breaking news
Doctor misbehave
-
నన్ను కలిస్తేనే సర్టిఫికెట్.. మహిళకు వైద్యుడి వేధింపులు
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా పెద్దాస్పత్రి వైద్యులపై ఇంతకాలం విధులకు ఆలస్యంగా వస్తున్నారని, సమయానికి వచ్చినా కొద్దిసేపు ఉండి వెళ్లి పోతున్నారనే ఆరోపణలు ఉండేవి. కానీ ఇప్పుడు సర్టిఫికెట్ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళపై కన్నేసిన ఒక వైద్యుడు ఆమెను వేధించినట్లు వెలుగుచూడడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. ఖమ్మం జిల్లాకు చెందిన తన తండ్రికి సదరమ్ సర్టిఫికెట్ ఇప్పించేందుకు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మహిళ గత నెలలో తన తండ్రితో పాటు పెద్దాస్పత్రికి వచ్చింది. ఓపీ చీటీ రాయించుకుని ఓ వైద్యుడి వద్దకు వెళ్లగా ఆయన మహిళపై కన్నేశాడు. ఆమె ఫోన్ నంబర్ తీసుకుని తరచుగా ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. ఈ తతంగం గత నెల 17నుండి జరుగుతోంది. సదరం సర్టిఫికెట్ కావాలంటే తనతో శారీరకంగా కలవాలని వేధిస్తున్న ఆయన, గత వారం ఒంటరిగా రావాలని సూచించాడు. దీంతో విసిగిపోయిన మహిళ ఈనెల 4వ తేదీన పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేసింది. చదవండి: అన్నా.. మనల్ని పిలుస్తారే!.. బెంబేలెత్తుతున్న ఎమ్మెల్యేలు, మాజీలు అలాగే, రెండు రోజుల క్రితం ఖమ్మంలో పోలీసులకు సైతం ఫిర్యాదు ఇచ్చింది. తండ్రి సర్టిఫికెట్ కోసం వెళ్తే తనను మానసికంగా వేధించిన వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరగా ఆస్పత్రి సూపరింటెండెంట్ విచారణ చేపట్టారు. ఈమేరకు విచారణకు హాజరుకావాలని వైద్యుడికి సూపరింటెండెంట్ సూచించిన నాటి నుంచి విధులకు గైర్హాజరవుతున్నాడు. ఈ విషయ మై సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడిని విచారణకు రావాలని సమాచారం ఇవ్వగా విధులకే కావడం లేదని తెలిపారు. త్వరలోనే విచారణ చేపట్టి వైద్యుడిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని, ఆతర్వాత విషయం పోలీసులు చూసుకుంటారని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. -
బాలిక పట్ల వైద్యుడి అనుచిత ప్రవర్తన, కేసు నమోదు
అమేథి: వైద్యో నారాయణా హరీ.. !! వైద్యుడు దేవుడితో సమానమంటారు. కనిపించని దేవుడు కంటే ప్రాణాలు నిలబెట్టే వైద్యుడినే దేవుడిగా భావిస్తారు. అలాంటి పవిత్రమైన వృత్తిని చేపట్టిన ఓ వైద్యుడు దారితప్పి ప్రవర్తించాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన ఓ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించి అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో అమేథి జిల్లా, కామరౌలీ ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని అమేథి జిల్లా కామరౌలీ ప్రాంతంలో యుసీ పాండే అనే వైద్యుడు క్లినిక్ నడుపుతున్నాడు. చికిత్స నిమిత్తం క్లినిక్‌కు వచ్చే ఆడవాళ్లపై అయ్యగారి కన్నుపడింది. చికిత్స నిమిత్తం క్లినిక్‌లో చేరిన16ఏళ్ల బాలికతో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాలిక ఆమె తల్లికి చెప్పింది. దాంతో బాధితురాలి తల్లి వైద్యుడిపై కామరౌలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు వైద్యుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, బాలిక ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్టు పోలీసులు చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు.