breaking news
Communal agenda
-
ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలకు మతం, వలసలను ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అదే సమయంలో.. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో లాస్ ఏంజెల్స్, శాన్‌డియాగో నగరాలను ఇరాన్ ‘‘తుడిచిపెట్టేసుకోవచ్చు’’ అన్నట్లు మాట్లాడిన తీరుపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్రాన్స్‌లో స్టూడెంట్స్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీటిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు.. ‘‘ఇది పాఠశాలల సమస్య కాదు.. ఫ్రాన్స్‌ను ఇస్లాం ఆక్రమించుకోవాలని చూస్తోంది’’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా తీవ్ర దుమారం రేగింది. ఫ్రాన్స్‌లో సెప్టెంబర్ చివరి నుంచి హైస్కూల్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వందలాది పాఠశాలల ప్రవేశ ద్వారాలను విద్యార్థులు దిగ్బంధించారు. మెరుగైన విద్యా వసతులు, ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించడం, అధిక విద్యార్థులతో కిక్కిరిసిన తరగతులను తగ్గించడం, పాడైపోయిన పాఠశాల భవనాలను బాగుచేయడం వంటి డిమాండ్లు వాటిల్లో ఉన్నాయి. వేడిని తట్టుకోలేని భవనాలు, అధిక పని భారం, సిబ్బంది కొరతపైనా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఆందోళన క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించింది. అక్టోబర్ 6న ఒక్కరోజే దాదాపు 2.56 లక్షల మంది నిరసనల్లో పాల్గొన్నారని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. యూనియన్లు మాత్రం ఈ సంఖ్య 4.5 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నాయి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా నిరసనలకు మద్దతుగా రోడ్డెక్కారు. ఘర్షణలతో ఉద్రిక్తతఅయితే కొన్ని ప్రాంతాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోలీసులు టియర్ గ్యాస్, లాఠీలు, అల్లర్ల నియంత్రణకు ఉపయోగించే ఆయుధాలను ప్రయోగించారు. కొన్ని చోట్ల నిరసనకారులు రాళ్లు విసరడం, వాహనాలు, బస్ షెల్టర్లకు నిప్పుపెట్టడం వంటి ఘటనలు జరిగాయి.ఫ్రాన్స్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఆందోళనలు మొదలైనప్పటి నుంచి 215 మంది విద్యార్థులు, 715 మంది పోలీసులు గాయపడ్డారు. 5,000 మందికిపైగా అరెస్టయ్యారు. వారిలో 87 శాతం మంది మైనర్లే. 24 పాఠశాలలు ధ్వంసం లేదా అగ్నిప్రమాదాలకు గురయ్యాయి. ఇటు పోలీసుల చర్యలపైనా విమర్శలు వస్తున్నాయి. ఓ 15 ఏళ్ల విద్యార్థి పోలీసుల స్టన్ గ్రెనేడ్ కారణంగా చేతిని కోల్పోయాడు. మరో 14 ఏళ్ల బాలుడి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సైతం ఫ్రాన్స్ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రవర్తనపై పలు అంతర్గత విచారణలు కూడా ప్రారంభమయ్యాయి. ‘ఇది ఇస్లాం ఆక్రమణ’.. ట్రంప్ వ్యాఖ్యఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు అసలు వివాదానికి కారణమైంది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ.. ‘‘ఇది అదుపు తప్పిన భారీ వలసల ఫలితం. ఇది పాఠశాలల గురించి కాదు.. ఒకప్పుడు గొప్ప దేశమైన ఫ్రాన్స్‌ను ఇస్లాం ఆక్రమించుకోవాలని చూస్తోంది’’ అంటూ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో రాశారు. అయితే ఫ్రాన్స్‌లో విద్యార్థులు చేస్తున్న ప్రధాన డిమాండ్లకు, ట్రంప్ చెప్పిన ‘‘ఇస్లాం ఆక్రమణ’’కు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు నిరసనలపై వచ్చిన తాజా వివరాల్లో ఎలాంటి ఆధారం కనిపించడం లేదు. విద్యార్థులు ప్రధానంగా విద్యా వ్యవస్థలోని సమస్యలపైనే ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయాన్ని ట్రంప్ వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నవారు ప్రశ్నిస్తున్నారు.ట్రంప్, ఆయన మద్దతుదారులు మాత్రం యూరప్‌లో వలసలు, భద్రత, సామాజిక సమస్యలను అనుసంధానిస్తూ చాలాకాలంగా ప్రచారం చేస్తున్నారు. అమెరికా మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఫ్రాన్స్ పరిణామాలను కూడా వలస వ్యతిరేక రాజకీయ ప్రచారానికి ఉపయోగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.అమెరికాలోనూ మరో మాట.. ఇదే సమయంలో ఇరాన్ యుద్ధంపై ట్రంప్ చేసిన మరో వ్యాఖ్య అమెరికాలో కలకలం రేపింది. నెబ్రాస్కాలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా అమెరికాలో ఇంధన ధరలు పెరగడం దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు చెల్లించే ‘‘చిన్న మూల్యం’’ అని అన్నారు. ఆ తర్వాత.. ‘‘వాళ్లు ఒక నగరాన్ని తుడిచిపెట్టేయొచ్చు. లాస్ ఏంజెల్స్‌ను తుడిచేయనివ్వండి. శాన్‌డియాగోను తుడిచేయనివ్వండి’’ అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సభలో కొందరు మద్దతుదారులు చప్పట్లు కొట్టారు. ట్రంప్ వ్యాఖ్యలపై కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తీవ్రంగా స్పందించారు. ట్రంప్‌ను ‘‘ప్రమాదకరమైన, మతిభ్రమించిన వ్యక్తి’’ అంటూ విమర్శించారు. లాస్ ఏంజెల్స్ మేయర్ కరెన్ బాస్.. అధ్యక్షుడి వ్యాఖ్యలు నగర భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నాయని అన్నారు. శాన్‌డియాగో మేయర్ టాడ్ గ్లోరియా.. తమ నగరం ‘‘యుద్ధంలో త్యాగం చేయాల్సిన వస్తువు కాదు’’ అంటూ మండిపడ్డారు. వైట్‌హౌస్ వివరణ ఇదీ..అయితే ట్రంప్ వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న విమర్శలను వైట్‌హౌస్ తోసిపుచ్చింది. ట్రంప్ ఉద్దేశం అమెరికా నగరాలపై ఇరాన్ దాడిని కోరుకోవడం కాదని స్పష్టం చేసింది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకోవడం వల్లే లాస్ ఏంజెల్స్, శాన్‌డియాగో వంటి అమెరికా నగరాలు సురక్షితంగా ఉన్నాయని ఆయన చెప్పాలనుకున్నారని వివరించింది. అయినా అధ్యక్షుడి నోట ‘‘లాస్ ఏంజెల్స్‌ను తుడిచేయనివ్వండి.. శాన్‌డియాగోను తుడిచేయనివ్వండి’’ అనే మాటలు రావడం తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా యుద్ధం, ఇంధన ధరలు, అమెరికా మధ్యంతర ఎన్నికలు కీలకంగా మారిన సమయంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.ఇదీ చదవండి: ఇరాన్ దెబ్బకు షాకింగ్ డెసిషన్ తీసుకున్న ట్రంప్ -
దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్, వామపక్షాల కుట్రలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్, వామపక్షాలు మత ఛాందసవాద శక్తులతో చేతులు కలుపుతున్నాయని, సమాజాన్ని విభజించి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రలు సాగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. గురువారం కేరళలో జరిగిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గాంధేయ సిద్ధాంతాన్ని వదిలేసిందని, మావోయిస్టు ముస్లిం లీగ్ కాంగ్రెస్‌గా మారిపోయిందని ధ్వజమెత్తారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లు సొంత ఎజెండా కోసం సమాజంలో మనుషుల మధ్య చిచ్చుపెడుతున్నాయని ఆరోపించారు. అదే సమయంలో మన విశ్వాసాలను దెబ్బతీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయ్యప్ప భక్తుల మనోభావాలను కించపర్చాయని విమర్శించారు. అయ్యప్ప ఆలయ బంగారం విషయంలో ఆ రెండు కూటములు నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. సహకార బ్యాంకుల్లో ఉన్న ప్రజల కష్టార్జితాన్ని దురి్వనియోగం చేస్తున్నాయని ఆక్షేపించారు. దేశాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ మాత్రం దేశ ప్రతిష్టను దిగజార్చడమే పనిగా పెట్టుకుందన్నారు. విదేశాల్లోని పరిస్థితుల గురించి కాంగ్రెస్ నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, దానివల్ల అక్కడ నివసిస్తున్న భారతీయులు ఇబ్బంది పడాల్సి వస్తోందని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. కేరళలో ఇప్పటిదాకా ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, యువత బతుకులు బాగుపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని తేల్చిచెప్పారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లాలని, బీజేపీకి ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి సూచించారు. -
మతతత్వ ఎజెండా: సోనియా గాంధీ
బీజేపీ మేనిఫెస్టోపై సోనియా ధ్వజం న్యూఢిల్లీ/త్రిసూర్: బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో మతతత్వ ఎజెండా అని, అది దేశ సమైక్యత, సమగ్రతలకు పెను ముప్పు అని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ విమర్శించారు. ఆమె సోమవారం కేరళలోని త్రిసూర్‌లో ఎన్నికల సభలో మాట్లాడుతూ.. దేశ సమైక్యతను కాపాడడం ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. కాగా, రాజకీయ ప్రయోజనాల కోసం కాషాయదళం మతాన్ని వాడుకుంటోందని, అయితే మదర్సాలకు సాయం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం స్వాగతనీయమని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలో అన్నారు. హిందువుల ఓట్లను దక్కించుకోవడానికే బీజేపీ రామాలయ అంశాన్ని ప్రస్తావించిందని, ఆలయ అంశంపై రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామనడం కంటితుడుపు మాటని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి విమర్శించగా, మేనిఫెస్టో ఆరెస్సెస్ ఎజెండా అని సీపీఐ పేర్కొంది. బీజేపీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు: లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ అయిన సోమవారమే బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయడం చట్టవిరుద్ధమంటూ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఒకవైపు పోలింగ్ జరుగుతోంటే అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామంటూ బీజేపీ ఓట్లను అడిగినందున ఆ పార్టీపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది.


