breaking news
Fruit Festival
-
చికూ ఫెస్టివల్ గురించి విన్నారా?
ఓ పండు కోసం ప్రత్యేకంగా జరుపుకునే పండుగ ఇది. ఓ మారుమూల గ్రామం ఈ పండుగను ఏటా ఘనంగా నిర్వహిస్తుంది. అంతేగాదు అక్కడ ఉత్పత్తి అయ్యే ఆ పండ్లు మంచి నాణ్యత గల పండ్లగా జీఐ ట్యాగ్‌ను కూడా పొందాయి. ఎక్కడ ఈ పండుగ జరుగుతుంది? దేని గురించి నిర్వహిస్తున్నారు? అసలేం జరిగిందంటే..మహారాష్ట్ర నగరానికి 200 కి.మీ దూరంలో ఉండే బోర్డ్ బీచ్ ముంబై వాసులకు మంచి పర్యాటక ప్రాంతంగా అలరారుతుంది. అక్కడకు సమీపంలో ఉండే దహను జిల్లాలోని ఘెల్వాడ అనే చిన్న తీర గ్రామం ఉంది. ఈ గ్రామం చికూ పండ్లకు మహా ప్రసిద్ధి. ఇంతకీ ఏంటీ చికూ పండు అంటే? అదేనండి మనం ఎంతో ఇష్టంగా తినే సపోటానే కొన్ని చోట్ల "చికూ" పండ్లు అని అంటారు. ఈ పండుని దేశ విదేశాల్లో ఒక్కో పేరుతో ప్రసిద్ధి. అయితే ఈ ఘెల్వాడ్ గ్రామం మాత్రం ఈ చికూ పండ్లు(సపోటా పండ్ల)కు మంచి పేరుగాంచింది. అక్కడ ఎటూ చూసిన ఈ పండ్లే కనిపిస్తాయి. పైగా అక్కడ సపోటా మంచి రుచికరంగా ఉంటుంది. అంతేకాదండోయ్ సపోటాల్లో అవే అత్యంత రుచికరమైన నాణ్యతగల పండ్లగా జీఐ ట్యాగ్‌ను కూడా పొందాయి. ఈ పండ్లను నగరీకరణ పేరుతో కనుమరగ్వ్వకుండా కాపాడాలనే ప్రయత్నంలో భాగంగా ఈ చికూ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు. గ్రామీణ పారిశ్రామికవేత్తల సంక్షేమ ఫౌండేషన్ నేతృత్వంలోని స్థానికి సంఘం 2013 నుంచి ఈ చికూ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది. స్థానిక రైతులు ఈ వ్యవసాయం ద్వారా ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించేలా చేయడమే గాక రైతులకు, పట్టణ కేంద్రాల్లోని జనాభా మధ్య అంతరాన్ని తగ్గించేలా చేయడమే ఈ పండుగ ముఖ్యోద్దేశం. ఈ ఏడాది 10వ చికూ ఫెస్టివల్ ఫిబ్రవరి 10, 11 తేదీల్లో బోర్డి తీరాన ఘనంగా జరుగుతోంది. ఈ పండుగను వీక్షించడానికి పెద్ద ఎత్తున పర్యాటకుల తరలి వస్తారు కూడా. ఈ పండుగలో బీచ్ పారాగ్లైడింగ్, చికూ పొలాలు, ఫుడ్ యూనిట్ల పర్యటన, సైక్లింగ్ ఈవెంట్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్‌షాప్‌లు(వార్లీ పెయింటింగ్), జానపద నృత్యం, స్థానిక సంగీతం తదితరాలు ఎంతగానో అలరిస్తాయి. ఈ చికూ ఫెస్టివల్లో సంగీత విద్వాంసుడు అష్మిక్ పటేల్, సౌరభ్ సేవ్, కథక్ నృత్యకారిణి యోగిని మ్హత్రేతో వంటి కళకారులు ఈ వేడుకలో తమ ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. ఈ ఫెస్టివల్లో ఆ చికూ పండుతో తయారు చేసే ఐస్‌క్రీంలు, కుల్ఫీలు, చిప్స్ వంటి ఎన్నో రకాల ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ సందడి చేస్తాయి. ఒకర రకంగా ఈ పండుగలో ఆ చికూ పండ్ల వ్యవసాయం, వాటి కోసం రైతులు పడే శ్రమ తదితరాలు కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. ఇక్కడ అత్యంతా బాగా ఆకట్టుకునేది ఉమెరగావ్‌లోని ఉద్యానవనాలు. హిరణ్యకేశి నది సమీపంలోని హిరణ్యకేశ్వర్ ఆలయం, గుహలు, తదితరాలు. ఒక పండు కోసం పండుగ నిర్వహించడమే గాక దాని ద్వారా రైతులకు మరింత ఆదాయం వచ్చేలా చేయాలనుకోవడం ప్రశంసించదగ్గ విషయం కదూ! (చదవండి: ఆ మోటర్ సైకిల్‌కి పాక్ అధ్యక్షుడు ఇప్పటికీ డబ్బు చెల్లించలేదట!పాక్‌గా ఏర్పడక ముందు జరిగిన ఘటన) -
మాంద్యం మబ్బున ఉత్సాహపు వాన!
స్పెయిన్‌లో జరిగే ‘టొమాటినా’ ఫెస్టివల్ ప్రస్థానం ఇప్పటిది కాదు. 1945 నుంచి యేటా ఒకటే ఉత్సాహంతో జరుగుతోంది ఈ పండగ. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఈ ఫ్రూట్ఫెస్టివల్ కు ఎంతోమంది హాజరవుతారు. ఎంతో ఉత్సాహంతో దీంట్లో పాలు పంచుకుంటారు. అక్కడి ప్రభుత్వం ఉత్సాహవంతుల కోసం అన్ని ఏర్పాట్లనూ తనే చూసుకునేది. వేల కేజీల టొమాటోలను సరఫరా చేసి.. పండగ చేసుకోమనేది. అయితే యూరప్ దేశాలను పట్టిపీడిస్తున్న ఆర్థికమాంద్యం ఈ టొమాటో ఫెస్టివల్‌ను కూడా వదల్లేదు. ఇప్పటికే ప్రజాసంక్షేమ పథకాలను ఆపేసి, అభివృద్ధి నిధులకు కోతపెట్టిన ప్రభుత్వం టమోటినా ఫెస్టివల్‌కు డబ్బు ఖర్చు చేయడంలో కూడా చేతులెత్తేసింది. ఈ ఫెస్టివల్ పాల్గొనేవారికి ఎంట్రీ టికెట్‌ను పెట్టింది. పది యూరోలు చెల్లించి ఎవరైనా ఈ పండగలో పాలుపంచుకోవచ్చనే నియమాన్ని పెట్టింది. దీంతో ఈ ఫెస్టివల్లో పాల్గొనడానికి వచ్చిన ఉత్సాహవంతులు ‘ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకిలా అన్నారు’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతిమంగా పది యూరోలు చెల్లించిన వారే పండగలో పార్టిసిపేట్ చేశారు. చెల్లించలేమనుకున్నవారు వెనుదిరిగారు! పాల్గొన్నవారు మాత్రం ఫెస్టివల్‌ను కలర్ఫుల్గా జరుపుకున్నారు!