ఘాజీ సినిమాకు పన్ను మినహాయిస్తారా? | 'The Ghazi Attack' team hopes it's made tax-free | Sakshi
Sakshi News home page

ఘాజీ సినిమాకు పన్ను మినహాయిస్తారా?

Feb 21 2017 3:28 PM | Updated on Sep 5 2017 4:16 AM

దగ్గుబాటి రానా హీరోగా నటించిన ఘాజీ సినిమాకు కేంద్ర ప్రభుత్వం పన్నుమినహాయిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది

ముంబై: దగ్గుబాటి రానా హీరోగా నటించిన ఘాజీ సినిమాకు  కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ సినిమా మొదటి వారంలో దేశవ్యాప్తంగా రూ.19 కోట్ల 40 లక్షల వసూలు చేసింది. పన్ను మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు హీరో రానా తెలిపారు.

ఈ సినిమా 1971లో భారత్‌-పాక్‌ల మధ్య జరిగిన నేవీ యుద్ధ సన్నివేశాలతో తెరకెక్కింది. ఈ యుద్దం మొత్తం 18 రోజుల పాటు సముద్రం లోపల జరిగింది. అప్పటి భారత నేవీకి లెప్ట్‌నెంట్ కమాండర్‌ అర్జున్‌ వర్మ పాత్రలో రానా నటించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చిందని, త్వరలో  కేంద్ర ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభిస్తుందని ఘాజీ దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి, నటులు అతుల్‌ కులకర్ణి, కేకే మీనన్‌లు ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement