breaking news
Equatorial Guinea
-
అంతుచిక్కని వ్యాధితో 8 మంది మృతి.. రెండు గ్రామాల్లో లాక్డౌన్..
మలాబో: ఆఫ్రికా దేశం ఈక్వెటోరియల్ గినియాలో అంతుచిక్కని వ్యాధి బెంబేలెత్తిస్తోంది. రక్తస్త్రావ జ్వరంతో 8 మంది చనిపోవడం స్థానికులను హడలెత్తిస్తోంది. ఈ వ్యాధి ఏంటో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన 8 మంది తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయారు. రక్తస్రావం, జ్వరంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన అధికారులు 200 మందిని క్వారంటైన్‌కు తరలించారు. రెండు గ్రామాల్లో లాక్డౌన్ విధించారు. వ్యాధి బారినపడిన వారి నమూనాలను సేకరించి పొరుగు దేశం గబాన్‌కు పంపారు. లాసా, ఎబోలా వంటి ప్రాణాంతక మహమ్మారులు వెలుగుచూసిన ప్రాంతం కావడంతో కొత్త వ్యాధి గురించి అధికారులు ఆందోళన చెందుతున్నారు. అంతుచిక్కని వ్యాధిబారిన పడిన వారు ముక్కు నుంచి రక్తం కారడం, జ్వరం, కీళ్ల నొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలతో గంటల్లోనే చనిపోయారని అధికారులు వివరించారు. ఈ వ్యాధిపై నిఘా కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈక్వెటోరియల్ గినియా పొరుగు దేశం కామెరూన్ కూడా ఈ వ్యాధి పట్ల అప్రమత్తమైంది. సరిహద్దుల్లో ఇతరులకు ప్రవేశం లేకుండా ఆంక్షలు విధించింది. చదవండి: టర్కీ విధ్వంసం.. నాలుగు రోజులు మూత్రం తాగి బతికిన యువకుడు.. -
చర్మం ఒలిచి అవయవాలు తినేస్తాడు!
మలాబో: 'నేను మనిషి మాంసం తిన్నాను.. అంత రుచికరంగా లేదు' అని ప్రకటించి ప్రపంచాన్ని నెవ్వెరపోయేలా చేశాడు ఉగాండా మాజీ నియంత ఇడీ అమీన్. ఇప్పుడు అతన్ని మించిన మరో 'హ్యూమన్ ఈటర్' డిక్టేటర్ ను గురించి నిగూఢవిషయాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలోనే అత్యధిక కాలం నియంతగా కొనసాగుతున్న రికార్డు అతనిది. సైన్యమేకాదు చర్చి ఫాదర్లు సైతం ఆయన కనుసన్నల్లోనే నడుచుకోవాలి. కాదూ కూడదు అని ఎవరైనా ఎదురుతిరిగారో.. బతికుండగానే చర్మం ఒలిపించి, శత్రువుల అవయవాలు తినేస్తాడు! సబ్- సహారా దేశమైన ఈక్వెటోరియల్ గునియాను 37 ఏళ్లుగా పాలిస్తోన్న నియంత నేత థియోడరో ఓబియాంగ్ ఎన్గ్యుమా ఎంబసోగో(74) తన శత్రువుల చర్మాలు ఒలిపించి, అవయవాలు తినేస్తాడని.. గతంలో అతనితో సంబంధాలున్న సెవెరో మోటో అనే వ్యక్తి శుక్రవారం ఓ రేడియో చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎంబసోగో తనను తాను దైవంగా భావిస్తాడని, అడ్డుతగిలేవాళ్లను కర్కశంగా అంతంచేసే హక్కు తనకుందనుకుంటాడని సెవెరో పేర్కొన్నాడు. సబ్ సహారా ప్రాంతంలోని ఇతరదేశాల్లాగే ఈక్వెటోరియల్ గునియాలోనూ అపారమైన చమురు నిక్షేపాలున్నాయి. అక్కడ విదేశీ సంస్థలు భారీ ఎత్తున ఆయిల్ ను వెలికితీస్తున్నాయి. అయితే పన్నుల రూపంలో లభించే డబ్బంతా ఎంబసోగో కుటుంబం అకౌంట్ లోకే వెళుతోందేతప్ప ప్రజల బాగుకోసం ఉపయోగపడటంలేదనే విమర్శలు ఉన్నాయి. కాగా, చర్మం ఒలిపించి, అవయవాలు తినడం, అవినీతికి పాల్పడటం అదితర ఆరోపణల్లో నిజం లేదని, ఎంబసోగోను పగడొట్టి, ఆయిల్ ను కొల్లగొట్టేందుకు విదేశీ శక్తులు సాగిస్తోన్న దుష్ర్పచారమని ఆయన అనుచరులు అంటున్నారు.