breaking news
capital budget
-
బడ్జెట్
► బడ్జెట్ స్థూలంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయ, వ్యయపట్టిక. సర్కారు ఆర్థిక, విధాన పత్రం. ప్రజల నుంచి పన్నుల రూపేణా వసూలు చేసిన ధనాన్ని వారికోసం ఎలా వినియోగించబోతున్నారో వివరించే కార్యాచరణ ప్రణాళిక. ►మూలధన బడ్జెట్: మూలధన ఆదాయ, వ్యయ పట్టికగా చెప్పుకోవచ్చు. వార్షిక బడ్జెట్లో మూలధన బడ్జెట్‌తోపాటు రెవెన్యూ బడ్జెట్ కూడా ఉంటుంది. ప్రభుత్వానికి మూలధన ఖాతాలో వసూలయ్యే ఆదాయం, ఖర్చులు మూలధన బడ్జెట్లో ఉంటాయి. ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ వసూళ్లు, ఖర్చులకు సంబంధించిన వివరాలు రెవెన్యూ బడ్జెట్లో ఉంటాయి. ► మూలధన వ్యయం ఆస్తులు సమకూర్చుకునేందుకు, వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చేసే ఖర్చు ఇది. మరో మాటలో చెప్పాలంటే ఆదాయ వనరులు సృష్టించుకునేందుకు లాభాపేక్షతో ప్రభుత్వం చేసే ఖర్చు ఇది. ► ప్రణాళికా వ్యయం: ప్రభుత్వం ఆదాయ వనరులను, ఆస్తులను సృష్టించుకునేందుకు చేసే వ్యయం ఇది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రణాళికలకు చేసే కేటాయింపులు ఈ ఖాతాలో ఉంటాయి. ► ప్రణాళికేతర వ్యయం ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు, రక్షణ, పోలీసు వ్యవస్థల నిర్వహణ, ఎన్నికల నిర్వహణ, కళలు, క్రీడలు, కుటుంబ సంక్షేమం, సమాచార ప్రసార, పర్యాటక రంగాలు, విదేశీ వ్యవహారాలు, కార్మిక సంక్షేమం, వ్యవసాయ రంగాలకు వెచ్చించే నిధులు, వడ్డీలు, రుణ చెల్లింపులు ప్రణాళికేతర ఖాతాలోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ప్రణాళికేతర గ్రాంటులు కూడా ఈ ఖాతాలోనే ఉంటాయి. ► సంచిత నిధి అన్ని రకాల వసూళ్లు, ఆదాయాలు, రుణాల ద్వారా వచ్చిన సొమ్ము ఈ నిధి కింద జమ అవుతుంది. ఈ నిధి నుంచి ఖర్చు చేయడానికి పార్లమెంటు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో రెండు పద్దులుంటాయి. 1. రెవెన్యూ వసూళ్లు-రెవెన్యూ వ్యయం. 2. మూలధన వసూళ్లు-మూలధన వ్యయం. ► ప్రభుత్వ ఖాతా సంచిత నిధిలో జమయ్యే వసూళ్లు మినహా ప్రభుత్వం వద్దకు వచ్చే ఇతర అన్ని రకాల నిధులు ఈ ఖాతాలో జమ అవుతాయి. పార్లమెంటు అనుమతి లేకుండానే ఈ ఖాతాలోని నిధులను ఉపయోగించుకోవచ్చు. రిజర్వ్ బ్యాంకు నుంచి, పీఎఫ్ (భవిష్య నిధి) నుంచి తీసుకునే రుణాలను ఈ ఖాతా కింద ఖర్చు చేస్తారు. ఈ సొమ్మును మళ్లీ చెల్లించాల్సి ఉంటుంది. ► రెవెన్యూ వసూళ్లు పన్నులు, సుంకాల ద్వారా వసూలయ్యే ఆదాయమే రెవెన్యూ వసూళ్లు. ఎగుమతి, దిగుమతి సుంకాలు (కస్టమ్స్), ఎక్సైజ్ డ్యూటీ, కార్పొరేట్ టాక్స్, ఇతరత్రా పన్నుల రూపంలో వచ్చే సొమ్మంతా ఈ ఖాతాలోకే చేరుతుంది. ప్రభుత్వ పెట్టుబడులపై వడ్డీలు, డివిడెండ్ల రూపంలో వచ్చే ఆదాయం, ప్రభుత్వ సేవలపై వసూలు చేసే చార్జీలు.. ఇవన్నీ వీటి కిందకే వస్తాయి. ► రెవెన్యూ వ్యయం ప్రభుత్వ నిర్వహణ, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, బదిలీలపై చేసే ఖర్చును రెవెన్యూ వ్యయంగా పేర్కొంటారు. ఇది ప్రభుత్వానికి ఎలాంటి ఆస్తులను సృష్టించదు. ► రెవెన్యూ లోటు రెవెన్యూ వసూళ్లు, వ్యయానికి మధ్య తేడా. ► ప్రత్యక్ష పన్నులు ప్రభుత్వానికి మనం నేరుగా చెల్లించే పన్నులు ఇవి. ఆదాయ పన్ను, సంపద పన్ను, ఫ్రింజ్ బెని ఫిట్ టాక్స్ మొదలైనవన్నీ ఈ కోవలోకే వస్తాయి. ► పరోక్ష పన్నులు మనం చేసే వ్యయాలపై పరోక్షంగా విధించే పన్ను. కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ టాక్స్‌లన్నీ దీని పరిధిలోకే వస్తాయి. ► బడ్జెట్ అనే మాట ‘బొగెట్టీ’ అనే ఫ్రెంచి పదం నుంచి ఆవిర్భవించింది. బొగెట్టీ అంటే తోలుసంచి అని అర్థం. పూర్వం ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కల పత్రాల్ని సభకు తోలు సంచిలో తీసుకువచ్చేవారు కాబట్టే ఈ మాట వాడుకలోకి వచ్చింది. -
పరిహా(ర)సమా?
రాజధానికి భూములిచ్చిన రైతులు, కౌలుదారులు, కూలీలను పరిహారంపై మభ్యపెడుతున్న సర్కారు ల్యాండ్ పూలింగ్‌కు బడ్జెట్లో రూ.94.84 కోట్లు 33,252 ఎకరాలకు కావాల్సిన ఏడాది సగటు పరిహారమే 133 కోట్లు కౌలుదారులు, రైతు కూలీల ప్రస్తావనే లేని వైనం భూములిచ్చిన రైతులకు ఒకేసారి రూ.లక్షన్నర రుణమాఫీ సంగతేంటో చెప్పలేదు ఏకమొత్తంగా 7,400 మంది రుణమాఫీకి రూ.110 కోట్లు అవసరం ప్రభుత్వం మాటలకు, చేతలకు పొంతనే లేదు సాక్షి, హైదరాబాద్: రాజధానికోసం సమీకరించిన భూములకు సంబంధించి రైతులకు పరిహారం.. రుణమాఫీ విషయంలో, అలాగే వ్యవసాయ కూలీలు, కౌలుదారులు, చేతివృత్తుల వారికి కల్పించాల్సిన ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం మభ్యపెడుతోంది. రాజధాని ప్రాంత రైతులు, కౌలుదారులు, రైతు కూలీలు, వృత్తిదారుల కుటుంబాలను వీధులపాలు చేస్తోంది. రాజధాని భూసమీకరణ విషయంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని ప్యాకేజీని ప్రకటించామని పదేపదే చెప్పుకుంటున్న ప్రభుత్వం బడ్జెట్లో చేసిన కేటాయింపులు చూసిన తర్వాత ఆ ప్రాంతంలోని అన్నివర్గాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమీకరణలో భాగంగా భూములిచ్చిన జరీబు, మెట్ట రైతులకు ఏడాదికి చెల్లిస్తామని చెప్పిన పరిహారానికి ఏమాత్రం సరిపోని రీతిలో కేటాయింపులు చేయగా, కౌలుదారులు, రైతు కూలీలు, ఇతర వృత్తులపై ఆధారపడిన వారిని పూర్తిగా విస్మరించింది. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు నెలకు రూ.2,500 చొప్పున పదేళ్లపాటు రాజధాని సామాజిక భద్రత నిధి (క్యాపిటల్ రీజియన్ సోషల్ సెక్యూరిటీ ఫండ్) కింద చెల్లిస్తామని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కానీ బడ్జెట్లో ఆ ఊసే లేదు. రైతు కూలీలకు వృత్తి నైపుణ్య శిక్షణనిస్తామని, శిక్షణ కాలంలో వారికి స్టైపెండ్ ఇస్తామని తెలిపారు. కానీ ఇందుకు ఎన్ని నిధు లు కేటాయిస్తున్నారో కూడా చెప్పలేదు. ల్యాం డ్ పూలింగ్ లక్ష్యం పూర్తయ్యేవరకు మాటలు కోటలు దాటేలా చెప్పి చివరకు బడ్జెట్ కేటాయింపుల్లో చేతలు గడప కూడా దాటని విధానాన్ని చూపించారు. ఈ మేరకు పట్టణ పరిపాలన, అభివృద్ధి శాఖ కింద నూతన రాజధాని ల్యాండ్ పూలింగ్‌కు రూ.94.84 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ఏమాత్రం సరిపోదు. బడ్జెట్లో అతి తక్కువ కేటాయింపులు చేయడం ద్వారా రాజధాని ప్రాంత రైతులను పరిహారం విషయంలో పరిహాసం చేసినట్లయింది. జరీబు భూములనూ మెట్ట భూములుగా చూపే యత్నం రాజధాని నిర్మాణానికి జనవరి 2 నుంచి భూ సమీకరణ ప్రారంభించారు. మొత్తం 29 గ్రామాల్లో 47,870 ఎకరాల భూమి ఉంది. దీన్లో అసైన్మెంటు, వక్ఫ్‌బోర్డు, దేవాదాయ, ప్రభుత్వ భూములుపోనూ ప్రైవేటు పట్టా భూములు మొత్తం 33,252 ఎకరాలను సేకరించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీటిని భూసమీకరణ కింద పైసా పెట్టుబడి లేకుండా ప్రభుత్వం సేకరించిన సంగతి తెలిసిందే. సేకరించిన భూముల్లో పదేళ్లపాటు ఎకరాకు మెట్టకు రూ.33 వేలు, జరీబు భూమికి రూ.55 వేలు పరిహారాన్ని ప్రకటించింది. అయితే ఈ భూముల్లో ఎన్ని ఎకరాలు మెట్ట భూములున్నాయో.. ఎన్ని ఎకరాలు జరీబు భూములున్నాయో.. ప్రభుత్వం కావాలనే వెల్లడించలేదు. తమవి జరీబు భూములేనని రైతులు చెబుతున్నప్పటికీ తక్కువ మొత్తంలో పరిహారం చెల్లించాలన్న ఉద్దేశంతోనే వాటిని మెట్ట భూములుగా చూపించడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియను తాత్సారం చేయడానికి అవి మెట్ట భూములా? జరీబు భూములా? నిర్ధారించాలంటూ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి భూములసారం తేల్చేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టింది. పరిహారానికి కావాల్సింది రూ.133 కోట్లు ఇదిలాఉంటే 33,252 ఎకరాలకు సగటున ఎకరాకు పరిహారం రూ.40 వేల వంతున లెక్కించినా మొత్తం పరిహారం కింద రూ.133 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. ఆ మేరకు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన దానికంటే ఇంకా పరిహారం చెల్లించేందుకు రూ.39 కోట్లు కావాల్సి ఉంది. ప్రభుత్వం అసెంబ్లీ ప్రారంభమైనరోజు ఆగమేఘాలపై రాజధాని ప్రాంతంలోని నాలుగు గ్రామాల్లో పరిహారం పంపిణీని రైతులకు చెక్కుల రూపంలో ఇచ్చింది. నేలపాడు, ఐనవోలు, అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లో 1,100 ఎకరాలకు ఎకరా రూ.30 వేల వంతున చెక్కుల్ని పంపిణీ చేసింది. అయితే 1,100 ఎకరాలను మెట్ట భూములుగానే తేల్చి పరిహారం ఇవ్వడం గమనార్హం. దీంతో రైతుల్లో తమ భూములు జరీబు భూములైనా సరే.. మెట్ట భూముల పరిహారం అందిస్తారేమోనన్న ఆందోళన నెలకొంది. చెక్కులు పంపిణీ చేసిన రోజు భూముల్ని స్వాధీనం చేసుకున్నట్లుగా ట్రాక్టర్లు, ప్రొక్లెయిన్లు తెచ్చి చదును చేసే కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన మొత్తం రైతుల పరిహారానికే సరిపోదు. పైగా ప్రభుత్వానికిచ్చే భూములను చదును చేసేందుకు, ఇతర కార్యక్రమాలకు అవసరమయ్యే ఖర్చు సీఆర్డీఏ ఎలా సాధిస్తుందనేది ప్రశ్న. కౌలుదారులకు చెల్లింపులేవి? భూములిచ్చిన రైతులకు ప్యాకేజీ.. కౌలు రైతులకు పరిహారం తదితర వివరాలతో ప్రభుత్వం ఇటీవలే జీవో జారీ చేసింది. రాజధాని ప్రాంత 29 గ్రామాల్లో సుమారు 12 వేలమంది కౌలుదారులున్నారు. వీరికి నెలకు రూ.2,500 చొప్పున పదేళ్లపాటు రాజధాని సామాజిక భద్రత నిధి కింద చెల్లిస్తామని పేర్కొన్నారు. కానీ బడ్జెట్లో ఈ నిధి ప్రస్తావనే లేదు. మరోవైపు వేలాదిగా రైతు కూలీ కుటుంబాలున్నాయి. వీరెవరికీ బడ్జెట్లో కేటాయింపుల ప్రస్తావనే చేయలేదు. రైతు కూలీలకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తామని, శిక్షణ కాలంలో స్టైపెండ్ ఇవ్వడం వంటి హామీలు గుప్పిం చారు. భూసమీకరణకు రైతులు అంగీకరించిన తర్వాత ఇక వీరితో పనేంటన్న రీతిలో ఆ వర్గాల్ని ప్రభుత్వం విస్మరించినట్టు కనబడుతోంది. పౌల్ట్రీ, పండ్ల తోటల రైతుల పరిహారం మాటేంటో.. పౌల్ట్రీ రైతులకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని గత కొద్దిరోజులుగా చెబుతూనే ఉన్నారు. వీరి పరి హారం సంగతి, ప్యాకేజీని ఇంతవరకు ప్రకటించలేదు. పౌల్ట్రీ రైతుల సంఖ్య తేలాక పరిహారం చెల్లింపుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. నిమ్మ, జామ, సపోటా, మామిడి రైతులకు ఎకరాకి లక్ష చొప్పున పరిహారం ఇస్తామని బాబు ప్రకటించారు. ఈ మేరకు ‘ఒన్‌టైమ్ అడిషనల్ పేమెంటు’ పేరిట రూ.లక్ష పరిహారం ప్రకటిస్తూ జీవో నం.43ను ఈ నెల 9న జారీ చేశారు. బడ్జెట్లో కేటాయించిన నిధులతో వీరికి పరిహారం ఎలా చెల్లిస్తారన్నదీ ప్రశ్నే. రాజధాని రైతులకు ఏక మొత్తం రుణ‘మాఫీ’యేనా? రాజధాని ప్రాంతంలో రుణ విముక్తి పథకం పరిధిలో లేని పంటలు సాగు చేసిన రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో రూ.లక్షన్నర వరకు ఏక మొత్తంగా మాఫీ చేస్తామని చంద్రబాబు హామీనిచ్చారు. ఆ మేరకు రాజధాని పరిధిలో 7,400 మంది రైతులకు ఒక్కో ఖాతాకు రూ.లక్షన్నర చొప్పున రూ.110 కోట్లు అవసరమవుతాయి. వీరికి విడతలవారీగా కాకుండా ఒకే విడతలో చెల్లించాలంటే రూ.110 కోట్లు కేటాయించాలి. కానీ సీఆర్డీఏకు మొత్తం కేటాయింపులే రూ.94.84 కోట్లు కావడం గమనించాల్సిన అంశం.