breaking news
Chand Babu
-
మానసిక రోగ గ్రస్తుడు...!రామోజీ క్షమిచారని రాత
-
పథకాలు పక్కదోవ పట్టించడానికే లోకేష్ హైడ్రామా
-
వెలుగు చూస్తున్న అక్రమ ‘ఆమోదాలు’.. ఆంధ్రజ్యోతికి
వడ్డించే వాడు మనవాడయితే ఎక్కడ అడిగినా.. ఎన్నిసార్లు అడిగినా భూ పందేరాలు ఇష్టారాజ్యంగా జరిగిపోతాయనేందుకు ఆమోద పబ్లికేషన్స్‌కు విలువైన స్థలాన్ని కట్టబెట్టడమే ప్రబల నిదర్శనం. తెల్లారి లేచింది మొదలు పాఠకులకు అదేపనిగా నీతులు చెప్పే ఓ తోక పత్రిక నిబంధనలను తుంగలో తొక్కి అడ్డగోలుగా భూమి కొట్టేసిన వైనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు హయాంలో కోరిన చోట కోరుకున్న ధరకు రూ.కోట్ల విలువైన భూమిని కారుచౌకగా దక్కించుకున్న వైనానికి ముందు జరిగిన ఓ తతంగం ఇప్పుడు చర్చకు తెరలేపింది. సాక్షి ప్రతినిధి, తిరుపతి : రేణిగుంట మండలం తూకివాకం రెవెన్యూ గ్రామంలో బీసీ వర్గాల రైతులకు నిర్దేశించిన భూమిని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆమోద పబ్లికేషన్స్‌కు అతి తక్కువ ధరకు కేటాయించింది. ఈ విషయమై ‘అక్రమ ఆమోదం’ పేరిట బుధవారం ‘సాక్షి’లో కథనం వచ్చిన సంగతి తెలిసిందే. కలకలం రేపిన ఈ కథనం నేపథ్యంలో సదరు సంస్థ గతంలో వెలగబెట్టిన భూ నిర్వాకం ఇప్పుడు బయటికొచ్చింది. ►రేణిగుంట ఎస్టేట్‌లో వివిధ పరిశ్రల కోసం ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) 1983లో ఓ వెంచర్‌ను నెలకొల్పింది. వివిధ సంస్థలకు భూములు కేటాయిస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే ఆంధ్ర ప్రింటర్స్ పేరిట ఉన్న అప్పటి ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి 1986 మే 6న ఎర్రంరెడ్డిపాలెం సర్వే నంబర్ 516లో 1.50 ఎకరాలను 1, 2, 3, 4 ప్లాట్లుగా కేటాయించింది. ►ఏపీఐఐసీ నిబంధనల ప్రకారం సంస్థకు లేదా పరిశ్రమకు కేటాయించిన భూములను విక్రయించడానికి వీల్లేదు. ఒకవేళ సదరు సంస్థకు నష్టం వస్తే ఆ భూమిని తిరిగి ఏపీఐఐసీకే అప్పగించాలి. లేనిపక్షంలో ఏపీఐఐసీ నుంచి ఎన్ఓసీ తీసుకుని భూ బదలాయింపు చేసుకోవచ్చు. కానీ తర్వాతి కాలంలో ఆంధ్ర ప్రింటర్స్ నుంచి పత్రికను కొనుగోలు చేసిన ప్రస్తుత ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఎవరి అనుమతి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా రూ.3కోట్లకు విక్రయించేసుకుంది. కనీసం ఏపీఐఐసీ దృష్టికి తీసుకెళ్లకుండా, ఎన్ఓసీ లేకుండానే అమ్మేసుకున్నట్లు సమాచారం. మళ్లీ 2015లో భూ పందేరం నిబంధనల ప్రకారం ఓ సంస్థకు ఒకేసారి భూ కేటాయింపులు జరపాలి. అయితే చంద్రబాబు తాబేదారుగా వ్యవహరించే సదరు తోక పత్రికకు ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎక్కడ కావాలంటే అక్కడ.. ఎలా కావాలంటే అలా భూ పందేరం జరిగిపోయింది. 2015లో తూకివాకం వద్ద ఆమోద పబ్లికేషన్ పేరుతో మరోసారి విలువైన భూములు కొట్టేసిన సంగతి తెలిసిందే. -
మార్చి 21న వైఎస్సార్సీపీ అవిశ్వాసం
-
బాబోయ్ బాబు అసహనం
-
బొర్లాడ గిరిజనుల దురదృష్టం
=బొర్లాడ గిరిజనుల దురదృష్టం =గుర్తు తెలియని వ్యాధితో సతమతం =ఆరేళ్లలో 14 మంది విషాదాంతం =వ్యాధి బారిన 30 కుటుంబాలు =23 మందికి కాళ్లుచేతులు వంకర, =చెవుడు, దృష్టిలోపం =కొందరికి బుద్ధిమాంద్యం =పట్టించుకోని అధికారులు, నిర్ధారించని వైద్యులు పెదబయలు, న్యూస్‌లైన్ : సాగేని చంద్రుబాబు.. సుబ్బలమ్మ.. సత్యనారాయణ.. సన్యాసమ్మ.. చిన్నమ్మ.. ప్రసాదరావు.. మినుమల భీమన్న.. వడ్డే చంద్రుబాబు.. వీళ్లంతా సామాన్య గిరిజనులు.. తమ బతుకేదో తాము బతికే మామూలు అడవి బిడ్డలు.. అంతే కాదు.. గుర్తు తెలియని వ్యాధి నలిపేస్తూ ఉంటే.. తమ పనులు తాము చేసుకోవడం సైతం కష్టమవుతున్న అభాగ్యులు.. వీళ్లు.. ఇటువంటి అనేకులు చేసిన తప్పల్లా బొర్లాడ గ్రామంలో పుట్టడమే. ఈ నేరానికి వీళ్లు తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్నారు. కాళ్లు, చేతులు వంకర పోయి కదలడానికి సైతం వీలు కాక నరక యాతన అనుభవిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన వీరి వంటి మరో 14 మంది గిరిజనులు ఆరేళ్ల కాలంలో ఇలాగే బాధ పడుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే దురదృష్టమల్లా వీరు ఏ కారణం చేత బాధ పడుతున్నారో.. వేధిస్తున్న వ్యాధి జాడ ఏమిటో కనీసం తెలియజెప్పే వారు కూడా లేని నిస్సహాయ పరిస్థితిని వీరు ఎదుర్కొంటున్నారు. చికిత్స సంగతి దేవుడెరుగు.. కనీసం ఓదార్చే వారు సైతం లేని దుస్థితితో ఉసూరంటున్నారు. పదిహేనేళ్లకే ప్రారంభం ఆచూకీ తెలియని ఈ వ్యాధి లక్షణాలు ప్రశ్నార్ధకంగా ఉన్నాయి. బాల్యంలో అంతా ఆరోగ్యవంతులుగానే ఉంటున్నారు. పదిహేనేళ్లు దాటాక ఎముకల నొప్పులు, కీళ్ల బాధలు మొదలవుతున్నాయని వ్యాధిగ్రస్తులు చెబుతున్నారు. క్రమంగా కీళ్లలో వాపు వచ్చి ఎముకలు వంకర అవుతున్నాయని చెప్పారు. కీళ్ల నొప్పులతో పాటు దృష్టిలోపం, వినికిడి సమస్యలు వస్తున్నాయని తెలిపారు. కొందరికి బుద్ధి మాంద్యం కూడా ఉందని గ్రామస్తులు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. కాళ్లు చేతులు బాగా వంకైరె చివరికి ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నడక సాధ్యం కాక పాకాల్సి వస్తోందని, అరవై ఏళ్లలోపే ఎక్కువ మంది చనిపోతున్నారని తెలిపారు. సందేహాలెన్నో.. బొర్లాడలో ఉన్నవారంతా బగత కులస్తులే. ఇక్కడ అంతా మూడు కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. దాంతో ఇది అనువంశికంగా వస్తున్న వ్యాధా? అన్న సందేహాలున్నాయి. అయితే గిరిజనులకు ఈ విషయాలేవీ తెలియవు. తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ వీరు కాలం గడుపుతున్నారు. బాధితుల్లో కొందరు బుద్ధి మాంద్యంతో కూడా బాధ పడుతున్నారు. ఈ గ్రామానికి చెందిన నలుగురు ఇంటర్మీడియెట్ విద్యార్థులు 2009-10 మధ్య కాలంలో మృతి చెందారు. ఈ సమస్యపై సాక్షిలో కథనాలు రావడంతో వైద్యులు వచ్చి నీటిని, మట్టిని పరీక్షించారు. అంతా బాగుందని చెప్పారని, తర్వాత తమ గోడు ఎవరూ పట్టించుకోలేదని గిరిజనులు ఆవేదనతో చెప్పారు. అప్పుడు కూడా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇటువైపు తొంగి చూడలేదన్నారు. బొర్లాడను ఆనుకుని ఉన్న ముక్కిపుట్టులోనూ ఆరుగురి వరకు ఈ వ్యాధితో బాధ పడుతున్నారని చెప్పారు. గిరిజన సంఘం నాయకుడు కిల్లో సురేంద్ర శనివారం గ్రామాన్ని సందర్శించి వ్యాధిగ్రస్తులను పరిశీలించారు. తక్షణమే పరీక్షలు జరిపి వైద్యం చేయించాలని కోరారు. సమస్యను కలెక్టర్‌కు, ఐటీడీఏ పీవోకు వివరిస్తామన్నారు. దిగుబడి దయనీయం తమ గ్రామంలో వ్యవసాయం కూడా సక్రమంగా సాగడం లేదని బొర్లాడ గ్రామస్తులు చెప్పారు. కూరగాయలు, పసుపు, పిప్పళ్లు తదితర పంటలు వేటిని సాగు చేసినా దిగుబడి బాగుండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ ఊటనీరు తాగేవారమని, ఇప్పుడు గ్రావిటీ పథకం ద్వారా నీటి సరఫరా జరుగుతోందని చెప్పారు. నీటి సమస్య కాదు సమస్యను పెదబయలు పీహెచ్సీ వైద్యాధికారి వంపూరు మోహన్‌రావు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా గ్రామస్తులకు ఎముకల సమస్య ఉందని గుర్తించి నీటిని పరీక్షలకు పంపామని, ఫ్లోరీన్ శాతం సరిగానే ఉందని నిపుణులు తెలిపారని చెప్పారు. గ్రామస్తులను పూర్తి స్థాయిలో నిపుణులు పరీక్షించవలసి ఉందన్నారు.