మాది ‘ఏ’ సర్టిఫికెట్ సినిమా :గుణ్ణం గంగరాజు

మాది ‘ఏ’ సర్టిఫికెట్ సినిమా :గుణ్ణం గంగరాజు


‘‘ఇతర దేశాల్లో వ్యాపారం పెట్టాలని చాలామంది కోరుకుంటారు. కానీ మా సినిమాలోని ప్రధాన పాత్రలు దానికి భిన్నంగా ఆలోచిస్తాయి. అసలు ఈ భూమి మీదే కాకుండా చందమామ మీద వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన చేస్తారు. దానికి రూపమే ఈ సినిమా’’ అని  దర్శకుడు గుణ్ణం గంగరాజు చెప్పారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అమృతం చందమామలో’. అవసరాల శ్రీనివాస్, శివన్నారాయణ, హరీశ్, వాసు ఇంటూరి ఇందులో ప్రధాన పాత్రధారులు.



 సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో గంగరాజు ప్రత్యేకంగా ముచ్చటించారు. సాంకేతికంగా ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని, సినిమా ఎక్కువ భాగం బ్లూ మేట్‌లోనే తెరకెక్కించామని, కేవలం డీఐకే ఏడాది పైగా సమయం కేటాయించామని గంగరాజు తెలిపారు. మరికొన్ని విషయాలు ఆయన వివరిస్తూ- ‘‘నేను తీసిన ‘అమృతం’ సీరియల్ ఎంత పాపులరో తెలిసిందే. టీవీ రంగంలో నంబర్‌వన్ ధారావాహికగా నిలిచింది. యూట్యూబ్‌లోనే రెండు కోట్ల మంది ఆ సీరియల్ చూశారు.



 ‘చాలామంది ‘అమృతం-2’ చేయొచ్చు కదా’ అని అడుగుతుంటారు. అమృతం-2 చేసేబొదులు... ‘అమృతం-1’నే కొనసాగిస్తే పోయేదిగా అని నా వాదన. ఇదంతా దేనికనే ‘ఆమృతం’ ప్రేరణగా ‘అమృతం చందమామలో’ సినిమా చేశాను. నేను, వాసు ఇంటూరి కలిసి ఈ స్క్రిప్ట్ తయారు చేసుకొని సినిమా పూర్తి చేశాం. సెన్సార్ క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు. అయినా మాది మాత్రం ‘ఎ’ సర్టిఫికెట్ సినిమానే. అంటే... అందరూ చూడదగ్గ సినిమా అన్నమాట’’అన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top