breaking news
APFSL
-
దేశంలోనే ఎక్కడా లేని విధంగా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’: గౌతం రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించామని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ గౌతం రెడ్డి అన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు వినోదాన్ని సైతం ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని తెలిపారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని పార్క్ హోటల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా గౌతం రెడ్డి మాట్లాడారు. (ఇది చదవండి: ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాల రికార్డులు బ్రేక్: రానా కామెంట్స్ వైరల్) గౌతం రెడ్డి మాట్లాడుతూ.. 'దేశంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించాం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతుంది. ఈ కార్యక్రమం వలన ఎవరికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. 99 రూపాయలకే సినిమా మొత్తం కుటుంబం చూడవచ్చు. ఈ 99 రూపాయ ప్లాన్ 24 గంటలు పని చేస్తుంది .' అని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఎంతో మేలు: గుడివాడ అమర్నాథ్, ఐటీశాఖ మంత్రి దేశంలో ఎక్కడ లేనివిధంగా ఫస్ట్ డే పస్ట్ షో కొత్త కాన్సెప్ట్ రాష్ట్రంలో తీసుకువచ్చామని ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సినిమా రిలీజ్ అయిన రోజే సినిమా ఫ్యామీలీ మెంబర్స్ అంతా ఇంట్లోనే చూసే అవకాశం ఉంటుందని తెలిపారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..' ఫస్ట్ డే పస్ట్ షో కొత్త కాన్సప్ట్‌తో గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ నిర్ణయం వల్ల ఫిల్మ్ ఇండ్ట్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 80 శాతం సినిమాలు రిలీజ్ కాకుండానే మిగిలిపోతున్నాయి. ఒక్కొసారి సినిమాలు విడుదలకు థియేటర్లు దొరికే పరిస్థితి ఉండదు. అటువంటి సినిమాలకు పస్ట్ డే పస్ట్ షో ప్లాట్ ఫామ్ ఎంతో ఉపయోగడుతుంది.' అని అన్నారు. చిన్న సినిమాలకు ఉపయోగం: నిర్మాత సి.కల్యాణ్ నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. '148 దేశాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో వంటి ప్రయోగమే లేదు. మారుమూల గ్రామాల ప్రేక్షలకు ఎంతో ఉపయోగం. ఫస్ట్ డే ఫస్ట్ షో నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు. తెలుగు ఇండస్ట్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ నిర్ణయంతో థియేటర్లకు, నిర్మాతలకు ఎలాంటి నష్టం ఉండదు. చిన్న సినిమాలకు ఎంతో ఉపయోగ పడుతుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది మంచి ప్రయోగం. చిన్న సినిమాలు బతుకుతాయి. కొంతమంది సినిమా వాళ్ల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమం ద్వారా సీఎం జగన్‌కు ఎంతో మంచి పేరు వస్తుంది.' అని అన్నారు. సినిమా ఇండస్ట్రీకి వరం: రమాసత్యం నారాయణ, నిర్మాత నిర్మాత నారాయణ మాట్లాడుతూ..'చిన్న సినిమాలు బతకాలంటే ఓటీటీ తరువాత ఫైబర్ నెట్ అవసరం. ప్రజలకు నవ రత్నాలను సీఎం జగన్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీకి పదో వరంగా ఫస్ట్ డే ఫస్ట్ షో ఇచ్చారు. 99 రూపాయలకే ఇంటిల్లిపాది సినిమా హాయిగా సినిమా చూడవచ్చు.' అని అన్నారు. అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ఏంటీ? చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టంగా ఉంటోంది. ఈ సమయంలో థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేని వారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త సినిమాలు చూసేందుకు తీసుకొచ్చిందే ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్. ఏపీ ఫైబర్ నెట్ తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్ ద్వారా కేవలం రూ.99 కే ఫ్యామిలీ అంతా కలిసి రిలీజ్ మూవీస్ చూడొచ్చు. ఈ ప్లాన్‌కు 24 గంటల వ్యాలిడిటీ ఉంటుంది. థియేటర్లకు వెళ్లకుండానే కుటుంబమంతా కలిసి సినిమా చూసే సదవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. -
సినిమా వాళ్లంటే సీఎం జగన్‌కు ఎంతో అభిమానం, అందుకే..: జోగి నాయుడు
ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం అందరికీ సాధ్యపడదు. అంతదాకా ఎందుకు థియేటర్లో సినిమా చూడటం కూడా చాలామందికి సాధ్యం కాని అంశమే! పల్లెటూర్లలో ఉన్నవాళ్లు, మారుమూల గ్రామాల్లో నివసించేవారికి థియేటర్ అందుబాటులో ఉండదు. దీంతో వారు సినిమాలు రిలీజైన వెంటనే చూడలేరు. ఓటీటీలకు వచ్చేదాకా ఆగాల్సిందే! అయితే వారికి కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఏపీఎస్ఎఫెల్ ద్వారా ఓటీటీ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురాగా ఇప్పుడేకంగా సినిమాలను డైరెక్ట్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్, నటుడు జోగి నాయుడు మాట్లాడుతూ.. 'సినిమా ఇండస్ట్రీకి సీఎం జగన్ ప్రభుత్వం ఎంతో గౌరవం ఇచ్చింది. సినిమా వాళ్లంటే ఆయనకు ఎంతో అభిమానం. అందుకే సినిమావాళ్లకు ఏడెనిమిది పోస్టులు ఇచ్చారు. ఫైబర్‌నెట్ ద్వారా సినిమా రిలీజ్ అనేది కూడా ఒక సంక్షేమమే! ఈ అవకాశం చిన్న నిర్మాతలకు గొప్ప వరం' అన్నారు. నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. 'చిన్న నిర్మాతలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న గొప్ప అవకాశమిది. ఇప్పుడు ఓటీటీ కోసం సినిమాలు చేస్తున్నారు. రేపు ఫైబర్ నెట్ కోసం సినిమాలు తీస్తారు. ఏపీ ఫైబర్‌నెట్ పెద్ద రేంజ్‌కు వెళ్లడానికి మేము సహకరిస్తాం' అని తెలిపారు. -
బోగీ లోపలి నుంచే మంటలు
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమా దానికి బోగీ లోపలి నుంచి వచ్చిన మంటలే కారణమని రాష్ర్ట ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఏపీఎఫ్ఎస్ఎల్) పరిశీలనలో నిర్ధారణైంది. అగ్నిప్రమాదంపై ఏపీఎఫ్ఎస్ఎల్ డెరైక్టర్ శారద ఈ మేరకు డీజీపీ, రైల్వే సేఫ్టీ అధికారులకు ప్రాథమిక అధ్యయన నివేదిక అందించారు. మంటల్లో పూర్తిగా చిక్కుకున్న బీ-1 బోగీలోని బే-4, 5 బెర్తుల వరుస వద్ద మంటలు ప్రారంభమైనట్లు ప్రాథమికంగా నిర్ధారణైందని నివేదికలో పేర్కొన్నారు. ఒక బేలో వరుసగా ఆరు బెర్తులుంటాయి. ఆ బెర్తుల వద్ద నుంచే మంటలు ప్రధానంగా విస్తరించడంతో పూర్తిగా దగ్ధమయ్యాయని, మంటల సమయంలో కొందరు బయటకు వెళ్లేందుకు అద్దాలు పగలగొట్టడంతో బయట నుంచి వచ్చిన గాలితో మంటలు మరింత పెరిగాయని నిపుణుల పరిశీలనలో తేలింది. రైలు దుర్ఘటనకు పేలుడు పదార్ధాలు కారణం కాదని, విద్రోహచర్య లేదని నిపుణుల పరిశీలనలో ఇప్పటికే నిర్ధారణైంది. మంటలు ప్రారంభమైన పది నిమిషాల వ్యవధిలోనే బోగీమొత్తం దగ్ధం కావడానికి మండే స్వభావం ఉన్న రసాయనాలు కారణమా? అనే కోణంలోనూ ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలన జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంటల్లో దగ్ధమైన బీ-1 బోగీని బెంగళూరుకు తరలించడంతో దానిని మరోమారు పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు ఎఫ్ఎస్ఎల్ బృందం బెంగళూరుకు వెళుతోంది. బోగీ పై భాగంలో రూఫ్ మౌంటెడ్ ఏసీ ప్యానెల్ ఉంటుంది.. బెంగళూరు గ్యారేజీలో ఏసీ ప్యానల్‌కు విద్యుత్ సరఫరా ఇవ్వడం ద్వారా ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయిందనేది సరిపోల్చుకోవాల్సి ఉంటుందని ఫొరెన్సిక్ నిపుణులు తెలిపారు.