢిల్లీ), 36 ఏళ్ల నిసర్గ్ పటేల్‌కు (అహ్మదాబాద్, గుజరాత్) తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్‌లో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. యూఎస్ఏ జట్టులో పాక్‌కే చెందిన ఓ ఆటగాడు ఉన్నాడు. 33 ఏళ్ల అలీ ఖాన్ పాక్‌లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన వాడు.మోనాంక్ పటేల్ (ఆనంద్, గుజరాత్)హర్మీత్ సింగ్ (ముంబై)జస్దీప్ సింగ్ (పంజాబ్)నోష్తుశ్ కెంజిగే (చిక్‌మగళూరు, కర్ణాటక)సౌరభ్ నేత్రావాల్కర్ (ముంబై)మిలింద్ కుమార్ (ఢిల్లీ)నిసర్గ్ పటేల్ (అహ్మదాబాద్, గుజరాత్)పాక్-యూఎస్ఏ మ్యాచ్ స్కోర్ వివరాలు..పాక్ 159/7 (20)యూఎస్ఏ 159/3 (20)సూపర్ ఓవర్..యూఎస్ఏ 18/1పాక్ 13/1సూపర్ ఓవర్లో యూఎస్ఏ విజయం -
నరబలికి గురైన భారత సంతతి క్రికెటర్!
దక్షిణాఫ్రికాలో దారుణం జరిగింది. అక్కడ భారత సంతతికి చెందిన మానసిక వికలాంగుడైన క్రికెటర్‌ను అతడికి సన్నిహితంగా ఉండే కొంతమంది వ్యక్తులు తల నరికి నరబలి ఇచ్చారు. ఈ కేసులో పోలీసులు అతడి ప్రాణస్నేహితుడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. నవాజ్ ఖాన్ (23) అనే మానసిక వికలాంగ క్రికెటర్‌ను అతడి ప్రాణ స్నేహితుడు తండోవాఖే డుమా (21) తన ఇంటికి సమీపంలో ఉన్న అడవుల్లోకి తీసుకెళ్లాడు. అతడు నాటువైద్యాలు చేస్తుంటాడు. ఆ అడవిలోనే నవాజ్ ఖాన్‌పై కత్తులతో దాడిచేసి తల నరికేశారు. తనకు కొన్ని సమస్యలున్నాయని, వాటి నుంచి బయటపడాలంటే మనిషి తల తీసుకురావాల్సిందిగా మరో భూత వైద్యుడు చెప్పాడని, అందుకే తాను స్నేహితుడిని బలిచ్చానని డుమా పోలీసుల విచారణలో అంగీకరించి, ఘటనా స్థలాన్ని చూపించాడు. అతడిని పట్టుకోవడంలో స్థానికులు చూపిన చొరవను పోలీసులు ప్రశంసించారు. ఖాన్‌ను చంపి, అతడి మొబైల్ ఫోన్లను తమ వద్ద ఉంచుకున్న మరో ఇద్దరిని కూడా ఈ కేసులో అరెస్టు చేశారు. దక్షిణాఫ్రికాలో మానసిక వికలాంగ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2013 అవార్డును నవాజ్ ఖాన్ గెలుచుకున్నాడని అతడి తల్లి జకియా ఖాన్ చెప్పారు. తాను ఎంతగానో అభిమానించే హషీమ్ ఆమ్లా నుంచి ఈ అవార్డు అందుకుని చాలా సంబరపడిపోయాడని, అది తన జీవితంలోనే అత్యంత మధుర క్షణమని చెప్పేవాడని ఆమె అన్నారు.


