breaking news
atul kulakarni
-
సైకలాజికల్ థ్రిల్లర్
సాయి పల్లవి, ఫాహద్ ఫాజిల్, ప్రకాశ్‌రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అథిరన్’. వివేక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలై మలయాళంలో ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జయంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎ.కె. కుమార్, జి. రవికుమార్ తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. 1970లలో కేరళలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ప్రభాస్ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో తెలుగు టైటిల్ ప్రకటించి, ఆగస్టు చివరి వారంలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’అన్నారు. రెంజి పానికర్, లియోనా లిషోయ్, శాంతి కృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అను మోతేదత్, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్: దక్షిణ్ శ్రీన్వాస్, సంగీతం: పి.ఎస్. జయహరి. -
ఘాజీ సినిమాకు పన్ను మినహాయిస్తారా?
ముంబై: దగ్గుబాటి రానా హీరోగా నటించిన ఘాజీ సినిమాకు కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ సినిమా మొదటి వారంలో దేశవ్యాప్తంగా రూ.19 కోట్ల 40 లక్షల వసూలు చేసింది. పన్ను మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు హీరో రానా తెలిపారు. ఈ సినిమా 1971లో భారత్-పాక్‌ల మధ్య జరిగిన నేవీ యుద్ధ సన్నివేశాలతో తెరకెక్కింది. ఈ యుద్దం మొత్తం 18 రోజుల పాటు సముద్రం లోపల జరిగింది. అప్పటి భారత నేవీకి లెప్ట్నెంట్ కమాండర్ అర్జున్ వర్మ పాత్రలో రానా నటించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చిందని, త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభిస్తుందని ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి, నటులు అతుల్ కులకర్ణి, కేకే మీనన్‌లు ఆశాభావం వ్యక్తం చేశారు.