ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 87.9 శాతం ఉత్తీర్ణత,, బాలురు 82.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. 👉పదో తరగతి పరీక్షా ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో https://education.sakshi.com/en తోపాటుగా https://results.bse.ap.gov.in/ ఈ వైబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక్క క్లిక్‌తో ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి... 👉పది ఫలితాల్లో 96.07 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అలాగే, 57.12 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది.👉మనమిత్ర వాట్సప్ నంబరు 9552300009 ద్వారానూ పొందొచ్చు. ఏపీలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సుమారు 6.30 లక్షల మంది పబ్లిక్ పరీక్షలు రాశారు.ఒక్క క్లిక్‌తో ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...