breaking news
Extreme difficulties
-
పోలికతో ప్రమాదమే !
విజయవాడకు చెందిన కార్తిక్ ఓ విశ్వ విద్యాలయంలో ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ప్రతి సెమిస్టర్లో 9 జీపీఏకు పైగా మార్కులు సాధిస్తున్నాడు. కానీ తనకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారితో పోల్చుకుంటూ ప్రతిసారీ తీవ్ర నిరాశకు లోనై ఆత్మనూన్యతాభావంతో ఉంటున్నాడు. దీంతో తల్లిదండ్రులు గమనించి ఓ సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించారు. నగరానికే చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థిని ఇన్‌స్టాలో తరచూ పోస్టులు పెడుతుంటుంది. తాను పెట్టిన రీల్స్ కంటే, స్నేహితుల రీల్స్‌కు ఎక్కువ లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. తనకు తక్కువగా వస్తున్నాయని నిరాశ చెందుతోంది. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల కాలంలో ఎదుటి వారితో తమను పోల్చుకుంటూ తీవ్ర నిరాశకు గురవుతున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. చదువు మార్కులు వారితో సమానంగా రావడం లేదని, సోషల్ మీడియాలో సైతం లైక్‌లు తనకు తక్కువగా వస్తున్నాయని ఇలా అనేక విషయాల్లో ఎదుటి వారితో పోల్చుకుంటూ ఆత్మనూన్యతా భావానికి గురవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు ఇటీవల అధ్యయనాల్లో వెల్లడైంది. వారిలా నేనెందుకు సక్సెస్ కాలేక పోతున్నామని కుంగుబాటుకు గురవుతున్నట్లు మానసిక నిపుణులు అంటున్నారు. ఇతరులతో పోల్చుకోవడం ప్రేరణను ఇవ్వకపోగా మనల్ని మనమే నాశనం చేసుకునేలా చేస్తుందంటున్నారు. ఈ సమస్యతో పిల్లలు, విద్యార్థులే కాదు, లక్షల కుటుంబాలు బాధపడుతున్నాయి. ఈ పది మార్గాలు పాటించండి.. ఇతరులతో పోల్చుకోవడం ఆపండి. ‘నిన్న కంటే నేడు ఏం మెరుగయ్యాను’ అని ప్రశ్నించుకుని మీ ప్రోగ్రెస్‌ను గమనించండి. సోషల్ మీడియా ఒక ఫిల్టర్ చేసిన ప్రపంచం. ఇన్‌స్టాగామ్‌లో ఎవరి విజయమూ ఫుల్ స్టోరీ కాదు. మీ ప్రయాణం నిజమైనదిగా, నిజాయతీగా ఉంటే చాలు. ప్రయత్నం మీద ఫోకస్ చేయండి. ఎంతసేపు కష్టపడ్డారు, ఎలా ఫోకస్ చేశారన్నదే అసలైన విజయానికి సూచిక. మీ బలాల జాబితా తయారు చేసుకోండి. ‘నాలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి...?’ అని రాసుకోండి. మైండ్ ఫుల్ బ్రేకులు తీసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకోండి. పోలిక వల్ల వచ్చే నెగిటివ్ భావాల నుంచి బయటపడేందుకు ప్రతిరోజూ పది నిమిషాల సేపు మైండ్ ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి. పరీక్షలు ఓ పోటీ కాదు, నేర్చుకునే ప్రయాణం అని గుర్తుంచుకోండి. ఫలితాల కోసమే కాకుండా, అభివృద్ధి కోసం చదవండి. ఇతరులు చేసిన విమర్శలు మీ విలువకు ప్రమాణం కాదు. ఏదైనా కామెంట్, మెసేజ్ వల్ల తక్కువగా ఫీలవకండి. అది వాళ్ల అభిప్రాయం మాత్రమే అని గుర్తించండి. మీ సొంత లక్ష్యాలపై స్పష్టత కలిగి ఉండండి. ఇతరులు ఎటు పోతున్నారన్న దానికన్నా, మీరు ఎందుకు చదువుతున్నారన్న దానిపై దృష్టి పెట్టండి. తప్పుల నుంచి నేర్చుకోండి. తప్పు చేయడమంటే ఫెయిలవ్వడం కాదు, నేర్చుకునే అవకాశం అనే దృష్టితో చూడండి. మీరు వేరెవరిలానో మారాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు అంగీకరించుకోండి. మీ బాటలో మీరున్నారని నమ్మండి. అసలేంటీకంపేరిజన్ సిండ్రోమ్.. ? మనిషి తనను తాను అర్థం చేసుకునేందుకు ఇతరులతో పోల్చుకుంటాడు. అది సహజం. కానీ టెక్నాలజీ, సోషల్ మీడియా, టాప్ ర్యాంక్స్, పక్కింటి పిల్లలతో పోలికలు– ఇవన్నీ ఇప్పుడు పిల్లల మనసుల్లో భయాన్ని, ఆందోళనను, న్యూనత భావాన్ని నింపుతున్నాయి. ఇలా ఇతరులతో పోల్చుకుని తనను తాను తక్కువ చేసుకోవడమే కంపేరిజన్ సిండ్రోమ్. సోషల్ కంపేరిజన్ సిద్ధాంతాన్ని 1954లో లియోన్ ఫెస్టింజెర్ అనే సైకాలజిస్ట్ ప్రతిపాదించాడు. మన అసలైన విలువను పక్కన పెట్టి, ఇతరుల ప్రమాణాలతో మన జీవితం నడపడమే దీని లక్షణం. ఈ పోలికలు వాళ్లకంటే తక్కువగా ఉన్నవారితో లేదా మెరుగ్గా ఉన్నవారితో జరగొచ్చు. పోలికలు నెగిటివ్ దిశలో ఎక్కువగా జరిగితే ఆత్మన్యూనత, అసంతృప్తి, ఆత్మనింద పెరుగుతాయి. = కంపేరిజన్ అనేది ఒక ట్రాప్. ఏ రెండు వేలిముద్రలూ ఒకలా ఉండనట్లే, ఏ ఇద్దరు విద్యార్థులూ ఒకేలా ఉండరు, ఒకేలా చదవరు, చదవలేరు. ఈ కంపేరిజన్ ట్రాప్ నుంచి బయటపడితేనే అసలైన ప్రతిభ కనిపిస్తుంది. అర్ధవంతమైన లక్ష్యాలు నిర్దేశించుకోవాలి.. పోలిక హానికరమైన ప్రభావాలను గుర్తించడం, మన ప్రత్యేకతను స్వీకరించడం, కృతజ్ఞతను పెంపొందించుకోవడం చేయాలి. అర్థవంతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం, మద్దతు ఇచ్చే సమాజాన్ని నిర్మించడం ద్వారా, మనం పోలిక ఉచ్చు నుంచి బయటపడి మన సొంత వ్యక్తిగత వృద్ధిపై దృష్టి పెట్టవచ్చు. – డాక్టర్ గర్రే శంకరరావు,సైకాలజిస్ట్ -
Delhi: భానుడి ఉగ్రరూపం.. 24 గంటల్లో 33 మంది మృతి
దేశరాజధాని ఢిల్లీలో భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఎండ వేడిమికి జనం పడరాని పాట్లు పడుతున్నారు. గడచిన 24 గంటల్లో వడదెబ్బకు 33 మంది మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.ఐదు జిల్లాల్లో వడదెబ్బ కారణంగా మృతిచెందినవారి వివరాలు పోలీసులకు ఇంకా లభ్యం కాలేదు. వడదెబ్బకు బలైనవారిలో అత్యధికులు ఫుట్‌పాత్‌లు, నైట్ షెల్టర్లలో ఉంటున్నవారేనని పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు ప్రతిరోజూ వందకుపైగా బాధితులు వాంతులు, తల తిరగడంలాంటి సమస్యలతో వస్తున్నారు.లజ్‌పత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 24 గంటల్లో ఎనిమిది మంది మృతి చెందారు. అలాగే నెహ్రూ నగర్ ఫ్లైఓవర్ కింద రెండు మృతదేహాలు, మూల్‌చంద్ ఆస్పత్రి ముందు ఫుట్‌పాత్‌పై ఓ వ్యక్తి మృతదేహం, మూల్‌చంద్ మెట్రో స్టేషన్ సమీపంలో ఒకని మృతదేహం లభ్యమైంది. లజ్‌పత్ నగర్లో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఉత్తర జిల్లాలో ఎనిమిది మృతదేహాలు, వాయువ్య జిల్లాలో ఏడు మృతదేహాలు పోలీసులకు లభ్యమయ్యాయి. జన్‌పథ్ లేన్ ఫుట్‌పాత్‌పై ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అత్యధిక ఉష్ణోగ్రతల బారినపడటంతోనే వీరు మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మరోవైపు ఎండ వేడిమికి నెమళ్లు మృతి చెందుతున్నాయని నైరుతి జిల్లా పోలీసులు తెలిపారు. గత 24 గంటల్లో పోలీసులకు లభ్యమైన 33 మృతదేహాలు ఇంకా గుర్తిపునకు నోచుకోలేదు. ఈ మృతదేహాలను పోస్టుమార్టం కోసం వివిధ ఆస్పత్రులలో ఉంచారు. -
డైట్ తిప్పలు
డైట్ కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. రోజుల తరబడి సాగుతున్న ప్రక్రియతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఆన్లైన్లోనే ఉన్న డైట్ కౌన్సెలింగ్ ప్రక్రియను అధికారులు స్పాట్‌కు మార్చడంతో కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్న 618 మంది జిల్లాలోని అభ్యర్థులంతా మెదక్‌కు రావాల్సిన పరిస్థితి తలెత్తింది. వ్యయప్రయాసలకోర్చి ఇక్కడికొచ్చిన వారికి గత రెండు రోజులుగా కొనసాగిస్తున్న కౌన్సెలింగ్‌ను మరో రోజుకు అధికారులు పొడిగించడంతో అభ్యర్థులు మండిపడుతున్నారు. చిన్నపిల్లలతో మహిళా అభ్యర్థుల బాధలు వర్ణనాతీతం. డీఈడీ చేస్తే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండడంతో అభ్యర్థులు డైట్లో ప్రవేశానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ సీట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా డైట్ అడ్మిషన్ కౌన్సెలింగ్‌ను సులభతరం చేసేందుకు 2012-13లో ప్రభుత్వం వెబ్ ఆప్షన్‌కు అవకాశం కల్పించింది. దీంతో ఎంట్రెన్స్ రాసిన అభ్యర్థులు ఎక్కడి నుంచైనా ఆన్ లైన్ ద్వారా వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం లభించింది. 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లను ఆన్లైన్ ద్వారానే నిర్వహించారు. మూడో విడతకు వచ్చేసరికి జిల్లాలోని ప్రభుత్వ డైట్ కళాశాలలోనే స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ముందుకు సాగని కౌన్సెలింగ్.. జిల్లాలో మొత్తం 24 ప్రైవేట్, ప్రభుత్వ డైట్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 240 సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద, మిగిలిన 1,060 సీట్లు కన్వీనర్ కోటాలో కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రస్తుతం మూడో విడతకు వచ్చేసరికి 52 తెలుగు మీడియం, 11 ఉర్దూ మీడియం సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందుకోసం జిల్లాల వారీగా ప్రభుత్వ డైట్ కళాశాలల్లో ఈనెల 6న కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఇందుకోసం 618 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రెండు రోజుల్లో కౌన్సెలింగ్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండడంతోపాటు, 200 నుంచి 300 కళాశాలలకు ఆప్షన్లు ఇస్తుండడంతో ఒక్కో అభ్యర్థికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ దశలో రెండు రోజుల గడువు చాలకపోవడంతో మరో రోజు పెంచారు. 6,7 తేదీల్లో సుమారు 350 మందికి కౌన్సెలింగ్ పూర్తి చేశారు. మిగతా 268 మంది ఎదురు చూస్తున్నారు. బుధవారం ఎంత ఆలస్యమైనా కౌన్సెలింగ్ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. రెండు రోజులుగా.. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మొదటి రోజు అవకాశం దక్కని అభ్యర్థులు రెండో రోజు కూడా వచ్చారు. రెండో రోజూ అవకాశం దొరకని వారు మూడో రోజు కూడా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బస్సు చార్జీలతోపాటు రాకపోకలు సాగించ డం, వసతుల కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చంటి పిల్లల తల్లులు సైతం రెండు రోజులుగా అవస్థలు పడ్డారు. అమ్మాయిలు తమ తల్లిదండ్రులను తోడుగా తెచ్చుకుంటున్నారు. కౌన్సెలింగ్ వేగంగా జరగకపోవడం తో తమ నంబర్ వచ్చే వరకు ఇలా వీరంతా డైట్లో పడిగాపులు కాస్తున్నారు. స్లైడింగ్ లేక సమస్య.. గతంలో మొదటి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు రెండో, మూడో విడతల్లో తమ ర్యాంకుకు అనుగుణంగా దగ్గరి కళాశాలల్లోకి అడ్మిషన్ బదిలీ చేయించుకునే(స్లైడింగ్) అవకాశం ఉండేది. కానీ ఈసారి ఆ అవకాశాన్ని తొలగించడంతో అభ్యర్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.