breaking news
gurram gadda
-
ఆ 102 ఎకరాలు సర్కారువే.. సాలార్ జంగ్ వారసులకు సుప్రీంకోర్టు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్‌లో ఉన్న అత్యంత విలువైన 102 ఎకరాల భూమిపై సాలార్జంగ్ వారసుల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచి్చంది. ఆ భూమి ప్రైవేటు ఆస్తి (అరాజీ–మక్తా) కాదని, అది పూర్తిగా ప్రభుత్వానిదేనని తేలి్చచెప్పింది. ఈ మేరకు గతంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, జిల్లా కోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులను పక్కన పెడుతూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అసలు వివాదం ఏమిటంటే? రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్ కలాన్ గ్రామంలోని సర్వే నం. 201/1లో ఉన్న 102 ఎకరాల భూమిపై మీర్ జాఫర్ అలీఖాన్ (సాలార్జంగ్–3 వారసులు) తదితరులు హక్కులు కోరుతూ వచ్చారు. 1832 నాటి కొనుగోలు పత్రాల ఆధారంగా తమ స్వార్జిత ఆస్తి అని, జాగీర్ల రద్దు చట్టం దీనికి వర్తించదని వారు వాదించారు. 2014లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ వీరి వాదనతో ఏకీభవిస్తూ, ఈ భూమిని అటవీ నోటిఫికేషన్ నుంచి మినహాయించాలని ఆదేశించారు. దీనిని జిల్లా కోర్టు, హైకోర్టు కూడా సమరి్థంచాయి. దీనిని సవాలు చేస్తూ తెలంగాణ అటవీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు జాగీర్ల రద్దుతోనే సర్కారు పరం: 1949లో జాగీర్ల రద్దు రెగ్యులేషన్ వచ్చినప్పుడే సదరు భూములు ప్రభుత్వంలో అంతర్భాగమయ్యాయని కోర్టు స్పష్టం చేసింది. 1953లోనే రెవెన్యూ బోర్డు ఈ భూమిని అటవీ శాఖకు బదలాయించిందని, అప్పటి నుంచి అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అ«దీనంలోనే ఉందని పేర్కొంది. ఆ పత్రాలు చెల్లవు: సాలార్జంగ్ వారసులు చూపించిన 1954 నాటి జాగీర్ అడ్మినిస్ట్రేటర్ లేఖలు, ఇతర పత్రాలు నమ్మదగ్గవిగా లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం జిరాక్స్ కాపీల ఆధారంగా, అసలు రికార్డులను సరిగా పరిశీలించకుండా కింది కోర్టులు తీర్పునివ్వడం సరికాదని తప్పుబట్టింది. అధికారులు పరిధి దాటారు: టైటిల్ (యాజమాన్య హక్కుల) వివాదాలను తేల్చే అధికారం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంటుందని, సమ్మరీ ఎంక్వైరీ చేసే ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్‌కు ఆ అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ తన పరిధిని అతిక్రమించి ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని మండిపడింది. అటవీ శాఖ నిర్లక్ష్యం: ఈ కేసులో సరైన సమయంలో సరైన అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో అటవీ శాఖ అధికారులు అలసత్వం ప్రదర్శించారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మరో అప్పీల్ కూడా కొట్టివేత ఇదే భూమిపై హక్కులు కోరుతూ ఆగా సయ్యద్ నయీమతుల్లా షుస్త్రీ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను (సివిల్ అప్పీల్ నం. 9997/2025) కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ భూమి ప్రభుత్వానిదేనని తేలి్చనందున, ఇతరుల వాదనలకు ఆస్కారం లేదని తేలి్చచెప్పింది. 8 వారాల్లోగా పూర్తి చేయండి.. నగరాల్లో పచ్చదనం రోజురోజుకూ తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేసింది. ఈ 102 ఎకరాల భూమిని ’రిజర్వ్ ఫారెస్ట్’గా ప్రకటిస్తూ, తెలంగాణ ఫారెస్ట్ చట్టంలోని సెక్షన్ 15 కింద పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ ప్రక్రియను 8 వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు కంప్లయన్స్ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమరి్పంచాలని స్పష్టం చేసింది. -
గుర్రంగడ్డ.. కష్టాల అడ్డా!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: చుట్టూ కృష్ణా నది.. మధ్యలో ఊరు.. విద్య, వైద్యం, నిత్యావసరాలు ఏది కావాలన్నా, ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా పడవలో నది దాటాల్సిందే.నది ఉప్పొంగే సమయంలో అయితే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే.. తెలంగాణలోనే ఏకైక ద్వీపంగా పేరు పొందిన గుర్రంగడ్డ వాసుల పరిస్థితి ఇది. పాలకులు మారుతున్నా తమ బాధలు తీరడం లేదని.. వంతెన నిర్మాణం చేపట్టినా ఏళ్లకేళ్లుగా సాగుతూనే ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.సాహసం చేయాల్సిందే..జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో కృష్ణానది మధ్యలో గుర్రంగడ్డ ఉంది. గద్వాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవి వైశాల్యం సుమారు 2,400 ఎకరాలు. ఇక్కడ సుమారు 200 కుటుంబాలు నివసిస్తుండగా, జనాభా వెయ్యికి పైనే ఉంటుంది. గ్రామస్తులు ఇక్కడి 1,500 ఎకరాల్లో వేరుశనగ, వరి వంటి పంటలు సాగు చేస్తున్నారు.ఇక్కడ ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఆపై చదువుకోవాలన్నా, ఏదైనా అనారోగ్యానికి గురైనా, నిత్యావసరాలు కావాలన్నా, చివరికి రేషన్ సరుకుల కోసం కూడా.. నది దాటి వెళ్లాల్సిందే. ఏటా వానాకాలం మొదలై నదిలో ప్రవాహం పెరిగాక కష్టాలు మరింతగా పెరుగుతాయి. దీనితో ఇక్కడి పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ఇక ప్రతిదానికీ నది దాటాల్సి రావడంతో ఈ ఊరు పిల్లలను పెళ్లి చేసుకునేందుకు గానీ, ఊరి వారికి పిల్లను ఇచ్చేందుకు గానీ వెనుకాడే పరిస్థితి ఉందని.. ప్రస్తుతం 40 మందికిపైగా పెళ్లికాకుండా ఉన్నారని స్థానికులు అంటున్నారు.6 ఏళ్లుగా పిల్లర్ల దశలోనే వంతెనగుర్రంగడ్డకు సుమారు ఆరేళ్ల కింద వంతెన మంజూరైంది. అప్పటి నుంచి నిర్మాణం సాగుతూనే ఉంది. ఏటా వానాకాలం ముందు పనులు ప్రారంభించడం, వరద పెరగగానే నిలిపివేయడం కాంట్రాక్టర్‌కు పరిపాటిగా మారిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. పనుల్లో జాప్యంపై కాంట్రాక్టర్‌కు ఐదుసార్లు నోటీసులిచ్చామని, వచ్చే ఏడాది వానాకాలంలోపు వంతెన నిర్మాణం పూర్తిచేస్తామని ఇరిగేషన్ ఈఈ జుబేర్ అహ్మద్ తెలిపారు.ఈ ఫొటోలోని మహిళ పేరు పద్మమ్మ. గుర్రంగడ్డకు చెందిన ఆమెకు అయిజ మండలం ఉప్పలకు చెందిన వెంకటేశ్‌తో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. పుట్టింటికి రావాలంటే నది దాటాలి. దాంతో ఎప్పుడు వచి్చనా భర్తతో కలిసి వస్తుంది. నదికి వరద పోటెత్తితే.. బోట్లు నడవక కొన్నిరోజులు గ్రామంలోనే ఉండిపోవాల్సి వస్తుందని.. అందుకే ఎప్పుడో ఓసారి మాత్రమే వస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది.ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని దాటుతున్నాం గ్రామంలో ఆస్పత్రి లేదు. ఏ చిన్న చికిత్స కోసమైనా గద్వాలకు వెళ్లాలి. గర్భిణిగా ఉన్నప్పుడు, డెలివరీ అయ్యాక చెకప్ కోసం చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బోట్లో నది దాటాల్సి వచి్చంది. వరద వచి్చనప్పుడు ఏ సమస్య వచ్చినా కష్టమే. – సంధ్య, గ్రామ మహిళ -
లైన్‌క్లియర్!
రూ.8.51కోట్ల అంచనాతో డీపీఆర్ సింగిల్‌లైన్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణంతో తీరనున్న దీవిసీమ గ్రామస్తుల కష్టాలు నాలుగునెలల క్రితం తిరిగొచ్చిన ఫైల్ ఎట్టకేలకు సీఈ వద్దకు బ్రిడ్జి నివేదిక జూరాల: గుర్రంగడ్డ గ్రామస్తులు తరతరాలుగా పడుతున్న రాకపోకల కష్టాలు ఇక తీరనున్నాయి. కృష్ణానది మధ్యలో ఉన్న దీవి గ్రామానికి సింగిల్‌లైన్ బ్రిడ్జి సర్వే కోసం ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఎట్టకేలకు రూ.8.51కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ను నీటిపారుదలశాఖ ఛీఫ్ ఇంజనీర్ ఖగేందర్‌కు జూరాల ఇంజనీర్లు పంపించారు. నాలుగు నెలల క్రితం ఎస్ఎస్ఆర్ రేట్లు, క్రాసింగ్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించినట్లయింది. గద్వాల మండలం బీరోలు సమీపంలోని కృష్ణానది మధ్యలో ఉన్న గుర్రంగడ్డ గ్రామానికి నిత్యం సంబంధాలు కొనసాగేలా బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు 2009నుంచి ఫైళ్లలోనే తిరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించడం, మరో కొర్రీతో తిరిగి రావడం, ఏళ్లుగా గుర్రంగడ్డ దీవి ప్రజలు బ్రిడ్జి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తుది డీపీఆర్ సిద్ధమవడంతో త్వరలోనే డీపీఆర్‌కు ఆమోదం లభించి పరిపాలన అనుమతులు లభించే అవకాశాలు మెరుగుపడ్డాయి. వాయిదాల పర్వం స్వాతంత్య్రానికి ముందు గుర్రంగడ్డ దీవి ప్రజలు పుట్టీలతో నదిని దాటే దుర్భర పరిస్థితిని ఎదుర్కొన్నారు. స్వాతంత్య్రం అనంతరం మన ప్రభుత్వాలు గుర్రంగడ్డ దీవి ప్రజలకు హామీలు ఇస్తూనే కాలం గడిపాయి. 2009లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వాక్‌వే బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.40కోట్లతో పరిపాలన మంజూరీఇచ్చింది. 2009 ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలతో గుర్రంగడ్డ దీవికి బ్రిడ్జి నిర్మాణ అంశం వాయిదాపడుతూ వచ్చింది. 2014కు ముందు వాక్‌వే బ్రిడ్జి నిర్మాణం కాకుండా సింగిల్‌లైన్ బ్రిడ్జి నిర్మించాలని అధికారులు మరో ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ప్రాథమిక అంచనా అప్పట్లోనే రూపొందించినప్పటికీ ఎన్నికలు రావడంతో అదికూడా వాయిదాపడింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాటినుంచి సింగిల్‌లైన్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదన మళ్లీ తెరపైకి రావడం, హైదరాబాద్‌కు ఫైల్ వెళ్లడం, పలు లోపాలతో తిరిగి రావడం ఇలా రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఈ విషయమై నీటిపారుదల శాఖ ఈఈ చక్రధరంను వివరణ కోరగా పలు లోపాలకు అవసమైన వివరణలు ఇవ్వడంతో పాటు, కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లకు అనుగుణంగా డీపీఆర్‌ను సిద్ధంచేసి పంపించామని తెలిపారు.


