breaking news
flywood industry
-
కోల్‌కతా ఫ్లైవుడ్ షాప్‌లో అగ్నిప్రమాదం
కోల్‌కతా : కోల్‌కతాలోని ఓ ఫ్లైవుడ్ షాప్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. కోల్‌కతా పార్క్ సర్కస్ ప్రాంతంలోని రైఫిల్ రేంజ్ రోడ్‌లోని ఓ కలప షెడ్లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే 12 ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయతిస్తున్నాయి. ప్రమాదం సంభవించడానికి గల కారణాలతో పాటు ఆస్తినష్టానికి సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది. Kolkata: Fire breaks out at Rifle Range Road, Park Circus, 12 fire tenders present at the spot. #WestBengal pic.twitter.com/nPqsDYJrlV — ANI (@ANI) May 29, 2019 -
ఫ్లైవుడ్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాద్గార్‌పల్లిలోని జై భారత్ వుడ్ ఫ్లైవుడ్ ఇండస్ట్రీస్‌లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. అయితే, ఈ ప్రమాదంలో పరిశ్రమలోని 80 శాతం వరకు కలప దగ్ధమైనట్టు తెలుస్తోంది. ప్రమాద నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.