breaking news
Dadasaheb Phalke Film Festival
-
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ (ఫొటోలు)
-
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటనపై కంగనా అసహనం
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమె వార్తల్లోకి ఎక్కుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ సినీ ప్రముఖులు, స్టార్ కిడ్స్ను టార్గెట్ చేస్తూ మాటల దాడి చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు నిర్వహకులపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఈ అవార్డు కేటాయింపులో నిర్వాహకులు పక్షపాతం చూపించారని కంగనా మండిపడింది. కాగా చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ‘దాదా సాహేబ్ ఫాల్కే’ అవార్డు ఒకటి. చదవండి: కస్తూరికి అస్వస్థత, ఆ వ్యాధి ప్రభావం చూపిస్తూ ఫొటోలు షేర్ చేసిన నటి నిన్న (సోమవారం) రాత్రి ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ముంబైలో జరిగిన సంగతి తెలిసిందే. 2023కి గానూ పలువురు సినీ తారల సమక్షంలో దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. ఈ ఏడాదికి గానూ ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర) ఉత్తమ నటిగా ఆలియా భట్(గంగూబాయ్ కథియవాడి) చిత్రాలకు గానూ అవార్డును అందుకున్నారు. అలాగే కాంతార మూవీ హీరో రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌గా ఈ అవార్డును దక్కింది. చదవండి: నెపోటిజంపై నాని షాకింగ్ కామెంట్స్.. రానా రియాక్షన్ ఎంటంటే! ఉత్తమ చిత్రంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’, ఫిలిం ఆఫ్ ది ఇయర్‌గా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలు అవార్డును గెలుచుకున్నాయి. అయితే రణ్‌బీర్ కపూర్, ఆలియాలకు ఈ అవార్డు రావడంపై కంగనా తప్పుబట్టింది. నెపోటిజం వల్లే అలియా భట్, రణబీర్ కపూర్‌కు అవార్డులు దక్కాయని విమర్శించింది. అవార్డులు పొందే అర్హత వీరికే ఉందంటూ తన ట్విటర్లో ఓ జాబితాను పంచుకుంది. అనంతరం బాలీవుడ్‌ను నెపోటిజం వదలడంలేదని, అవార్డులు కూడా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికే ఇస్తున్నారని కంగనా ఆగ్రహం వ్యక్తం చేసింది. కంగనా పేర్కొన్నా జాబితా ఇలా ఉంది బెస్ట్ యాక్టర్ అవార్డు రిషబ్ శెట్టి (కాంతార) బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు మృణాల్ ఠాకూర్ (సీతారామం) ఉత్తమ చిత్రం అవార్డు కాంతారా ఉత్తమ దర్శకుడు అవార్డు ఎస్ఎస్ రాజమౌళి (ఆర్ఆర్ఆర్) ఉత్తమ సహాయ నటుడు అనుపమ్ ఖేర్ (కశ్మీరీ ఫైల్స్) ఉత్తమ సహాయ నటి టబు (భూల్ భులయ్యా) Best director- SS Rajamouli ( RRR) Best supporting actor- Anupam Kher ( Kashmir Files) Best supporting actress- Tabu ( Drishyaman/Bhool Bhulaiya) Bolly awards are a big sham … when I get some time from my schedule I will make a list of all those I feel are deserving … thanks — Kangana Ranaut (@KanganaTeam) February 21, 2023 -
DPIFF Awards 2023: ఉత్తమ నటుడు రణ్‌బీర్, నటి అలియా.. ఆర్ఆర్ఆర్కు అవార్డు
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఖాతాలో మరో అరుదైన అవార్డు చేరింది. చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డు సొంతం చేసుకుంది. పలువురు సినీ తారల సమక్షంలో సోమవారం రాత్రి ముంబైలో దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఈ సందర్భంగా విజేతలను ప్రకటించి అవార్డులు అందజేశారు. View this post on Instagram A post shared by Dadasaheb Phalke -DPIFF Awards (@dpiff_official) ‘కాంతార’సినిమాలో నటనకు గాను కన్నడ హీరో రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌గా అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’.. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర), ఉత్తమ నటిగా అలియా భట్(గంగూబాయి కాఠియావాడి) అవార్డులను పొందారు. ఇక 2023 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును ప్రముఖ నటి రేఖ అందుకున్నారు. టెలివిజన్ రంగంలో ఉత్తమ నటుడిగా జైన్ ఇమాన్ ఉత్తమ నటిగా తేజస్వీ ప్రకాశ్ అవార్డులు అందుకోగా.. వెబ్ సిరీస్ విభాగంలో బెస్ట్ వెబ్‌సీరీస్‌గా రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్, ఉత్తమ నటుడు జిమ్ సార్బ్(రాకెట్ బాయ్స్) అవార్డుల పొందారు. దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ విజేతలు వీరే ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ : ఆర్ఆర్ఆర్ ఉత్తమ చిత్రం: ది కశ్మీర్ ఫైల్స్ ఉత్తమ దర్శకుడు: ఆర్. బాల్కి(చుప్: ది రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్) ఉత్తమ నటుడు: రణ్‌బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర-1) మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: రిషబ్ శెట్టి(కాంతార) ఉత్తమ నటి: అలియా భట్(గంగూబాయి కాఠియావాడి) మోస్ట్ వర్సటైల్ యాక్టర్: అనుపమ్ ఖేర్ క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ : వరుణ్ ధావన్(బేడియా) క్రిటిక్స్ ఉత్తమ నటి: విద్యాబాలన్(జల్సా) బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్: సాచిత్ తాండన్)