breaking news
illegal games
-
సమిష్టి కృషితోనే ఆన్లైన్ బెట్టింగ్‌కి చెక్
న్యూఢిల్లీ: దేశీయంగా వేగంగా విస్తరిస్తున్న అక్రమ ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని కట్టడి చేయాలంటే అన్ని వర్గాల నుంచి సమిష్టి కృషి అవసరమని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ ఒక నివేదికలో తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వం, గూగుల్ .. మెటాలాంటి బడా టెక్ కంపెనీలు కలిసి పని చేయాలని పేర్కొంది. ‘ఈ అక్రమ రంగం ఏటా 100 బిలియన్ డాలర్ల పైగా ఉంటోంది. ఏటా 30 శాతం పైగా వృద్ధి చెందుతోంది. డిజిటల్ వినియోగం, సాంకేతిక పురోగతి పెరుగుతుండటం, నియంత్రణపరంగా అనిశ్చితి నెలకొనడం ఇందుకు కారణంగా ఉంటోంది. గ్యాంబ్లింగ్ సంబంధిత ప్రమోషన్లను నియంత్రించడం కష్టతరంగా ఉంటున్న నేపథ్యంలో గూగుల్, మెటాలాంటి బడా సోషల్ మీడియా కంపెనీలతో భారతీయ నియంత్రణ సంస్థలు క్రియాశీలకంగా కలిసి పనిచేయాలి‘ అని నివేదిక వివరించింది. అక్రమ ఆపరేటర్లు అత్యంత అధునాతనమైన డిజిటల్ అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ మాధ్యమాలు, పేమెంట్ వ్యవస్థలు, సాఫ్ట్వేర్ ప్రొవైడర్ల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటున్నారని వివరించింది. ఆన్లైన్ అక్రమ బెట్టింగ్లనేవి మనీలాండరింగ్, అక్రమ చెల్లింపుల సమస్య పెరిగిపోవడానికి దారి తీస్తున్నాయని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అరవింద్ గుప్తా తెలిపారు. గూగుల్, మెటాలాంటి కంపెనీలు సాధారణంగా అడ్వరై్టజింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఈవో) ద్వారా లాభాలు ఆర్జిస్తుంటాయి కాబట్టి అవి అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సంస్థలపై నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకోలేకపోతుంటాయని పేర్కొన్నారు. ‘‘వాటికి వచ్చే ట్రాఫిక్‌లో మూడింట ఒక వంతు ఈ వెబ్సైట్ల నుంచే ఉంటోంది. ఈ వెబ్సైట్లు విస్తరించే కొద్దీ బిగ్ టెక్ కంపెనీలకు అడ్వరై్టజింగ్ రూపంలో ఆదాయాలు వస్తున్నాయి. దీని దుష్ప్రభావాల గురించి పూర్తి అవగాహన లేక ఇన్ఫ్లుయెన్సర్లు వీటిని ప్రమోట్ చేస్తున్నారు’’ అని గుప్తా చెప్పారు. ‘ఆపరేటర్లు అక్రమంగా ఆర్జిస్తున్నారు. మనీ లాండరింగ్ చేస్తున్నారు. పేమెంట్ నిబంధనలను తోసిరాజని డొల్ల కంపెనీల ద్వారా, డి్రస్టిబ్యూషన్ చానల్ ద్వారా అక్రమ మార్గాల్లో చెల్లింపులను పొందుతున్నారు. బిగ్ టెక్ కంపెనీలకు నిధులిస్తున్నారు. కాబట్టి బిగ్ టెక్ కంపెనీలు కూడా వారిని కట్టడి చేయడంపై దృష్టి పెట్టడం లేదు‘ అని గుప్తా పేర్కొన్నారు.నివేదికలోని మరిన్ని అంశాలు.. → దేశీయంగా అక్రమ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కార్యకలాపాలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. 2024 అక్టోబర్–డిసెంబర్ మధ్య పరీమ్యాచ్, స్టేక్, 1ఎక్స్‌బెట్, బ్యాటరీ బెట్ అనే నాలుగు ప్లాట్‌ఫాంలలో 1.6 బిలియన్ పైగా విజిట్స్ నమోదయ్యాయి. → 48.2 మిలియన్ విజిట్లతో దీనికి సోషల్ మీడియా కూడా దోహదకారిగా నిలి్చంది. ఫేస్‌బుక్‌లాంటి ప్లాట్‌ఫాంలలో డైరెక్ట్ పెయిడ్ ప్రకటనలు, కంటెంట్ ప్రమోషన్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ ప్రచార కార్యక్రమాలు మొదలైన వాటి ద్వారా ఈ ట్రాఫిక్ వచి్చంది. నియంత్రణ నిబంధనలపరంగా వాటి వెబ్సైట్ల నిలిపివేతను తప్పించుకునేందుకు ఆయా ఆపరేటర్లు పలు వెబ్సైట్లు నిర్వహిస్తున్నారు. → దాదాపు అన్ని సంస్థలు, (సుమారు 600) ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ, భారత్‌లో జీఎస్టీ నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. → గ్యాంబ్లింగ్ ప్రకటనలను హోస్ట్ చేయకుండా, జీఎస్‌టీలాంటివి చెల్లించని అక్రమ సైట్లను ప్రమోట్ చేయకుండా చర్యలు ఉండాలి. ఆ తరహా సైట్లకు చెల్లింపులు జరగకుండా ఫైనాన్షియల్, పేమెంట్ వ్యవస్థలు నిరోధించాలి. → అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సైట్లను బ్లాక్ చేస్తే సరిపోదని నార్వే, బ్రిటన్, డెన్మార్క్, బెల్జియం, అమెరికా వంటి దేశాల అనుభవాల ద్వారా తెలుస్తోంది. కాబట్టి వెబ్సైట్లను బ్లాక్ చేయడంతో పాటు మార్కెటింగ్పరమైన ఆంక్షలు విధించడం, చెల్లింపులను బ్లాక్ చేయడం మొదలైన వ్యూహాలన్నింటి మేళవింపును అమలు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. → అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ మనుగడ సాగించేందుకు దోహదకారులను పూర్తిగా కట్టడి చేసేందుకు నియంత్రణ విధానాలు వేర్వేరుగా ఉండకుండా సమగ్ర వ్యవస్థ ఏర్పాటు కావాలి. → డిజిటల్ మీడియా చానళ్ల ద్వారా యూజర్లకు చేరువ కాకుండా వాటిని కట్టడి చేయడం, అక్రమ లావాదేవీలను బ్లాక్ చేసేందుకు ఆర్థిక నిబంధనలను కఠినతరం చేయడం, వైట్‌లిస్ట్/బ్లాక్‌లిస్ట్ రూపంలో నియంత్రణ విధానాలను పటిష్టం చేయడం వంటి చర్యలు చేపట్టాలి. → పన్నులు చెల్లించే కంపెనీలతో వైట్‌లిస్ట్ తయారు చేసి, మిగతా వాటిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం వల్ల కొంత నష్టం తగ్గవచ్చు. -
జూలు విదిల్చిన జూదం..!
సాక్షి, నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో పేకాట ‘మూడురాజాలు, ఆరు రాణులు’గా విచ్చల విడిగా సాగుతుంది. ఎంతో మంది పేకాటకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా రాజా, రాణిలతో సాహవాసం చేస్తూ పేకాటలో డబ్బులు పోగుట్టుకుని జోకర్లుగా మిగిలిపోతున్నారు. రోజుకు రూ.లక్షల్లో పేకాటలో డబ్బులు చేతులు మారుతున్నాయి. పట్టణంలోని లాడ్జీలు, ప్రైవేటు గృహాలు, పట్టణ, గ్రామాల్లోని శివారు ప్రాంతాలు పేకాటకు అడ్డాలుగా మారాయి. నిత్యం జిల్లాలో ఎక్కడో ఒక చోట పోలీసుల దాడుల్లో పేకాట రాయుళ్లు పట్టుబడటమే గాక రూ.లక్షల్లో నగదు, సెల్ఫోన్లు, వాహనాలను స్వాదీనం చేసుకుంటున్నారు. జిల్లాలో కొందరు వ్యక్తులు సురక్షిత ప్రాంతాలను అడ్డాగా చేసుకుని పేకాట శిబిరాలను నిర్వహిస్తూ రూ.లక్షలు సంపాదించుకుంటున్నారు. రహస్యంగా పేకాట జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, ప్రాంతాల్లో చాలాకాలంగా పేకాట జోరుగా సాగుతుంది. పేకాట కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మరి పేకాటను ఆడుతున్నట్లు సమాచారం. పట్టణాలలో, గ్రామ శివారు ప్రాంతాలు, వ్యవసాయ పొలాలను తమ అడ్డాలుగా మార్చుకుని పేకాట ఆడుతున్నారు. నగర శివారులు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎవరికీ అనుమానం రాదన్న ఆలోచనతో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసి పేకాటరాయుళ్లను అరెస్టు చేసినా.. వారు మాత్రం తమ పద్దతి మార్చుకోవడం లేదు. పోలీసు యంత్రాంగం పేకాటరాయుళ్లను మాత్రమే కాకుండా పేకాట నిర్వహకులపై గట్టి చర్యలు తీసుకుని బీద, మధ్యతరగతి కుటుంబాలను పేకాట ఊబిలోంచి బయటపడేలా చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది 156 మంది అరెస్టు జిల్లా పరిదిలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో గత సంవత్సరం పోలీసులు జరిపిన దాడుల్లో 156 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేయడమే కాకుండా వారి వద్ద నుండి రూ.3,62,080 నగదును స్వాదీనం చేసుకున్నారు. పోలీసుల దాడుల్లో సెల్ఫోన్లు, వాహనాలు అధికంగా పట్టుబడుతున్నాయి. ఇవిగో సంఘటనలు.. 23జూలై 2019 జిల్లా కేంద్రంలో సంతబజారులో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి రూ.18,100 నగదును స్వాదీనం చేసుకున్నారు. 22 డిసెంబర్ 2019 బిజినేపల్లి మండలంలోని అనకాపల్లితండా శివారులో పేకాట ఆడుతుండగా 11మందిని అరెస్టు చేసి రూ.60వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 2 పిబ్రవరి 2020 బిజినేపల్లి మండల కేంద్రంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేసి రూ.75,500, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని 10మందిని అరెస్టు చేశారు. కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరైనా పేకాట శిబిరాలు నిర్వహిస్తేవారిపై కఠినచర్యలు ఉంటాయి. పేద, మధ్యతరగతి యువత పేకాట ఆడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు. పట్టణ శివారులో, గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా పేకాట ఆడుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. పేకాటలో పట్టుబడిన వారిపై కఠినచర్యలు తీసుకుంటాం. – గాంధీనాయక్, సీఐ, నాగర్‌కర్నూల్ -
పొట్టేలు పందాలపై పోలీసుల దాడి
రెండు పొట్టేళ్లు, రూ10,500 నగదు స్వాధీనం తొమ్మిదిమందిపై కేసునమోదు రంగాపురం(లక్కవరపుకోట):మండలంలోని రంగాపురం గ్రామం సమీపంలో గల చెరువువద్ద రహస్యంగా నిర్వహిస్తున్న పొట్టేళ్ల పందాలపై లక్కవరపుకోట ఎస్సై ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం దాడిచేశారు.ఈ దాడిలో రెండు పందెం పొట్టేళ్లతో పాటు రూ.10,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.అలాగే పందెం నిర్వహిస్తున్న 9మందిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌సీ రాజు,పీసీలు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.