breaking news
compitation
-
ప్లాస్టిక్ కాలుష్యం అంతం : చిన్నారుల పెయింటింగ్స్ అద్భుతం
సనత్‌నగర్: చిన్నారులు అద్భుత చిత్తరువులతో అమూల్య సందేశాన్ని అందించారు. ప్లాస్టిక్ భూతంతో పర్యావరణాన్ని మనమే హరించేస్తున్నామంటూ ఆ చిన్ని మస్తిష్కాలు హెచ్చరించాయి. ఇకనైనా మేల్కోకపోతే భవిష్యత్తు తరాలు ప్రశ్నార్థకం అంటూ ఆ చిట్టి బుర్రలు గీసిన చిత్రాలు స్ఫూర్తిని నింపాయి. పర్యావరణాన్ని నాశనం చేసుకుంటూ ఆకాశానికి నిచ్చెనలు వేసుకుంటూ వెళ్తుండటం మానవ మనుగడకు శ్రేయస్కరం కాదంటూ బొమ్మలతో మేల్కొల్పే ప్రయత్నం చేశారు. చదవండి: వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే!అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీజీపీసీబీ(తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి) ఆధ్వర్యంలో సనత్‌నగర్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు జవహర్ బాలభవన్‌లో డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. నగరం నలుమూలల నుంచి కదిలి వచ్చిన వివిధ పాఠశాలల విద్యార్థులు ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం అనే అంశంపై ఆలోచింపజేసే చిత్రాలను గీశారు. దాదాపు 250 మంది విద్యార్థులు పర్యావరణ సంబంధిత అంశాలపై అందమైన చిత్రాలను గీసి పెయింటింగ్ వేశారు. ముఖ్యంగా భూమి, నీరు, గాలి, ప్లాస్టిక్ కాలుష్యం, ఎనర్జీ సేవింగ్, నీటి సంరక్షణ, మ్కొలు నాటడం ద్వారా పచ్చదనం పెంపు, కాలుష్యం నుంచి భూమిని రక్షించే అనేక అంశాలపై చిత్రాలను గీశారు. విద్యార్థులను మూడు విభాగాలుగా విభజించి నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు వచ్చేనెల 5న పర్యావరణ దినోత్సవం రోజున బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఆఫీసర్ ధర్మేందర్, డ్రాయింగ్ మాస్టర్లు నరేందర్, రాములు, మల్లేశం, ప్రాజెక్ట్ ఆఫీసర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇదీ చదవండి: నా బరువుతో నేను హ్యాపీగానే ఉన్నా : ఐశ్వర్య ఘాటు రిప్లై వైరల్ -
AP: రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. ఈ సారి కొత్త విధానం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో రేపటి(శనివారం)నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. 6,455 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులకు ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటలలోపు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. జూన్ 10 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఈసారి ఆఫ్ లైన్ లోనే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, ఏపీపీఎస్సీ సెక్రటరీ జె.ప్రదీప్ కుమార్ పరిశీలించారు. పకడ్బందీ చర్యలు.. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పూర్తి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ జరగనుంది. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులకు బయోమెట్రిక్‌తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం 70 బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 290 మంది దివ్యాంగులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 58 మంది దివ్యాంగులు స్క్రైబ్స్ కు అనుమతి కోరారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. చదవండి: దేశంలోనే ఎక్కడా లేని విధంగా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’: గౌతం రెడ్డి -
30న జిల్లాస్థాయి చిత్రలేఖనం పోటీలు
నరసాపురం: గాంధీ అధ్యయన కేంద్రం (యూజీసీ), నరసాపురం వైఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ‘మహాత్మాగాంధీ–మత సామరస్యం’ అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నట్టు స్థానిక వైఎన్ కళాశాల ప్రిన్సిపాల్ కేవీసీఎస్ అప్పారావు, గాంధీ అధ్యయన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు చెప్పారు. ఈనెల 30న ఉదయం 11 గంటలకు కళాశాలలో పోటీలు ప్రారంభమవుతాయన్నారు. 6వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులు పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న పోటీల్లో విజేతలకు వచ్చేనెల 2న కళాశాలలో జరిగే కార్యక్రమంలో బహుమతులు అందిస్తామని చెప్పారు. వివరాలకు సెల్: 9849712739 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
నేడు స్విమ్మింగ్ పోటీలు
మురళీనగర్: మురళీనగర్ వైశాఖి స్పోర్ట్సు పార్కులోని స్విమ్మింగ్ పూల్ వద్ద బాల బాలికలకు నాలుగ విభాగాల్లో స్విమ్మింగు పోటీలు నిర్వహిస్తామని వైశాఖి స్పోర్ట్సు పార్కు ప్రతినిధులు వరప్రసాద్, నారాయణరావు తెలిపారు. ఉదయం 8గంటలకు ఈతపోటీలు జరుగుతాయి. అదేరోజు సాయంత్రం ఫ్లడ్ లైట్ల వెలుగులో బాల్ బ్యాండ్మింటన్ పోటీలు నిర్వహిస్తారు. -
ప్రకాశం జిల్లాలో సంక్రాంతి విన్యాసాలు