breaking news
deelers
-
డీలర్‌షిప్‌కి చేరుకున్న మారుతి జిమ్నీ.. ఇక డెలివరీలు అప్పుడే!
గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త మారుతి జిమ్నీ 5-డోర్స్ వెర్షన్ ఎట్టకేలకు షోరూమ్‌లకు వచ్చేసింది. ఇప్పటికే బుకింగ్స్ స్వీయకరించడం ప్రారంభించిన కంపెనీ త్వరలోనే డెలివరీలు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మారుతి సుజుకి తన ఫైవ్ డోర్స్ జిమ్నీ SUVని 2023 ఆటో ఎక్స్పో ఆవిష్కరించింది. కంపెనీ ఈ ఆఫ్ రోడర్ కోసం ఇప్పటికి 18,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. కాగా ఇప్పుడు వాహన ప్రేమికుల సందర్శనార్థం నెక్సా షోరూమ్‌లలో జిమ్నీ ప్రదర్శిస్తారు. ఇది ఒకటి లేదా రెండు రోజులు ప్రదర్శనకు ఉంచే అవకాశం ఉంటుంది. జిమ్నీ ప్రొడక్షన్ 2023 ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కంపెనీ ధర, డెలివరీలకు సంబంధించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కాగా కంపెనీ ప్రతి నెలా కనీసం 7,000 యూనిట్లను డెలివరీ చేస్తూ.. సంవత్సరానికి లక్ష యూనిట్లను ఉత్పత్తి చేసే ప్రణాళికలో ముందుకుసాగనుంది. డెలివరీలు మే చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. కొత్త మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్ K15B పెట్రోల్ ఇంజన్‌తో 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్పి పవర్, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇది కైనెటిక్ ఎల్లో, సిజ్లింగ్ రెడ్, గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లూయిష్ బ్లాక్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: కియా నుంచి నాలుగు కొత్త కార్లు: సిఎన్జి, 5 సీటర్ ఇంకా..) మారుతి సుజుకి జిమ్నీ డిజైన్ పరంగా చాలా ఆధునికంగా ఉండటమే కాకుండా, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇది జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్స్‌లో విడుదలకానుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. -
పెట్రోల్ బంక్‌ల మూసివేత నిర్ణయం లేనట్లే!
ముంబై / హైదరాబాద్: కమీషన్ పెంపు వ్యవహరంపై ఆయిల్ కంపెనీలకు, పెట్రోల్ బంక్ డీలర్లకు మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు పరిష్కారం అయింది. ఆయిల్ అమ్మకాలపై వచ్చే కమీషన్ ను పెంచడానికి కంపెనీలు అంగీకరించడంతో పెట్రోల్ బంక్ ల డీలర్లు ఆందోళనలను విరమించేందుకు రంగం సిద్ధమైంది. ఒక లీటరు ఆయిల్ పై పెట్రోల్ బంకుల డీలర్లకు లభించే కమీషన్ ను మరో 10 పైసలు పెంచేందుకు ఆయిల్ కంపెనీలు అంగీకరించాయి. ముంబైలో డీలర్లకు, ఆయిల్ కంపెనీలకు మధ్య శుక్రవారం జరిగిన చర్చలు సఫలం కావడంతో ఇండియన్ పెట్రోల్ బంక్ డీలర్ల కన్సార్టియం (సీఐపీడీ) తన కార్యాచరణను ఉపసంహరించుకోనుంది. అంతకుముందు.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే మాత్రమే బంక్ లు తెరిచి ఉంచుడం, ప్రభుత్వ సెలవు దినాల్లోనూ బంకులు మూసివేడంలాంటి తీవ్ర నిర్ణయాలను సీఐపీడీ ప్రకటించింది. దీంతో హైదరాబాద్ కు చెందిన డీటర్లు కూడా ఆ నిర్ణయాలను అమలుచేయనున్నట్లు శుక్రవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. ఇది జరిగిన కొద్ది సేపటికే ముంబైలో చర్చలు సఫలం అయినట్లు సమాచారం అందింది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పినట్లయింది. -
పెట్రోల్ బంక్‌ల మూసివేత నిర్ణయం లేనట్లే!