breaking news
auvc
-
సాగర గర్భంలో వజ్రాయుధం.. స్వార్మ్
సాక్షి, విశాఖపట్నం: సముద్రజలాల్లో శత్రుదేశాల కదలికలను తిప్పికొట్టడంతోపాటు వారు రహస్యంగా అమర్చే మందుపాతర్లు (మైన్స్) గుర్తించి ని ర్విర్యం చేసేందుకు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సరికొత్త అ్రస్తాన్ని సిద్ధం చేసింది. విశాఖపట్నంలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ ల్యాబోరేటరీ (ఎన్ఎస్టీఎల్) నేతృత్వంలో ‘స్వార్మ్ టెక్నాలజీస్ ఫర్ మైన్ న్యూట్రలైజేషన్’ ప్రాజెక్టు కింద ‘మ్యాన్–పోర్టబుల్ అటానమస్ అండ్ వాటర్ వెహికల్ (ఎంపీ అండ్ ఏయూవీ)ని అభివృద్ధి చేశారు. అత్యంత అధునాతన సాంకేతికతతో పనిచేసే ఈ సరికొత్త ఏయూవీలు, భారత యుద్ధనౌకలకు సురక్షితమైన మార్గాన్ని సుగమం చేయడంలో గేమ్ చేంజర్‌గా మారనున్నాయి. యుద్ధ సమయాల్లో సముద్రజలాల్లో నౌకల రాకపోకలను అడ్డుకోవడానికి శత్రువులు నీటి అడుగున మందుపాతర్లు అమరుస్తారు. ఇవి ఎక్కడున్నాయో తెలుసుకోవడం కష్టమైన పని. ముఖ్యంగా మైన్స్‌ని సముద్రజలాల్లో పసిగట్టాలంటే కచ్చితంగా బాంబ్‌స్కా్వడ్ తరహా రెస్క్యూ బృందాలు.. ప్రాణాలు పణంగాపెట్టి వెళ్లాల్సి వస్తుంది. కొన్నిసార్లు వాటిని కనిపెట్టడం అసాధ్యంగా మారుతుంది. ఇలాంటి ఇబ్బందులకు చెక్‌పెడుతూ డీఆర్డీవో ఓ సరికొత్త ఆయుధాన్ని రూపొందించింది. సముద్రంలో ఉన్న మైన్స్‌ని అటానమస్ విధానంలో గుర్తించడం, వర్గీకరించడం, కచ్చితమైన లొకేషన్‌ను కనుగొని ని ర్విర్యం చేసేందుకు స్వార్మ్ ఏయూవీలను నిరి్మంచింది. ఇవి మైన్ ఫీల్డ్స్ ఉన్న ప్రమాదకర ప్రాంతాల్లో సైతం నౌకలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా సురక్షితమైన మార్గదర్శకత్వం వహిస్తాయి. సాధారణంగా ఈ మైన్స్ తొలగించడానికి పట్టే సమయం కంటే.. ఈ టెక్నాలజీ ద్వారా అత్యంత వేగంగా నౌకలు సురక్షితంగా ఆ ప్రాంతాన్ని దాటేలా చేయవచ్చు.డీప్ లెర్నింగ్ పరిజ్ఞానంతో నిర్మాణంఈ అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్‌లో సైడ్‌స్కాన్ సోనార్, హై రిజల్యూషన్ అండర్ వాటర్ కెమెరాలను ప్రైమరీ పేలోడ్లుగా అమర్చారు. ఇవి సముద్రగర్భంలో మైన్స్ పోలిన వస్తువులను.. రియల్ టైమ్‌లో పసిగట్టేస్తాయి. ఇందులో నిక్షిప్తం చేసిన అత్యాధునిక డీప్ లెర్నింగ్ ఆధారిత టార్గెట్రికగ్నిషన్ అల్గారిథమ్స్.. ఆ ఆబ్జెక్టులను ఆటోమేటిక్‌గా, కచ్చితత్వంతో విశ్లేషి స్తాయి. మనుషుల ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకునే ఈ ఏఐ పరిజ్ఞానం వల్ల మిషన్‌కు పట్టే సమయం భారీగా ఆదా అవుతుంది. సులువుగా మోసుకెళ్లేలా.. ఈ సరికొత్త టెక్నాలజీలో మల్టీపుల్ ఏయూవీలు ఒకేసారి బృందంగా (స్వార్మ్) పనిచేస్తాయి. ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఈ ఏయూవీల మధ్య ఎప్పటికప్పుడు సమాచార మార్పిడి కోసం పటిష్టమైన అండర్ వాటర్ అకౌస్టిక్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఇంటిగ్రేట్ చేశారు. దీనిద్వారా సముద్రగర్భంలో స్వార్మ్ బృందం డేటాను పంచుకుంటూ, ఎప్పటికప్పుడు పరిస్థితిని మెరుగ్గా అంచనా వేస్తుంది.తద్వారా శత్రువుల మైన్స్‌ని మరింత వేగంగా ఛేదించవచ్చు. ఈ ప్రాజెక్టులోని ఏయూవీలు మ్యాన్ పోర్టబుల్ క్లాస్‌కు చెందినవి. అంటే వీటి బరువు, పరిమాణం తక్కువగా ఉండటం వల్ల నావికులు తమ చేతులతో సులభంగా మోసుకెళ్లి నీటిలో ప్రయోగించే వీలుంటుంది. కేవలం నిఘాకోసమే కాకుండా, మైన్స్‌ని ని ర్విర్యం చేయడానికి కూడా ఈ ఏయూవీలు అద్భుతంగా పనిచేస్తాయి. పరిశ్రమల భాగస్వామ్యంతో వీటిని అభివృద్ధి చేసే ప్రక్రియ పురోగతిలో ఉంది. ఎన్ఎస్టీఎల్ సహా ఐదు ల్యాబ్‌ల మేధోమథనంమైన్కౌంటర్ మెజర్ మిషన్ల (ఎంసీఎం) కోసం ఉద్దేశించిన ఈ సరికొత్త తరం ఎంపీ–ఏయూవీలను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేశారు. ఈ స్వార్మ్ నిర్మాణంలో విశాఖలోని ఎన్ఎస్టీఎల్ ప్రధాన పాత్ర పోషించగా.. కేరళలోని ఎన్‌పీవోఎల్, హైదరాబాద్‌లోని ఆర్సీఐ, డీవైఎస్‌ఎల్ అండ్ ఏటీ, పుణెలోని హెచ్ఈఎంఆర్ఎల్ ల్యాబ్‌లు సంయుక్తంగా ప్రాజెక్టుని రూపొందించాయి. రెండురోజుల కిందట నిర్వహించిన ఫీల్డ్ ట్రయల్స్‌లో స్వార్మ్ ఏయూవీల పనితీరు, క్రిటికల్ మిషన్ పారామీటర్లు విజయవంతంగా నిర్ధారణ అవ్వడంతో భారత నౌకాదళం సరికొత్త అధ్యాయానికి చేరువైంది. సముద్రజలాల్లో ఇండియన్ నేవీ ఆధిపత్యాన్ని ఈ స్వార్మ్ టెక్నాలజీ మరింత పెంచుతుందని రక్షణవర్గాలు భావిస్తున్నాయి. -
విద్యార్థులు నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి
ఏయూక్యాంపస్: విద్యార్థులు తమ నైపుణ్యాలను అందిపుచ్చుకునే దిశగా కషిచేయాలని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఉదయం ఏయూ అంబేద్కర్ అసెంబ్లీ మందిరంలో స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ విభాగంలో కల్పిస్తున్న వసతులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రసాయన శాస్త్రంలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవకాశాలు లభిస్తున్నాయన్నారు. విద్యార్థులు తమ ఆలోచన శక్తిని విస్తతం చేసుకోవాలన్నారు. విద్యార్థులు పూర్తి సమయాన్ని తరగతి గదిలో, ప్రయోగశాలలో వెచ్చించాలన్నారు. విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ పూర్తిగా నిశిద్ధమని, ర్యాగింగ్‌కు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి రామన్ మాట్లాడుతూ సత్ ప్రవర్తన కలిగి ఉండటం ఎంతో ప్రధానమన్నారు. వర్సిటీ విద్యార్థులందరికీ సమాన అవకాశాలను కల్పిస్తుందన్నారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. స్కూల్‌ఆఫ్ కెమిస్ట్రీ సంచాలకులు ఆచార్య ఆర్.మురళీకష్ణ రావు విద్యలో అంతరార్ధాన్ని తెలుసుకుని మసలు కోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏ.ఉమా బాబ, వి.వెంకటేశ్వరరావు, పి.శ్యామల,టి.శివరావు, సిద్దయ్య, శైలజ, బసవయ్య పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


