breaking news
Delhi Traffic Police
-
హారన్ మోగించరు.. గీత దాటరు
ఆ ప్రాంతం పేరు జొకోసంగ్.. నగరంలోని అతి ప్రధాన రోడ్డు.. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు అధికంగా ఉండటంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒకవైపు వెళ్లే ట్రాఫిక్ అధికంగా ఉంది.. ఆ వైపు వాహనాలు నిలిచి పెద్ద వరస ఏర్పడింది.. మరోవైపు మాత్రం రోడ్డు ఖాళీగా ఉంది.. కానీ రోడ్డు మధ్యలో డివైడర్ లేకున్నా.. ఒక్క వాహనం కూడా గీత దాటలేదు. ఆ నగర పర్యటనకు వచ్చిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల బృందం ఈ దృశ్యాన్ని చూసి అశ్చర్యపోయింది. ప్రజల్లో ఆ పరిణతికి అభినందనలు అంటూ నగర మేయర్‌కు లేఖ రాసింది. ఆ సిటీని చూసి నేర్చుకోండి అంటూ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులకు సచిత్ర లేఖ పంపింది. ఆ నగరమే ఈశాన్య రాష్ట్రమైన మిజోరం రాజధానిఐజోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఐజోల్ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు.. కానీ, కూడళ్లలో వాహనాలు అదుపు తప్పవు. రాత్రి వేళ ట్రాఫిక్ పోలీసులు లేనప్పటికీ వాహనాలు నియంత్రణ కోల్పోవు. రోడ్డు మీద వందల సంఖ్యలో వాహనాలు ముందుకు సాగుతున్నా.. ఎక్కడా హారన్లు వినపడవు, వాహనాలు ఒకదాని వెనక ఒకటి వరస కట్టి వెళ్తాయే తప్ప ఓవర్టేక్ చేయవు.. డ్రైవర్లు పరస్పరం అరుచుకోవటం, తిట్టుకోవటం మచ్చుకు కూడా కనిపించవు.. పాదచారులు ఫుట్‌పాత్‌ల మీదుగా మాత్రమే నడుస్తారు, అర్ధరాత్రి వేళ రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు కూడా రోడ్లమీదుగా నడవరు. ఇవన్నీ నమ్మశక్యం కాని నిజాలు. ఐజోల్ నగరంలో ఏ మూలకెళ్లినా ఇవే దృశ్యాలు కనిపిస్తాయి. ప్రకృతి ఒడిలో కొలువై.. కొండలు, లోయలు, దట్టమైన అడవులు, నదులు, వాగులు వంకలు.. స్వచ్ఛమైన ప్రకృతిలో కొలువైన ఆ నగరంలో వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది. దాదాపు 2.20 లక్షల వాహనాలున్నప్పటికీ హారన్ల మోతలు లేకపోవటంతో శబ్ద కాలుష్యం ఉండదు. ఇది స్థానికుల క్రమశిక్షణ ఫలితం. అందుకే ఐజోల్ నగరాన్ని ‘ది సైలెంట్ సిటీ ఆఫ్ ఇండియా’అంటారు. ఇక్కడి ప్రజల్లో స్వీయ క్రమశిక్షణ పుట్టుకతో వస్తుందని అంటున్నారు. 4.21 లక్షల జనాభా ఉన్న నగరంలో నేరాలు అతి తక్కువ. మద్య నిషేధం కట్టుదిట్టంగా అమలవుతుండటంతో ప్రశాంతత రాజ్యమేలుతోంది. ప్రభుత్వ నిబంధనలు తు.చ.తప్పకుండా పాటిస్తున్న ప్రజలు, ఎలాంటి ఉల్లంఘనలకు ఆసక్తి చూపరు. దీంతో ఆ నగరంలో ప్రజల క్రమశిక్షణపై అధ్యయనానికి దేశంలోని చాలా నగరాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇంతకాలం విమానయానంతోనే.. ఐజోల్‌కు వెళ్లాలంటే ఇంతకాలం విమానయానమే అవకాశంగా ఉంది. అది ఖర్చుతో కూడుకున్నది కావటంతో చాలామంది అక్కడికి వెళ్లలేకపోయారు. ఇప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలతో శనివారం నుంచి రైల్వే అనుసంధానం అందుబాటులోకి రావడంతో అధ్యయనాల కోసం నగరానికి వచ్చే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కొండలతో కూడుకున్న ప్రాంతం కావటంతో విశాలమైన రోడ్ల నిర్మాణానికి వీలులేదు. కొండ అంచుల్లో వెనకవైపు లోయల్లోకి పిల్లర్లు ఏర్పాటు చేసి వాటి ఆధారంగా ఇళ్లను నిర్మిస్తుంటారు. ఉన్న కాస్త స్థలంలో 30 అడుగుల వెడల్పు రోడ్లు మాత్రమే ఉంటాయి. దీంతో ప్రజలు ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా క్రమశిక్షణతో రోడ్లను వాడుకుంటున్నారు. రోడ్లపై డివైడర్లు ఉండవు, కేవలం ట్రాఫిక్ లైన్స్మాత్రమే గీసి ఉంటాయి. అయినా.. ఓ వైపు ఉన్న వాహనం ఎట్టి పరిస్థితిలో గీత దాటి మరోవైపు వెళ్లదు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు మాన్యువల్‌గా మాత్రమే ట్రాఫిక్ నియంత్రిస్తుంటారు. వారు చేయి ఎత్తగానే ఠక్కున వాహనాలు నిలిచిపోతాయి. ముందు వాహనాలు మందగమనంతో సాగినా వెనక వాహనదారులు పొరపాటున కూడా హారన్ మోగించరు. సారీ చెప్పి ఓవర్‌టేకింగ్..» ఎవరైనా అత్యవసరంగా ముందుకు సాగాల్సి ఉంటే, వాహనాలను ఓవర్టేక్ చేసి పక్క వాహనదారుకు సారీ చెప్పి మరీ వెళ్లటం అక్కడి ప్రత్యేకత. రాత్రి వేళ ట్రాఫిక్ పోలీసులు లేని సమయంలో కూడా కూడళ్లలో వాహనదారులు నియంత్రణ కోల్పోరు. » ఘాట్ రోడ్లు కావటంతో అన్నీ మలుపులు తిరిగిన రోడ్లే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా హారన్ల మోత వినిపించదు. మరీ షార్ప్ కర్వ్ ఉండి, భారీ వాహనాలు వచ్చే రోడ్డయితే స్వల్పంగా ఒకసారి హారన్ మోగిస్తారు.» తక్కువ వెడల్పు రోడ్లే అయినా, అన్ని చోట్లా ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేశారు. పాదచారులు కచి్చతంగా ఫుట్‌పాత్‌పైనే నడుస్తారు. అర్ధరాత్రి వేళ రోడ్లు ఖాళీగా ఉన్నా.. ఫుట్‌పాత్‌ల గుండానే ముందుకు సాగుతారు.» టాక్సీలకు రోడ్ల మీదే పార్కింగ్ కల్పించారు. వాటికి 20 శాతం స్థలం ఉంటుంది. అవి వరసగా ఆగి ఉన్నా.. పక్కనుంచి మిగతా వాహనాలు ప్రశాంతంగా ముందుకు సాగిపోతుంటాయి. » ఫుట్‌పాత్‌ల వినియోగం, ట్రాఫిక్ నిబంధనలు, పార్కింగ్, హారన్లు మోగించకపోవటం, అక్రమ నిర్మాణాలు రాకుండా నియంత్రించటం.. తదితర అంశాలపై పాఠశాలల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించటం అక్కడి ప్రభుత్వాలు నిరంతరం కొనసాగిస్తున్నాయి. -
స్పీడ్ లిమిట్‌లోనే ఉన్నా... భారీగా చలాన్లు..!
న్యూఢిల్లీ : అనుమతించిన స్పీడ్‌లోనే వాహనాలు ప్రయాణించినప్పటికీ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు భారీగా చలాన్లు విధించారు. వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు, విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. వేసిన చలాన్లను విత్‌డ్రా చేసేందుకు నిర్ణయించారు. వివరాలు.. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్న 24వ జాతీయ రహదారిపై ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో దాదాపు ఒకటిన్నర లక్షల చలాన్లు విధించారు. వీటిలో అధిక భాగం ఓవర్‌స్పీడ్‌కు సంబంధించినవే. అయితే, ఉన్నఫళంగా చలాన్లు విత్‌డ్రా చేస్తామనడానికి కారణాలేంటనే ప్రశ్నకు ట్రాఫిక్ ఉన్నతాధికారి ఒకరు మట్లాడుతూ.. జాతీయ రహదారులపై గంటకు 70 కి.మీ వేగంతో మాత్రమే ప్రయాణించాలి. ఈ మేరకు ప్రజా పనుల విభాగం వేగం 70 దాటితే శిక్షార్హులు అనే బోర్డులు కూడా పెట్టాయి. అయితే, 24వ జాతీయ రహదారిపై నిజాముద్దీన్ బ్రిడ్జి, ఘాజీపూర్ మధ్య 60 కి.మీ వేగంతో వెళ్లిన వాహనాలకు సైతం చలాన్లు విధించారు. దాంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అందుకే చలాన్లు వెనక్కు తీసుకుని ఉండొచ్చు’ అని అన్నారు. ఇదిలాఉండగా.. ఓవర్‌స్పీడ్ చలాన్లను ఇప్పటికే చాలామంది చెల్లించారని.. మరి ఆ సొమ్మునంతా వారికి తిరిగి ఇస్తారా అనే ప్రశ్నకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల నుంచి సమాధానం కరువైంది. అక్రమంగా ఫైన్లు వేయడంతో కోర్టుకు వెళ్తామన్న పలువురి హెచ్చరికల నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక విమర్శల నుంచి తప్పించుకోవడానకి 60 కి.మీ వేగం దాటితే శిక్షార్హులు అనే సూచిక బోర్డులు పెట్టాలని ట్రాఫిక్ అధికారులు ప్రజా పనుల విభాగాన్ని కోరడం గమనార్హం. -
'ఆ' రాష్ట్రాల్లో పాత చలాన్లే!
న్యూఢిల్లీ: కొత్త మోటారు వాహన సవరణ చట్టం–2019 ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ట్రాఫిక్ ఉల్లంఘనులకు విధించే జరిమానాలు అతి భారీగా ఉండడంతో తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాలు మాత్రం పాత చలాన్లే విధిస్తున్నాయి. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌తో సహా ఈ జాబితాలో బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రం కూడా చేరింది. అంతేకాక అనేక ఇతర రాష్ట్రాలు సవరించిన చట్టాన్ని అమలు చేయడంలో ఆలస్యం చేస్తున్నాయి. భారీ జరిమానాలు విధించడం సాధ్యం కాదని, ఈ విషయమై ఆర్టీఓ, ట్రాఫిక్ పోలీసులతో చర్చలు జరిపి కొత్త జరిమానాలను నిర్ణయిస్తామని గుజరాత్ ప్రభుత్వ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సోమవారం పేర్కొన్నారు. అలానే మధ్యప్రదేశ్‌లో కొత్త చట్టం అమల్లోకి రాదని, జరిమానాల గూర్చి ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాత చట్టం అమలు చేయబడుతుందని ఆ రాష్ట్ర న్యాయ వ్యవహారాల మంత్రి ప్రకటించిన విషయం విదితమే. ఢిల్లీలో కొత్త చట్టం అమలు చేస్తున్నప్పటికీ చలాన్ల విషయమై ట్రాఫిక్ పోలీసులతో చర్చలు జరిపే యోచనలో ఉన్నట్లు స్పష్టం చేసింది. అయితే మోటారు వాహనాల సవరణ బిల్లు 2019ను పార్లమెంటు జూలైలో ఆమోదించింది. ఈ చట్టంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు ఉల్లంఘనులకు కఠినమైన జరిమానాలు విధించారు. కొత్త చట్టం ప్రకారం.. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారికి జరిమానా రూ .100 నుంచి అమాంతం రూ .1,000లకు పెంచడం చర్చనీయాంశంగా మారింది. కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మునుపెన్నడూ లేని విధంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు మొదటి రోజు కేవలం 3,900 మందికి మాత్రమే చలాన్లు విధించారు. గత కొన్ని సంవత్సరాలుగా సాధారణంగా పండుగ రోజుల్లో, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న వేళల్లో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి సగటున కేవలం 6గంటల వ్యవధిలో సగటున 15,000 నుంచి 20,000 చలాన్లు విధించే ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం జారీ చేసిన చలాన్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయితే సవరించిన చట్టం అమలులో మొదటి రోజు ఆదివారం కావడం, కొత్త చట్టం ప్రకారం జరిమానాలు చాలా భారీగా ఉండటంతో వాహనదారులు జాగ్రత్త పడడం ఒకటైతే, జారీ చేసిన మొత్తం చలాన్లు ఆదివారం రాత్రి 7 గంటల వరకు మాత్రమే తీసుకున్నవి అని ట్రాఫిక్ విభాగపు అధికారులు ధృవీకరించారు. -
పోలీసుల నేత్రాల్లో ఢిల్లీ ర హదారులు
హోలీ సందర్భంగా పటిష్ట భద్రత కూడళ్లలో ప్రత్యేక తనిఖీలు వీడియో కెమెరాలతో పర్యవేక్షణ ట్రాఫిక్ నిబంధన పాటించని వారిపై కఠిన చర్యలు కమిషనర్ ముక్తేశ్ చంద ర్ వెల్లడి న్యూఢిల్లీ: హోలీ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో ప్రత్యేక తనిఖీల కోసం 200 బృందాలను సిద్ధం చేశారు. 20 ఇంటర్‌స్పెక్టర్ వాహనాలతో గస్తీ ముమ్మరం చేయనున్నారు. మద్యం తాగి వాహనం నడపడం, బైక్ విన్యాసాలు, విచక్ష ణా రహితంగా వాహనాలు నడపడంతోపాటు ఇతర ట్రాఫిక్ నియమాలు పాటించని వారిని గుర్తించేందుకు వీడియో కెమేరాలు ఉపయోగిస్తున్నారు. రద్దీ కారణంగా నిందుతులను అప్పటికప్పుడే విచారిచడం లేదు. చలానాలను వారి ఇంటికి పంపిస్తారు. గత సంవత్సరం ఇదే తరహాలో 4000 మంది నిందుతులకు చలానాలు వారి ఇంటికే పంపిచారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే కేవలం జరిమానాతో సరిపెట్టడం లేదు, వారి వాహనం స్వాధీనం చేసుకోవడంతోపాటు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే డ్రైవర్‌ను అరెస్ట్ చేయడంతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రాఫిక్ కమిషనర్ ముక్తేశ్ చందర్ చెప్పారు. జరిమానా విధించడం మాత్రమే కాక జైలు శిక్షతోపాటు వారి డ్రైవింగ్ లెసైన్స్ రద్దు చేస్తామని తెలిపారు. పండుగ సందర్భాల్లో హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం, బైక్‌తో వివిధ విన్యాసాలు చేయడం సర్వసాధారణం. అయితే ఏలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వాహన యజమాని కాకుండా ఇతరులు, మైనర్లు వాహనం నడిపితే యజమానిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. లై సెన్స్ కాలం పూర్తయి ఉన్నా, విచక్షణా రహితంగా వాహనం నడిపినా, హెల్మెట్ వాడకపోయినా నిబంధనల మేరకు చ ర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసుల లెక్కల ప్రకారం గత సంవత్సరం చట్టరీత్యా 13,015 మందిపై వివిధ నేరాల కింద చర్యలు తీసుకున్నారు. వీరిలో హెల్మెట్ వాడని కారణంగా 5,633 మందిపై, సిగ్నల్ జంప్ చేసిన నేరంపై 1,544 మందిపై చర్యలు తీసుకున్నారు. అదే విధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న 1,464కి, ప్రమాదకరంగా వాహనం నడిపిన 139 మందికి జరిమానాలు విధించారు. మద్యం తాగి వాహనం నడిపిన 2,090 మందికి చట్టరీత్యా శిక్ష విధించారు. అంతేకాక 881 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.