breaking news
DPI website
-
జోరు మీదున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం జీడీపీలో 1 శాతం వాటా కలిగి ఉండగా, 2030 నాటికి ఇది 4 శాతానికి చేరుకుంటుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. చరిత్రాత్మక మార్పు మలుపు దశలో భారత్ ఉన్నట్టు పేర్కొంది. రానున్న రోజుల్లో ఈ డిజిటల్ వ్యవస్థలు సామాజిక, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని తెలిపింది.ఈ లక్ష్యాలను చేరుకోవడానికి నీతి ఆయోగ్ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. రాష్ట్రాల నాయకత్వంలో సాగే వినూత్న కార్యక్రమాల ద్వారానే డీపీఐ 2.0 విజయవంతమవుతుందంటూ.. దీనికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ మార్గదర్శకులుగా వ్యవహరిస్తాయని పేర్కొంది. రంగాల వారీ మార్పులు తీసుకురావడానికి రెండేళ్ల కార్యాచరణను అనుసరించాలని సూచించింది. తొలి ఏడాది ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టులను చేపట్టి, వాటి ఫలితాలను విశ్లేషించాలని పేర్కొంది. మొదటి ఏడాది సాధించిన విజయాలను రెండో ఏడాది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించింది. ఉపాధి కల్పన కీలకం.. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించే అభివృద్ధి మార్గాలు అవసరమని నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ ఈ నివేదికను విడుదల చేసిన సందర్భంగా పేర్కొన్నారు. ‘‘గత దశాబ్ద కాలంలో సేవలను ప్రజలకు చేరవేయడంలో, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో డిజిటల్ వ్యవస్థలు అద్భుతమైన పనితీరు చూపించాయి. రాబోయే దశలో డిజిటల్ అనుసంధానానికే పరిమితం కాకుండా, ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం, సామర్థ్యాలను పెంచడంతోపాటు.. రంగాలు, ప్రాంతాల వారీ కొత్త చోదక కేంద్రాలను సృష్టించడంపై దృష్టి సారించాలి’’అని సూచించారు. -
నూతన ఫీజు
- ప్రైవేటు పాఠశాలల్లో అదనపు దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకే - సలహాలు, సూచనల కోసం డీపీఐ వెబ్సైట్లో వివరాలు సాక్షి, బెంగళూరు : ప్రాంతాన్ని బట్టి విద్యార్థుల నుంచి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం వసూలు చేయాల్సిన ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదాను విద్యానిపుణులు, పాఠశాలల యాజమాన్యాలతో పాటు ప్రజల సౌకర్యార్థం డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ (డీపీఐ) అధికారిక వెబ్సైట్లో ఉంచింది. దీనిపై సలహాలు, సూచనలను ఇవ్వడానికి 30 రోజుల సమయాన్ని ప్రకటించింది. ఒకే ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో వేర్వేరు ఫీజులు ఉన్న విషయమై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై పూర్తి నివేదికను అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఈ ఏడాది మార్చిన ఆదేశించింది. దీంతో విద్యాశాఖ కమిషనర్ నేతృత్వంలో 14 మంది సభ్యులతో కూడిన కమిటీని అదే నెల 13న ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీలో ఉన్న ఐదుగురు సభ్యులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని పాఠశాలలను సందర్శించి, అక్కడి మానవవనరులు, అందిస్తున్న జీతభత్యాలతో పాటు విద్యాసంస్థల్లోని మౌలిక వసతులను పరిగణలోకి తీసుకుని ఫీజులను నిర్ణయించారు. అంతేకాకుండాఆయా తరగతుల్లో చేరడానికి విద్యార్థులకు ఉండాల్సిన కనీస వయసు, తరగతిలోని విద్యార్థుల సంఖ్య, బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్య ఈ వివరాలనే డీపీఐ అధికారిక వెబ్సైట్ www.schooleduction.kar.nic.in లో ఉంచారు. నూతన ఫీజు విధానం మేరకు ఒక్కొక్క విద్యార్థికి చెల్లించాల్సిన ఏడాది ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి... ప్రీ ప్రైమరీ పాఠశాలలు బీబీఎంపీ - రూ.11,500 మైసూరు, హుబ్లీ, డార్వాడ -రూ. 6,900 మిగిలిన జిల్లా కేంద్రాలు - రూ.5,600 తాలూకా కేంద్రాలు - రూ.3,750 గ్రామాల్లో - రూ.1,872 లోయర్, హయ్యర్ ప్రైమరీ పాఠశాలలు బీబీఎంపీ, మైసూరు, హుబ్లీ, డార్వాడ -రూ. 6,400 మిగిలిన జిల్లా కేంద్రాలు - రూ.4,600 తాలూకా కేంద్రాలు - రూ.2,800 గ్రామాల్లో - రూ.1,800 హై స్కూల్ బీబీఎంపీ, మైసూరు, హుబ్లీ, డార్వాడ -రూ.13,130 మిగిలిన జిల్లా కేంద్రాలు - రూ.6,000 తాలూకా కేంద్రాలు - రూ.5,200 గ్రామాల్లో - రూ.4,160


