indian epics
-
ఇతిహాసాల్లో ఇంధన సంక్షోభానికి పరిష్కారాలు
రాజ్‌గిర్: బిహార్‌లోని నలంద విశ్వవిద్యాలయం అంతర్జాతీయ సంబంధాల అధ్యయనంలో నూతన పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. నేటి ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలను, రామాయణ-మహాభారతాలలోని సూత్రాలతో ఎలా పరిష్కరించవచ్చనే అంశంపై పరిశోధనలు సాగిస్తోంది. ప్రపంచంలోని 30కి పైగా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు భారతదేశ పురాణ ఇతిహాసాలను దౌత్యపరమైన ఆయుధాలుగా మలుచుకుంటూ అంతర్జాతీయ సంబంధాల (ఐఆర్పీఎస్) విభాగంలో సరికొత్త విశ్లేషణలు చేస్తున్నారు.ఇతిహాసాలే దౌత్య మార్గదర్శకాలునలంద వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సచిన్ చతుర్వేది తెలిపిన వివరాల ప్రకారం ఈ కోర్సు ముఖ్య ఉద్దేశ్యం మన పురాతన జ్ఞాన సంపదను ఆధునిక ప్రపంచ సమస్యలతో అనుసంధానించడమే. ఒక సంక్షోభ సమయంలో భారతదేశం తన వ్యూహాలను ఎలా రూపొందించుకోవాలి? అగ్రరాజ్యాల మధ్య సంబంధాలను ఎలా నిర్వహించాలి? వంటి ప్రశ్నలకు పురాతన భారతీయ గ్రంథాలు గొప్ప పరిష్కారాలను చూపుతున్నాయని ఆయన వెల్లడించారు.రామాయణం - సుగ్రీవ మైత్రి ఒక వ్యూహంఈ కోర్సులో భాగంగా విద్యార్థులు వివిధ పరిశోధనా పత్రాలను సమర్పిస్తున్నారు. ఉదాహరణకు, ‘రామాయణంలోని కిష్కింధ కాండ’ దౌత్యం, సార్వభౌమాధికారం, నైతికతకు ఒక అద్భుతమైన ఫ్రేమ్‌వర్క్ అని ఒక విద్యార్థి తన పరిశోధనలో పేర్కొన్నారు. రాముడు-సుగ్రీవుల మధ్య కుదిరిన మైత్రి కేవలం స్నేహం మాత్రమే కాదు, అది ఆధిపత్యం లేని భాగస్వామ్యం, బాధ్యతాయుతమైన నాయకత్వానికి ప్రతీక అని విద్యార్థులు వివరిస్తున్నారు.మహాభారతం - నేటి ప్రపంచానికి సరికొత్త పాఠాలుమహాభారతంలోని శ్రీకృష్ణుడి నీతిని, ప్రస్తుత యుద్ధ తంత్రాలతో పోల్చి చూస్తున్నారు. ‘జస్ట్ వార్’ భావనను మహాభారత ఘట్టాలతో అనుసంధానిస్తూ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే ఉగ్రవాద సంస్థలు లేదా అరాచక శక్తులను ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా పురాతన పర్యావరణ పరిరక్షణ పద్ధతుల ద్వారా ప్రస్తుత ఇంధన సంక్షోభాన్ని అధిగమించే మార్గాలను కూడా వారు చర్చిస్తున్నారు. ప్రపంచం అశాంతితో ఉన్న తరుణంలో, భారతీయ ఇతిహాసాల నుండి తీసుకున్న ఈ పరిష్కారాలు ప్రపంచ శాంతికి బాటలు వేస్తాయని నలంద విశ్వవిద్యాలయం విశ్వసిస్తోంది.ఇది కూడా చదవండి: బక్రీద్ వేళ.. 40 శాతం పెరిగిన మేకల ధరలు -
సూర్యపుత్ర కర్ణ సినిమాకు అడ్డంకులు తొలగినట్లేనా?
భారతీయ ఇతిహాసం మహాభారతం ఆధారంగా దాదాపు ఐదు సంవత్సరాల క్రితం విక్రమ్ హీరోగా ఆర్ఎస్ విమల్ దర్శకత్వంలో ‘సూర్యపుత్రన్ కర్ణన్’ అనే సినిమా ప్రకటన వెల్లడైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాని దాదాపు మూడొందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తారనే ప్రచారం అప్పట్లో సాగింది. కానీ వివిధ కారణాల వల్ల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ‘సూర్యపుత్రన్ కర్ణన్’ సినిమా ‘రోలింగ్ సూన్’(త్వరలో చిత్రీకరణ ప్రారంభం అవుతుందన్నట్లుగా..) అంటూ కర్ణుడి పాత్రలో ఉన్న విక్రమ్ ఫోటోను షేర్ చేశారు విమల్. అలాగే ఈ సినిమా టీజర్ అంటూ మరో వీడియోను ఆదివారం షేర్ చేశారాయన. మరి... ఈ మూవీకి ఉన్న అడ్డంకులు తొలగినట్లేనా? త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందా? వేచి చూడాలి. -
రాముడిగా రణ్‌బీర్.. రావణుడిగా యశ్?
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి.. ఇంకొన్ని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామాయణం ఆధారంగా అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా ఓ సినిమాను నిర్మించనున్నట్లుగా ప్రకటన వచ్చి దాదాపు మూడేళ్లు ముగిసింది. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. దాంతో ఈ చిత్రం నిలిచి΄ోయిందా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని, ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని నిర్మాతలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించాలని నిర్మాతలు అనుకుంటున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్ర దర్శకుడు నితీష్ తివారి ఈ సినిమా పనులను మరింత వేగవంతం చేశారని బాలీవుడ్లో వినిపిస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట. రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, హనుమంతుడు వంటి ప్రధాన పాత్రలకు ఆర్టిస్టులను ఎంపిక చేసి, లుక్ టెస్ట్‌ను నిర్వహించేందుకు నితీష్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా ఆలియా భట్, రావణుడి పాత్రలో యశ్‌లు నటించనున్నారని, ముందు వీరి లుక్ టెస్ట్ జరుగుతుందని టాక్. మరి.. ఈ ‘రామాయణం’లో రియల్ లైఫ్ జంట ఆలియా, రణ్‌బీర్ సీతారాములుగా కనిపిస్తారా? ‘కేజీఎఫ్’లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విజృంభించిన యశ్ ఈ చిత్రంలో రావణుడిగా బీభత్సం సృష్టిస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
సత్య సంధత..భక్తి పరాయణత
- అలరించిన పౌరాణిక నాటకాలు కర్నూలు (కల్చరల్): నందినాటకోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ప్రదర్శించిన పౌరాణిక పద్య నాటకాలు భారతీయ ఇతిహాసాలలోని ఉన్నత విలువలను చాటి చెప్పాయి. వంశీ కళాక్షేత్రం తిరుపతి నాటక సమాజం ప్రదర్శించిన ‘రావణ బ్రహ్మ’, వేణుగోపాల స్వామి నాట్యమండలి వరంగల్ నాటక సమాజం వారు ప్రదర్శించిన సత్యహరిశ్చంద్ర, మైత్రీ కళాపరిషత్ మహబూబ్‌నగర్ నాటక సమాజం వారు ప్రదర్శించిన ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’ నాటకాలు, రామాయణ భారత గాథలలోని ఔన్యత్యాన్నికి ప్రతీకగా నిలిచాయి. ఆకట్టుకున్న ‘రావణబ్రహ్మ’ బ్రహ్మ వంశానికి చెందిన దశగ్రీవుడు అసురజాతిలో పుట్టి తపస్సు చేసి పరమేశ్వరున్ని మెప్పించి అఖండమైన వరుములు పొంది రావణబ్రహ్మగా గుర్తింపు పొందారు. అసురజాతిలో అత్యంత పరాక్రమవంతుడుగానే కాకుండా ఆధ్యాత్మిక సేవాతత్వం కలిగిన రాజుగా రావణబ్రహ్మ గణుతికెక్కాడు. నిత్యం శివలింగార్చన చేసి లంకను స్వాధీనం చేసుకొని అత్యంత అహంభావంతో మెలిగిన రావణుని చరితను ‘రావణబ్రహ్మ’ నాటకం కళ్లకు కట్టినట్లు చిత్రించింది. రాధాదేవి రచించిన ఈ నాటకంలో పల్లేటిలక్ష్మి కులశేఖర్ అత్యంత హృద్యమైన పద్యాలను రచించారు. జీఎల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆసక్తికరంగా ‘సత్యహరిశ్చంద్ర’ సూర్యవంశపు రాజైన హరిశ్చంద్రుడు క్రమశిక్షణాబద్ధమైన జీవన శైలికి ప్రతీకగా నిలిచాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, తన జీవిత కాలంలో ఎన్నడూ అబద్ధమాడి ఎరుగకపోవడం హరిశ్చంద్రుని ఉత్తమ గుణాలు. ఈ పాత్రలోని సత్యసంధతను హరిశ్చంద్ర నాటకం చక్కగా చాటి చెప్పింది. విశ్వామిత్రుడికి ఇచ్చిన మాట ప్రకారం సత్యహరిశ్చంద్రుడు కట్టుబట్టలతో అడవులకేగడం, కాటి కాపరిగా మారడం, కొడుకు శవాన్ని వల్లకాడులోకి అనుమతించడానికి సుంకం అడగడం నిష్టాగరిష్టమైన గుణాలను ఈ పాత్రలో దర్శకుడు చక్కగా చూపించాడు. వరంగల్ జిల్లా వేణుగోపాలస్వామి నాట్య మండలి కళాకారులు ప్రదర్శించిన ఈ నాటకం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. శ్రీనివాసాచారి దర్శకత్వం వహించిన ఈ నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. హాస్య సన్నివేశాలతో ‘కృష్ణాంజనేయ యుద్ధం’ మహబూబ్‌నగర్ జిల్లా మైత్రీ కళా పరిషత్ కళాకారులు ప్రదర్శించిన కృష్ణాంజనేయ యుద్ధం నాటకం చక్కని హాస్యసన్నివేశాలతో అలరించింది. బలరాముడు, సత్యభామ, గరుత్మండుల గర్వభంగమే ఈ నాటి ప్రధాన సారాంశం. ఈ ముగ్గురి గర్వభంగం చేయడం కోసం శ్రీకృష్ణుడు ఆంజనేయున్ని పురమాయించడం, ఆంజనేయుడు, కృష్ణుడు మధ్యలో రసవత్తరమైన యుద్ధం జరగడం ఈ నాటకంలో ప్రధాన ఇతివృత్తంగా నిలిచింది. చక్కని వ్యవహార శైలిలో హాస్య సంభాషణలతో సాగిన ఈ నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాండ్ర సుబ్రమణ్యం రచించిన ఈ నాటకానికి జగన్నాథరావు దర్శకత్వం వహించారు.


