breaking news
Gunnam Gangaraju
-
‘ఓ కల’ మూవీ నుంచి ఫస్ట్‌సాంగ్ విడుదల
దీపక్ కొలిపాక దర్శకత్వంలో గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ టక్కర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఓ కల. ఎటిర్నిటి ఎంటర్టైన్మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్లపై లక్ష్మీ నవ్య మోతూరు, రంజిత్ కుమార్ కొడాలి, అదిత్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌ని ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, ప్రముఖ దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజు సంయుక్తంగా విడుదల చేశారు. విడుదల అనంతరం వారు మాట్లాడుతూ.. ‘‘ఓ కల మూవీ ఫస్ట్ సాంగ్ చాలా ఫ్రెష్‌గా, కొత్తగా ఉంది. ఇందులోనే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. దర్శకుడు దీపక్ కొలిపాక ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని భావిస్తున్నాను. ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని తెలిపారు. ఇక దర్శకుడు దీపక్ కొలిపాక మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమాకి మంచి గుర్తింపుని తీసుకువచ్చిన మన దర్శకనిర్మాతలు గుణ్ణం గంగరాజు, చంద్రశేఖర్ యేలేటి గార్ల చేతుల మీదుగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్ విడుదలవడం నిజంగా సంతోషంగా ఉంది. సినిమా విషయానికి వస్తే.. ఇది చక్కని ప్రేమకథ’ అన్నారు. ‘హీరో గౌరీశ్.. టాలెంటెడ్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటిగారికి బంధువు. ప్రతి సీన్‌ని చక్కగా అర్థం చేసుకుని నటించాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంటుంది. హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో సహకరిస్తున్నారు. నిర్మాతలు ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిది. ప్రేక్షకులు మంచి ప్రేమ కథను చూసి చాలా కాలం అవుతుంది. ఆ లోటును మా చిత్రం తీరుస్తుందని ఖచ్చితంగా చెప్పగలను’ అని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఈసినిమాలో అలీ, వైవా రాఘవ్, దేవి ప్రసాద్,శక్తి, కమెడియన్ రవితేజ తదితరులు నటిస్తున్నారు. -
సింధు బంగారమే ఎందుకంటే... రాజమౌళి ట్వీట్!
ఒలింపిక్స్ లో సిల్బర్ మెడల్ సాధించిన తెలుగు తేజం పీవీ సింధును 'బాహుబలి' దర్శకుడు రాజమౌళి ప్రశంసల్లో ముంచెత్తారు. ఫైనల్ లో అద్బుతమైన పోరాటస్ఫూర్తిని కనబర్చిన సింధును చూసి తామంతా గర్విస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి గోల్డ్ మెడల్ కంటే గొప్పదని ప్రశంసించారు. అంతేకాదు 'సింధు- వెండి గెలుచుకున్న బంగారం' అంటూ దర్శకనిర్మాత గుణ్ణ గంగరాజు తన బ్లాగులో రాసుకున్న అభిప్రాయాన్ని రాజమౌళి ట్వీట్ చేశారు. సిల్వర్ మెడల్ గెలుచుకున్న సింధులోని గొప్ప సంస్కారాన్ని, ఆమెలోని వినయవిధేయతలను వివరిస్తూ గుణ్ణం గంగరాజు ఈ బ్లాగ్ పోస్టు రాశారు. ఆమె ఎందుకు బంగారం వివరిస్తూ.. గుణ్ణం గంగరాజు రాసిన అభిప్రాయం ఇది... సింధు — వెండి గెలుచుకున్న బంగారం | ggraju - https://t.co/AjGwatdvV3 Reason why the silver girl is actually gold. — rajamouli ss (@ssrajamouli) 20 August 2016 సింధు — వెండి గెలుచుకున్న బంగారం రెండు నిమషాలు బాధ కలిగుండొచ్చు, ఆశించింది చేతికి రాలేదని. భారతీయులందరికీ. తెలుగువాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా. టీవీ ముందు అలా కూర్చుండిపోయి వుండొచ్చు. కాని సింధుకి అంత సమయం కూడా పట్టలేదు, కోలుకోవటానికి. నెట్ అవతలి పక్కకు వెళ్ళింది. అక్కడ నేల మీద బోర్లా పడుకుని ఇప్పటివరకు ఏ యూరోపియన్ అమ్మాయికి దక్కని బంగారు పతకం దక్కిన ఆనందం తో కన్నీళ్ళు కారుస్తున్న కరోలినా మారిన్ ని పైకి లేపి హత్తుకుంది. ఇది సహ అనుభూతి; ఇది తనపైన నెగ్గిన వారికి సింధు చూపిన గౌరవం, ఆప్యాయత. మారిన్ సింధుని కౌగిలించుకొని ఆ విజయోత్సాహంలో తన కోచ్ ల వద్దకు వెళ్ళిపోయింది. తన రాకెట్ కోర్ట్ మీద మర్చిపోయి. సింధు ఆ రాకెట్ తీసి, మారిన్ కిట్ బ్యాగ్ దగ్గర పెట్టి అప్పుడు తన గురువు దగ్గరకు వెళ్ళింది. ఇది సంస్కారం. ఇదీ బంగారం. తల్లితండ్రుల పెంపకం, గురువుల శిక్షణతో వచ్చేది; గవర్నమెంటు సంబరాలతో, శాసనాలతో ఉప్పొంగేది కాదు. సింధు ఏ దేశానిదో, ఏ రాష్ట్రానిదో అన్నది అనవసరం. ఇలాంటి బంగారం ఒకటుంది ప్రపంచంలో. అది మలిచిన రమణ విజయలక్ష్మిలకు, గురువు గోపిచంద్ కు నమస్కరిద్దాం. -
అక్టోబర్ 19న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: గుణ్ణం గంగరాజు (దర్శక-నిర్మాత), సన్నీడియోల్ (నటుడు) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యునికి సంబంధించినది. దీనివల్ల వీరికి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించి, దానిని ముందకు తీసుకు వెళ్లే చొరవ, తెగువ ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు వివాహ యోగం, పిల్లలకు ఉద్యోగ, వివాహ ప్రాప్తి జరుగుతుంది. ట్రాన్స్ఫర్లకోసం ఎదురు చూసేవారికి కోరుకున్న చోటికి ట్రాన్స్ఫరవుతుంది. కొత్త వ్యాపారాలు విస్తరించడానికి ఇది అనుకూల సమయం. వీరు పుట్టిన తేదీ 19. ఇది సూర్య, కుజుల కలయిక కావడం వల్ల జీవితంలో పైకి రావాలనే ఆకాంక్ష, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మంచి పేరు, గుర్తింపు వస్తాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం జీవితంలో మైలురాయి వంటిదని చెప్పవచ్చు. హృద్రోగాలు, నేత్రరోగాలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముందుగానే తగిన పరీక్షలు చేయించుకుని, జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,5,6,8; లక్కీ కలర్స్: రెడ్, రోజ్, ఆరంజ్, గ్రీన్, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: మంగళ, శుక్ర, శని, ఆదివారాలు; సూచనలు: ఆదిత్యహృదయం పఠించడం లేదా వినడం, తండ్రిని కాని, తండ్రితో సమానులైన వారిని కాని ఆదరించడం, అనాథలకు, వికలాంగులకు, వృద్ధులకు తగిన సాయం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
మాది ‘ఏ’ సర్టిఫికెట్ సినిమా :గుణ్ణం గంగరాజు
‘‘ఇతర దేశాల్లో వ్యాపారం పెట్టాలని చాలామంది కోరుకుంటారు. కానీ మా సినిమాలోని ప్రధాన పాత్రలు దానికి భిన్నంగా ఆలోచిస్తాయి. అసలు ఈ భూమి మీదే కాకుండా చందమామ మీద వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన చేస్తారు. దానికి రూపమే ఈ సినిమా’’ అని దర్శకుడు గుణ్ణం గంగరాజు చెప్పారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అమృతం చందమామలో’. అవసరాల శ్రీనివాస్, శివన్నారాయణ, హరీశ్, వాసు ఇంటూరి ఇందులో ప్రధాన పాత్రధారులు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో గంగరాజు ప్రత్యేకంగా ముచ్చటించారు. సాంకేతికంగా ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని, సినిమా ఎక్కువ భాగం బ్లూ మేట్‌లోనే తెరకెక్కించామని, కేవలం డీఐకే ఏడాది పైగా సమయం కేటాయించామని గంగరాజు తెలిపారు. మరికొన్ని విషయాలు ఆయన వివరిస్తూ- ‘‘నేను తీసిన ‘అమృతం’ సీరియల్ ఎంత పాపులరో తెలిసిందే. టీవీ రంగంలో నంబర్‌వన్ ధారావాహికగా నిలిచింది. యూట్యూబ్‌లోనే రెండు కోట్ల మంది ఆ సీరియల్ చూశారు. ‘చాలామంది ‘అమృతం-2’ చేయొచ్చు కదా’ అని అడుగుతుంటారు. అమృతం-2 చేసేబొదులు... ‘అమృతం-1’నే కొనసాగిస్తే పోయేదిగా అని నా వాదన. ఇదంతా దేనికనే ‘ఆమృతం’ ప్రేరణగా ‘అమృతం చందమామలో’ సినిమా చేశాను. నేను, వాసు ఇంటూరి కలిసి ఈ స్క్రిప్ట్ తయారు చేసుకొని సినిమా పూర్తి చేశాం. సెన్సార్ క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు. అయినా మాది మాత్రం ‘ఎ’ సర్టిఫికెట్ సినిమానే. అంటే... అందరూ చూడదగ్గ సినిమా అన్నమాట’’అన్నారు. -
'చందమామలో అమృతం' ట్రైలర్