breaking news
Human Resource Management
-
అదిరిపోయే ఆఫర్.. జాబ్ వదిలేస్తే లక్ష డాలర్లు ఇస్తాం! ఇంకా..
సమర్థులు, తెలివైన వారు, ఏటికి ఎదురీదగలిగే ధీరులను ఉద్యోగాల్లో చేర్చుకునేందుకు స్టార్టప్ మొదలు బడా కంపెనీలు పోటీ పడతాయి. ఉద్యోగుల వడపోత కోసం ఒక్కో కంపెనీ ఒక్కో స్ట్రాటజీ అమలు చేస్తుంది. కానీ ప్రపంచంలో ఇంత వరకు ఎవరూ కనీవినీ ఎరుగని కొత్త రకం వ్యూహాన్ని అమలు చేస్తోంది ఈ కంపెనీ. ఇందుకు సంబంధించిన వివరాలు ఐఎన్‌సీ మ్యాగజైన్లో ప్రచురితం అయ్యాయి. స్టార్టప్ మొదలు బడా కార్పొరేట్ కంపెనీల వరకు హ్యుమన్ రిసోర్స్ అనేది పెద్ద టాస్క్. తెలివైన సమర్థులైన ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం మీదనే ఎంత పెద్ద సంస్థ మనుగడ అయినా ఆధారపడి ఉంటుంది. అందుకే చాలా కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు, భారీ ప్యాకేజీ వంటి వ్యూహాలతో సమర్థులును ఎంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. కానీ అమెరికాకి చెందిన లాటీస్ కంపెనీ కొత్త స్ట్రాటజీని అమలు చేస్తోంది. అదేంటో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు! జాబ్ మానేస్తే డబ్బులిస్తాం శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ సర్వీసులను లాటీస్ సంస్థ అందిస్తోంది. ఈ సంస్థ కొత్తగా తమ సంస్థలో అత్యంత సమర్థులు, చురుకైన, తెలివైన, వ్యాపార దక్షత ఉన్న ఉద్యోగులను రాజీనామా చేయమని కోరుతోంది. ఇంత తెలివితేటలు ఉన్న మీరు మా కంపెనీకి అక్కర్లదేని చెబుతోంది. మీరు రాజీనామా చేసి వెళ్లిపోతే మీకు నజరానాగా లక్ష డాలర్లు (రూ.77 లక్షలు) అందిస్తామని చెబుతోంది. ఇదీ స్ట్రాటజీ లాటీస్ అమలు చేస్తున్న వ్యూహం పైకి చూడటానికి వింతగా కనిపించినా.. ఇప్పటి వరకు ఎవరూ అమలు చేయని బిజినెస్ స్ట్రాటజీ ఇందులో ఇమిడి ఉంది. లాటీస్ నుంచి రాజీనామా చేసి వెళ్లిపోయే ఉద్యోగులు తాము నజరానాగా అందుకునే లక్ష డాలర్లతో ఏదైనా ఓ బిజినెస్/స్టార్టప్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ స్టార్టప్ లేదా బిజినెస్ ఐడియా నచ్చితే వీఆర్ఎస్కు అనుమతి ఇస్తారు. అంతేకాదు వాళ్లు కొత్తగా పెట్టబోయే స్టార్టప్/బిజినెస్‌లో రెండు శాతం వాటాను లాటీస్కు కేటాయించాల్సి ఉంటుంది. యంగ్ టాలెంట్‌పై వల చాలా మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ ఐడియాలు ఉన్నవారు. సరికొత్త విషయాలను ఆవిష్కరించే శక్తి ఉన్నావారు లైమ్‌లైట్‌లోకి రాకుండా, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. ఇలాంటి వారికి పిలిచి ఉద్యోగం ఇవ్వడమే కాకుండా వారి ఐడియా నచ్చితే నేరుగా పెట్టుబడి అందివ్వడం అందులో భాగస్వామి అవ్వడం లాటీస్ వ్యూహం. ఇలాం మొదలైన స్టార్టప్‌లలో ఒకటో రెండో హిట్టయినా పెట్టుబడి తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. లేదంటూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీంలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఇద్దరు లాటీస్ అమలు చేస్తున్న వ్యూహం ప్రస్తుతానికి బాగానే వర్కటవుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి రాజీనామా చేసిన స్టార్టప్‌లు పెట్టిన వారిలో రెండు స్టార్టప్‌లు నిలదొక్కుకున్నాయి. పైగా లాటీస్ అమలు చేస్తున్న వ్యూహం చాలా మంది యంగ్ ఎంట్రప్యూనర్లను ఆకర్షిస్తోంది. ఇన్వెస్ట్మెంట్ కోసం కాలయాపన చేయకుండా లాటీస్లో పని చేస్తూనే పెట్టుబడి సమకూర్చుకునేందుకు ఇటువైపు చూస్తున్నారు. వెయిట్ అండ్ సీ మొత్తంగా తాము అమలు చేస్తున్న వ్యూహాం కారణంగా రాబోయే రోజుల్లో యంగ్ టాలెంట్ ఇటువైపు వస్తారనే నమ్మకంతో ఉంది లాటీస్. ఇలా వచ్చే వాళ్లలో ఒకరిద్దరి ఐడియాలు హిట్టయినా తమ కంపెనీ జాతకం మారిపోతుందనే ముందస్తు వ్యూహంతో పావులు కదుపుతోంది. మరి లాటీస్ అమలు చేస్తోన్న ఈ కొత్త వ్యూమం ఏ మేరకు సత్ఫలితాలు అందిస్తుందో వేచి చూడాలి. చదవండి: రూ.3.5 కోట్ల జీతం బాగుంది కానీ జాబ్ బోరుకొడుతోంది! -
మానవ వనరులకు కొదవ లేదు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: దేశంలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలో భారత్ అగ్రభాగంలో నిలుస్తుందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో పేరుందని, ఎగుమతులపై దృష్టి పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. మానవ వనరుల నిర్వహణపై శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కార్మిక చట్టాలు మరింత కట్టుదిట్టం చేశామని చెప్పారు. కార్మిక చట్టాల్లో సవరణలు చేశామని, నియామకం నుంచి పదవీ విరమణ వరకు కార్మికులు లబ్ధిపొందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఉభయ సభల్లో వీటికి ఆమోదం లభిస్తుంద ని భావిస్తున్నామన్నారు. వేతన చెల్లింపులన్నీ డిజిటలైజ్ చేస్తున్నామని, కంపెనీల్లో ఇకపై కార్మికులు తమ వేతనాలను చెక్కులు, ఆన్లైన్లో తీసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.