సైకలాజికల్‌ థ్రిల్లర్‌

Sai Pallavi Athiran Telugu Release Date is here - Sakshi

సాయి పల్లవి, ఫాహద్‌ ఫాజిల్, ప్రకాశ్‌రాజ్, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అథిరన్‌’. వివేక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలై మలయాళంలో ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఎ.కె. కుమార్, జి. రవికుమార్‌ తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. 1970లలో కేరళలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

ప్రభాస్‌ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో తెలుగు టైటిల్‌ ప్రకటించి, ఆగస్టు చివరి వారంలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’అన్నారు. రెంజి పానికర్, లియోనా లిషోయ్, శాంతి కృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అను మోతేదత్, ఎగ్జిక్యుటివ్‌ ప్రొడ్యూసర్‌: దక్షిణ్‌ శ్రీన్వాస్, సంగీతం: పి.ఎస్‌. జయహరి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top