breaking news
custody case
-
సత్వర విచారణ నిందితుడి ప్రాథమిక హక్కు: సుప్రీం
న్యూఢిల్లీ: కేసుల్లో వేగంగా విచారణ జరగడం, కోర్టు నుంచి సాధ్యమైనంత త్వరగా తీర్పు పొందడం నిందితుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అండర్ ట్రయల్స్‌ను నిరవధికంగా నిర్బంధంలో ఉంచడం సరికాదని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పంకజ్ మిత్తల్‌ల ధర్మాసనం పేర్కొంది. బిహార్‌లో నాలుగేళ్లకు పైగా కస్టడీలో ఉన్న వ్యక్తికి శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. విచారణ ఇప్పట్లో పూర్తయే అవకాశం కనిపించడం లేదు గనుక బెయిలిస్తున్నట్టు వెల్లడించింది. -
ఊరేగింపుగా ఎందుకు తీసుకెళ్లారు ?
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్ కస్టడీలో ఉండగా పోలీసుల కళ్లెదుటే హత్యకు గురైన ఘటనపై సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా పోలీసులు, యూపీ సర్కారుకు పలు ప్రశ్నలు సంధించింది. ‘ అతీక్‌ను ఆస్పత్రికి తీసుకొస్తారని నిందితులకు ముందే ఎలా తెలుసు ? మేం కూడా టీవీలో చూశాం. ఆస్పత్రి గేటు నుంచి వారిని లోపలికి అంబులెన్స్‌లో ఎందుకు తీసుకెళ్లలేదు. మీడియా సమక్షంలో వారిని ఎందుకు ఊరేగింపుగా నడిపిస్తూ తీసుకెళ్లారు?. అతీక్ పోలీసు కస్టడీలో ఉండగా మీడియా చూస్తుండగా షూటర్లు హత్యకు ఎలా తెగించగలిగారు?’ అని యూపీ సర్కార్ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీని జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ప్రశ్నించింది. దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విద్వేష ప్రసంగాలపై కేసులు నమోదుచేయండి న్యూఢిల్లీ: దేశంలో మత సామరస్యానికి తీవ్ర భంగం వాటిల్లేలా విద్వేష ప్రసంగాలు చేసే వారిపై సుమోటో కేసులు నమోదుచేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. లేదంటే కోర్టు ధిక్కార చర్య తప్పదని డీజీపీలను హెచ్చరించింది. -
రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ
-
'నాన్నా.. నువ్వు అమ్మతో ఎందుకు ఉండట్లేదు?'
కోల్‌కతా: బంధాలు బరువైనవే.. కానీ వాటిని మోయడమంటేనే హృదయానికి ఇష్టం, అలా మోస్తున్న మనిషే అందరికీ అందంగా కనిపిస్తాడు కూడా. ముఖ్యంగా భావోద్వేగాల సమయంలో ఇవి మరింత భారంగా కనిపిస్తాయి. అప్పటికీ కూడా అలా పట్టుకొని ఉండేందుకే మనిషి మొగ్గుచూపుతాడు. కానీ, ప్రస్తుత పరిస్థితులు పూర్తి భిన్నంగా తయారవుతున్నాయి. ఓ పాటలో చెప్పినట్లు మాయమైపోతున్నడు మనిషన్నవాడు.. నిజమే కొన్ని చోట్ల మనిషి ఇప్పటికే మాయమయ్యాడు. అందుకే కొందరి జీవితంలో కన్నీళ్లు.. కష్టాలు. తాను లేని లోటును స్పష్టంగా కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నా కొందరివి ఏమాత్రం కరగని కఠువు హృదయాలు. అలాంటి హృదయమే ఉన్న వ్యక్తి ఓ ఆరేళ్లపాపకు తండ్రిగా ఉంటే.. తమతో ఉండిపోండి నాన్నా అంటూ ఆ పాప కోరుకుంటున్నా అతడి నోట వెంట కనీసం ఒక్కమాట రాకుండా ఉంటే.. సరిగ్గా కోల్ కతా హైకోర్టులో ఈ సంఘటన దర్శనం ఇచ్చింది. ఓ ఆరేళ్ల పాప 'ఎందుకు నువ్వు రావడం లేదు? అమ్మతో ఎందుకు ఉండటం లేదు? మేం కోరుకుంటున్నట్లుగా మాతో ఉంటానని నువ్వు కోర్టులో చెప్పలేవా?' అంటూ ఓ తండ్రిని సాక్షాత్తు జడ్జి, న్యాయవాదుల ముందు ఏడుస్తూ ప్రశ్నించింది. అక్కడే ఉన్న తన చిన్నారి సోదరుడు కూడా ఏడుస్తూ 'మా అక్క మానాన్నతో ఉంటే నేను కూడా తనతోనే ఉంటాను' అంటూ ఏడ్వడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో వారిద్దరి చెంపలపై కన్నీళ్లు వస్తుండగా.. ఓ మూలకు నిల్చున్న వారి తల్లి వెక్కివెక్కి ఏడుస్తుంది. ఈ దృశ్యం చూసిన వారెవ్వరికీ అక్కడ నోట వెంట ఒక్క మాటా రాలేదు. ఇది పెళ్లి చేసుకొని విడిపోయి వేర్వేరుగా ఉంటున్న ఓ తల్లిదండ్రుల కేసుకు సంబంధించిన విషయం. ఈ దంపతులు ఇద్దరు తొలుత 2005లో కలుసుకున్నారు. ఇష్టంతో వివాహం చేసుకున్నారు. ఆమె హిందువు. కానీ, తన భర్త ఇష్టం మేరకు ఇస్లాంలోకి మారింది. పేరు కూడా మార్చుకుంది. 2010లో వారికి ఓ పాప.. 2012లో బాబు జన్మించాడు. అయితే, కాలక్రమంలో తన భర్త తీరు అనుమానాస్పదంగా మారడంతో ముందు జాగ్రత్తతో ఆమె తన పిల్లలతో కలసి సిలిగురిలో జీవిస్తోంది. తనతోపాటే ఉండాలని ఆమె అతడిని కోరింది. కానీ అందుకు అతడు నిరాకరించాడు. ఇలా వారిద్దరి మధ్య దూరం పెరిగి వాదనలు ప్రారంభమై చివరకు పిల్లలను పంచుకునేకాడికి వచ్చింది. అతడు 2016 ఫిబ్రవరిలో సిలిగిరి కోర్టుకు వెళ్లగా బాలికను తండ్రితో.. బాలుడిని తల్లితో ఉంచాలని జడ్జి చెప్పారు. అయితే, కూతురు కూడా తనతో ఉంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ మరో పిటిషన్ తల్లి వేసింది. అయితే ఈ కేసుపై మే 17న కేసు విచారించిన జడ్జి సమ్మర్ పూర్తయ్యే వరకు ఇద్దర్ని తల్లితో ఉంచేందుకు అనుమతిచ్చారు. ప్రస్తుతం సమ్మర్ అయిపోవడంతో మంగళవారం ఈ కేసు మరోసారి కోర్టులో వాదనలకు వచ్చింది. ఈ సందర్భంగా ఆ ఆరేళ్ల చిన్నారి తండ్రిని ఏడుస్తూ నిలదీసింది.