breaking news
Baby Do Die Do Movie
-
ఊహకందని క్రియేటివిటీ ఈ సినిమా
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘బేబీ డూ డై డూ’ ఒకటి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సినిమా అంటేనే లాజిక్కు లేని మాజిక్కు. పైగా ఆ మాజిక్కుకు ఎమోషన్ జోడిస్తే ఇక అది ఊహకందని క్రియేటివిటీ అవుతుంది. అదే క్రియేటివిటీని టైటిల్ కార్డు నుండి శుభం కార్డు వరకు చూడాలనుకుంటే ఈ సినిమానే చూడాలి. అదే ‘బేబీ డూ డై డూ’. ఈ సినిమా ఆలోచనే సామాన్య ప్రేక్షకులకు ఔరా అనిపిస్తుంది. అంతేకాదు... ఈ సినిమా ఓ సాహసమనే చెప్పాలి. బాలీవుడ్ దర్శకుడు నచికేత్ సామంత్ మంచి హోం వర్క్‌తో లాజిక్కు లేని మాజిక్కుని ప్రేక్షకులు నమ్మేట్టే చేశారు. ఈ సినిమా ప్రధాన పాత్రలో హ్యుమా ఖురేషి అద్భుతంగా నటించి, మెప్పించారు. మరి... ఈ ‘బేబీ డూ డై డూ’ సినిమా కథ ఏంటంటే... ఓ పేద కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఆడుకుంటూ ఓ పాడుబడ్డ బంగ్లాలోకి చేరుకుంటారు. ఆ ఇద్దరిలో ఒక అమ్మాయికి వినబడదు, మాట్లాడలేదు. అలా ఆ బంగళా లోపలికి వెళ్ళిన ఆ పిల్లలు ఓ ముసుగు వ్యక్తిని చూస్తారు. ఆ ముసుగు వ్యక్తి మరో వ్యక్తిని చంపుతూ ఉంటాడు. ఇంతలో ఈ పిల్లలు చేసిన అలికిడి వల్ల వీళ్ళిద్దరినీ వెంబడిస్తాడు. ఆ సమయంలో ఇద్దరిలో అన్నీ బావున్న అమ్మాయి ఆ ముసుగు వ్యక్తికి చిక్కుతుంది. అతను ఆ అమ్మాయిని చంపేస్తాడు. మూగ, చెవుడు ఉన్న అమ్మాయి మాత్రం తప్పించుకుంటుంది. ఆ పాప పేరే బేబీ. తాను తప్పించుకునే ముందు బేబీ తన సోదరిని ఆ ముసుగు వ్యక్తి చంపడాన్ని చూసి అతని పై పగ పెంచుకుంటుంది. బేబీ పెరిగే కొద్దీ అతని మీద తన పగ కూడా పెంచుకుంటుంది. పుట్టు మూగ, చెవుడు ఉన్న బేబీ పాపా అనే వ్యక్తి దగ్గర శిక్షణ తీసుకుని ఓ హిట్ ఉమెన్‌గా తయారవుతుంది. పాపా చెప్పిన వ్యక్తులను ప్రత్యేకంగా తయారు చేసిన గొడుగు తుపాకీ సాయంతో చంపేస్తూ ఉంటుంది. పైకి ఓ సాదా సీదా అమ్మాయిలా కనిపించే బేబీ లోపల కరడుగట్టిన హంతకురాలిలా తయారవుతుంది. మరి... ఈ జర్నీలో బేబీకి ఆ ముసుగు వ్యక్తి దొరుకుతాడా? లేదా అన్నది మాత్రం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘బేబీ డూ డై డూ’లోనే చూడాలి. ఇదో మంచి థ్రిల్లర్. సినిమా ఆఖర్లో వచ్చే ట్విస్టులు ఊహకందనివి. ఓ మంచి టైమ్‌పాస్ సినిమా. – హరికృష్ణ ఇంటూరు -
కాంట్రాక్ట్ కిల్లర్‌గా మూగ యువతి.. ‘బేబీ డూ డై డూ’ మూవీ రివ్యూ
సినిమా అంటేనే లాజిక్కులేని మాజిక్కు. పైగా ఆ మాజిక్కుకు ఎమోషన్ జోడిస్తే ఇక అది ఊహకందని క్రియేటివిటీ అవుతుంది. అదే క్రియేటివిటీని టైటిల్ కార్డు నుంచి శుభం కార్డు వరకు చూడలనుకుంటే ఈ సినిమానే చూడాలి. అదే బేబీ డూ డైడూ. ఈ సినిమా ఆలోచనే సామాన్య ప్రేక్షకులకు ఔరా అనిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమా ఓ సాహసమనే చెప్పాలి. బాలివుడ్ దర్శకుడు నచికేత్ సామంత్ మంచి హోం వర్క్ తో లాజిక్కులేని మాజిక్కుని ప్రేక్షకులు నమ్మేట్టే చేశారు. పైగా ఈ సినిమా ప్రధాన పాత్రలో ప్రముఖ బాలివుడ్ నటి హ్యుమాఖురేషి నటించి మెప్పించింది.మరి ఈ బేబీ డూ డై డూ సినిమా కథ ఏంటంటే.. ఓ పేద కుటుంబంలో పిల్లలైన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఆడుకుంటూ ఓ పాడుబడ్డ బంగ్లాలోకి చేరుకుంటారు. ఆ ఇద్దరిలో ఒక అమ్మాయికి వినబడదు, మాట్లాడలేదు. అలా ఆ బంగళా లోపలికి వెళ్ళిన ఆ పిల్లలు ఓ ముసుగువ్యక్తిని చూస్తారు. ఆ ముసుగువ్యక్తి మరో వ్యక్తిని చంపుతూ ఉంటాడు. ఇంతలో ఈ పిల్లలు చేసిన అలికిడి వల్ల వీళ్ళిద్దరినీ వెంబడిస్తాడు. ఆ సమయంలో ఇద్దరిలో అన్నీ బావున్న అమ్మాయి ఆ ముసుగువ్యక్తికి చిక్కుతుంది. అతను ఆ అమ్మాయిని చంపేస్తాడు. మూగ , చెవుడు ఉన్న అమ్మాయి మాత్రం తప్పించుకుంటుంది.ఆ పాప పేరే బేబీ. తాను తప్పించుకునే ముందు బేబీ తన సోదరిని ఆ ముసుగు వ్యక్తి చంపడాన్ని చూసి అతని పై పగ పెంచుకుంటుంది. బేబీ పెరిగేకొద్దీ అతని మీద తన పగ కూడూ పెంచుకుంటుంది. పుట్టు మూగ, చెవుడు ఉన్న బేబీ పాపా అనే వ్యక్తి దగ్గర శిక్షణ తీసుకుని ఓ హిట్ ఉమెన్ గా తయారవుతుంది. పాపా చెప్పిన వ్యక్తులను గొడుగు తుపాకీ సాయంతో చంపేస్తూ ఉంటుంది. పైకి ఓ సాదా సీదా అమ్మాయిలా కనిపించే బేబీ లోపల కరడు గట్టిన హంతకురాలిలా తయారవుతుంది. మరి ఈ ప్రయాణంలో బేబికి ఆ ముసుగు వ్యక్తి దొరుకుతాడా లేదా అన్నది మాత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న బేబీ డూ డై డూ సినిమాలోనే చూడాలి. ఇదో మంచి థ్రిల్లర్. సినిమా ఆఖర్లో వచ్చే ట్విస్టులు మాత్రం ఊహకందనివి. వీకెండ్ కు ఓ మంచి టైంపాస్ సినిమా.


