breaking news
C & W
-
తయారీ గమ్యాల్లో భారత్ టాప్–3
న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా తయారీకి అత్యంత అనువైన 48 దేశాల జాబితాలో భారత్ మూడో ర్యాంకు దక్కించుకుంది. వ్యయాలు, నిర్వహణ పరిస్థితులపరంగా మిగతా దేశాలకు దీటుగా భారత్ పోటీనిస్తోంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ (సీఅండ్‌డబ్ల్యూ) రూపొందించిన గ్లోబల్ తయారీ రిస్క్ సూచీ (ఎంఆర్ఐ) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. చైనా, అమెరికా ఈ లిస్టులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. భారత్ ఒక ర్యాంకు ఎగబాకి మూడో స్థానానికి చేరింది. నిర్వహణ పరిస్థితులు, వ్యయాలపరమైన అంశాల్లో పోటీ కోణంలో భారత్ అంతర్జాతీయ తయారీ హబ్‌గా ఎదుగుతోందని నివేదిక పేర్కొంది. కరోనా వైరస్ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో ఈ దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితుల్లో భారత్ టాప్ 3 ర్యాంకు దక్కించుకోవడం మరింతగా ఊతమివ్వగలదని సీఅండ్డబ్ల్యూఎండీ (భారత్, ఆగ్నేయాసియా) అన్షుల్ జైన్ తెలిపారు. కరోనా ప్రభావాలను పక్కనపెట్టి వ్యయాలపరమైన పోటీ, సులభతర నిర్వహణ అంశాల్లో చైనా అగ్రస్థానంలో, అమెరికా ద్వితీయ స్థానంలో, భారత్ తృతీయ స్థానంలో ఉంది. ఇక కేవలం వ్యయాలను పరిగణనలోకి తీసుకున్నా కూడా చైనా, వియత్నాంల తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. కానీ రిస్కుల అంశాన్ని తీసుకుంటే 30వ ర్యాంకు దక్కించుకుంది. రాజకీయ, ఆర్థికపరమైన రిస్కులు తక్కువగా ఉన్న దేశాలకు మెరుగైన ర్యాంకులు లభించాయి. సుమారు 20 అంశాల ప్రాతిపదికన సీఅండ్‌డబ్ల్యూ వార్షికంగా గ్లోబల్ ఎంఆర్ఐ రూపొందిస్తుంది. ఈ ఏడాదికి సంబంధించిన ఎంఆర్ఐలో అంతర్జాతీయంగా తయారీ రంగంపై కరోనా వైరస్ ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. డిజిటల్ ఆవిష్కరణలకు కేంద్రం: నాస్కామ్ న్యూఢిల్లీ: భారత్ డిజిటల్ ఆవిష్కరణల కేంద్రంగా అవతరించే సామర్థ్యాలున్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జాని ఘోష్ అన్నారు. ఇందుకోసం నైపుణ్యం, విధాన కార్యాచరణ, విశ్వాస కల్పనపై దృష్టి పెట్టాలని విధానకర్తలకు సూచించారు. ఓ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ఈ మూడు విభాగాల్లో సామర్థ్యాల అభివృద్ధిపై భారత్ దృష్టి సారించాలని, హైపర్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఈ విభాగాలు ఎంతో కీలకమైనవిగా పేర్కొన్నారు. డిజిటల్ నైపుణ్యాల్లో భారత్‌కు కచ్చితమైన అనుకూలతలు ఉన్నాయంటూ.. సరైన విధానాన్ని రూపొందించడం అవసరమని చెప్పారు. -
హైదరాబాద్‌లో 37 శాతం తగ్గిన ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్
న్యూఢిల్లీ: కార్పొరేట్ నిర్ణయాల జాప్యం వల్ల ఈ ఏడాది తొలి త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ 37 శాతం తగ్గిందని ప్రాపర్టీ కన్సల్టెంట్ కుష్మాన్ అండ్ వాక్‌ఫీల్డ్ (సీ అండ్ డబ్ల్యూ) తెలిపింది. అలాగే ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ ఢిల్లీ-ఎన్సీఆర్లో 57 శాతం, అహ్మదాబాద్‌లో 75 శాతం క్షీణించిందని పేర్కొంది. రానున్న త్రైమాసికాలలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ తిరిగి పుంజుకోనుందని తెలిపింది. జనవరి-మార్చి మధ్య కాలంలో ఢిల్లీ-ఎన్సీఆర్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ 14.61 లక్షల చదరపు అడుగుల నుంచి 6.26 లక్షల చదరపు అడుగులకు తగ్గిందని పేర్కొంది. దేశంలోని టాప్-8 నగరాలలో మొత్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ 59 లక్షల చదరపు అడుగుల నుంచి 79 లక్షల చదరపు అడుగులకు పెరిగినట్లు తెలిపింది. ఐటీ-ఐటీఈఎస్ కంపెనీల నుంచి ఆఫీస్ స్పేస్ లీజింగ్‌కు మంచి డిమాండ్ ఉందని పేర్కొంది. బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ అత్యధికంగా 6 రె ట్లు పెరిగి, 5.31 లక్షల చదరపు అడుగుల నుంచి 32 లక్షల చదరపు అడుగులకు పెరిగినట్లు తెలిపింది. ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ లీజింగ్ వృద్ధి 15 శాతంగా ఉంటుందని సీ అండ్ డబ్ల్యూ దక్షిణాసియా ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డెరైక్టర్ సంజయ్ దత్ అన్నారు.