breaking news
Awaiting for help
-
Delhi Blast: దర్యాప్తులో వేగం.. పరిహారంలో లేదా?
న్యూఢిల్లీ: దేశ రాజధాని డిల్లీలో ఇటీవల జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన బాధితులకు ప్రభుత్వం ఇంకా పరిహారం అందించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగి నెల రోజులు గడుస్తున్నా, తమ గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నవంబర్ 10న జరిగిన ఈ పేలుడులో 15 మంది మరణించగా, 20 మందికి పైగా జనం గాయపడ్డారు.ఈ ఘటన జరిగిన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ. ఐదు లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. రెండు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అయితే ఈ సాయం అందించడంతో తీవ్ర జాప్యం జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, తాము అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు అధికారుల నుండి ఎటువంటి స్పందన రాలేదంటున్నారు.ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. తమ కుటుంబానికి గల ఏకైక ఆధారం కోల్పోయామని, ఇప్పటికీ పరిహారం అందకపోవడంతో తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారు రోదిస్తున్నారు. దీనిపై ‘ది హిందూ’ ఢిల్లీ ప్రభుత్వ వర్గాలను సంప్రదించగా, పత్రాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే అర్హులైన వారందరికీ పరిహారం చెల్లిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరంగా విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: ‘మహా’ రాజకీయాలు.. పవార్ ఇకపై ‘పరివార్’ -
అయ్యో పాపం అనిల్...
పాడైపోయిన రెండు కిడ్నీలు వారానికి మూడు సార్లు డయాలసిస్ ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు సంగెం : విధి ఆడిస్తున్న వింత నాటకంలో పాత్రదారైన యువకుడు రోజులు లెక్క పెట్టుకోవాల్సిన దుస్థితిలో ఉన్నాడు... ఆపన్నహస్తం కోసం దీనంగా ఎదురుచూస్తున్నాడు... మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి బర్ల యాకమ్మ, చొక్కయ్య దంపతులకు కూతురు కోమల, కుమారుడు అనిల్(25) ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన దంపతులు కులవృత్తి బట్టలు ఉతుకుతూ ఉన్నంతలో పిల్లలను పెంచిపోషించారు. అప్పు చేసి కూతురుకు పెండ్లి జరిపించారు. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన కొడుకు అనిల్ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండడంతో ఇక తమ జీవితానికి ఏ ఇబ్బంది లేకుండా సాగిపోతుందని తల్లిదండ్రులు ఆనందపడిపోయారు. అనిల్‌కు పెండ్లి చేద్దామనుకుంటున్న సమయంలో అనారోగ్యం పాలుకావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించిన తల్లిదండ్రులకు పిడుగులాంటి చేదు వార్త.. అనిల్ రెండు కిడ్నీలు పాడైపోయాయని డాక్టర్లు చెప్పారు. దీంతో వారికి ఏమి చేయాలో పాలుపోలేదు. అనిల్ ఆరోగ్యం రోజురోజుకు క్షిణించిపోతుండడంతో కారు నడపడానికి వెళ్లడం లేదు. ఇప్పటికే లక్ష రూపాయల వరకు ఖర్చు చేశామని అత డి తల్లిదండ్రులు చెబుతున్నారు. వారానికి మూడు మూడుసార్లు డయాలసిస్ చేయించాల్సి వస్తున్నదని, ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నప్పటికీ ఖర్చులు,మందులకు వారానికి రూ.5వేలు అవుతున్నాయని వాపోతున్నారు. అయినప్పటికీ అనిల్ జీవితానికి బరోసా లేదని రెండు నెలల్లో కిడ్నీని మా ర్చితేనే బతుకుతాడని, లేకుంటే ఫలితం లేదని డాక్టర్లు చెబుతున్నారని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తన కొడుకు బతికించుకోవడానికి కిడ్నీని ఇవ్వడానికి తల్లి యాకమ్మ ముందుకు వస్తున్నది. అయిన పరీక్షలు చేయించుకోవడానికి, ఆపరేషన్, మందుల కోసం సుమారు రూ.5 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందిస్తేనే తమ కుమారుడిని బతికించుకుంటామని, మనస్సు ఉన్న మహా రాజులు సాయం అందించాలని దీనంగా వేడుకుంటున్నా రు. ఆర్థిక సాయం అందించే వారు 9959876752లో ఫోన్ నంబర్లో సంప్రదించాలని అతడి తల్లిదండ్రులు కోరుతున్నారు.


