breaking news
commission based
-
ఏలూరులో నోట్ల మార్పిడి ముఠా అరెస్టు
ఏలూరు : నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ముఠాను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నారు. పాత రూ.500, రూ.1000 నోట్లను తీసుకుని కొత్త రూ.2000 నోట్లను కమీషన్ పద్ధతిపై ఇస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గురువారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.20 లక్షల కొత్త రూ.2000 నోట్లను సీజ్ చేశారు. కొత్త నోట్లు వారికి ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. -
30 శాతం కమీషన్‌తో పాతనోట్ల మార్పిడి
ముంబై: కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో నల్ల ధనాన్ని వైట్‌గా మార్చుకునేందుకు పుణే నగరంలోని పలువురు బిల్డర్లు, వ్యాపారులు నానా తంటాలు పడుతున్నారు. పాతనోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇచ్చే వారికి 30శాతం దాకా కమీషన్ ఇచ్చేందుకు సైతం వారు వెనుకాడటం లేదు. అందుకు తాజా ఉదాహరణ ఇది. బుధవారం పుణే క్రైం బ్రాంచ్ పోలీసులు అంకేష్ ఆనంద్ అగర్వాల్ అనే బిల్డర్‌ను పట్టుకున్నారు. ఈయన తన వద్ద ఉన్న రూ.1.11 కోట్ల నల్లధనాన్ని వైట్‌గా మార్చుకునే క్రమంలో పట్టుబడ్డాడు. అగర్వాల్ పుణే నగంలో ప్రముఖ బిల్డర్. తన వద్ద ఉన పాత నోట్లను 30 శాతం కమీషన్‌తో కొత్త నోట్లుగా మరో వ్యాపారి వద్ద మార్చుకునే క్రమంలో పుణే కార్పొరేషన్ వద్ద ఉన్న నాకోడా కోర్ట్ బిల్డింగ్‌లోని కిషోర్ పోర్వాల కార్యాలయంలో దొరికి పోయాడు. అగర్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఇన్‌కం టాక్స్ అధికారులకు అప్పగించారు. ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు.