breaking news
Andhra pradesh Home Minister
-
చంద్రబాబు అవమానిస్తే.. వైఎస్ జగన్ గౌరవించారు
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. తనపై నమ్మకంతో అత్యంత కీలకమైన హోంశాఖను కేటాయించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ చంద్రబాబు నాయుడు దళితుల్ని తక్కువ చేసి మాట్లాడితే.. సీఎం వైఎస్ జగన్ మాత్రం దళిత మహిళనైన తనకు అత్యంత కీలకమైన హోంశాఖను కేటాయించి గౌరవించారన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పుట్టిన కులం తమదని, అలాంటి తమ కులం మీద చంద్రబాబు నాయుడు చిన్న చూపు చూస్తూ తక్కువ చేసి మాట్లాడారని విమర్శించారు. అందుకే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి ప్రజలు తగిన బుద్ది చేప్పారన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ తన నియోజక వర్గంలోని తాగు, సాగు నీటి సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని సుచరిత పేర్కొన్నారు. (చదవండి : సుచరితకు సువర్ణవకాశం!) -
సుచరితకు సువర్ణవకాశం!
సాక్షి, అమరావతి : మంత్రివర్గం కూర్పులో సామాజిక సమతుల్యతకు పెద్ద పీట వేస్తూ దేశ రాజకీయ చరిత్రలో ఎప్పడూ లేని విధంగా ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా ప్రకటించి సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన హోంశాఖను, ఉపముఖ్యమంత్రి పదవులను మహిళలకు కేటాయించి వారి పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. హోంశాఖను మేకతోటి సుచరితకు కేటాయించగా, ఉపముఖ్యమంత్రి హోదాను పుష్పశ్రీవాణిలకు ఇచ్చి మరో రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలి మహిళా హోంమంత్రిగా మేకతోటి సుచరిత, తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా పుష్పశ్రీవాణి చరిత్రకెక్కనున్నారు. (చదవండి : ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు) తండ్రి బాటలోనే... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 ఎన్నికల తర్వాత నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సబితా ఇంద్రారెడ్డిను హోం మంత్రిగా నియమించిన సంగతి తెల్సిందే. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా తండ్రి బాటలోనే నడిచారు. అనూహ్యంగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సుచరితకు కీలకమైన హోంశాఖ బాధ్యతలను అప్పగించారు. నవ్యాంధ్రకు తొలి హోంమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎన్నికల సమయంలో రాజన్న రాజ్యం మళ్లీ తేస్తానని హామి ఇచ్చిన వైఎస్ జగన్.. సీఎం పదవి చేపట్టిన మొదటి రోజు నుంచే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్ కంటే ఒక అడుగు ముందుకేసి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళకు కీలకమైన హోంశాఖ కేటాయించడం గొప్ప విషయమనే చెప్పాలి. (చదండి : ఏపీ మంత్రివర్గ పూర్తి వివరాలు) వైఎస్సార్ ఎమ్మెల్యే చేస్తే.. జగన్ మంత్రిని చేశారు వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి మంత్రివర్గంలో హోంశాఖ బాధ్యతలు చేపట్టనున్న సుచరిత.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్‌పై 7,398 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాజీమంత్రి రావెల కిశోర్‌బాబు చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు. ఫిరంగిపురం మండల జెడ్పీటీసీగా తొలిసారి రాజకీయ రంగప్రవేశం చేశారు. తదనంతరం దివంగత వైఎస్సార్ ఆశీస్సులతో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ మరణాంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి 16,781 ఓట్ల మెజార్టీతో సంచలన విజయాన్ని నమోదు చేశారు. అప్పటి నుంచి వైఎస్ జగన్ వెంటనడుస్తూ.. ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు. ఆమె శ్రమకు తగిన ఫలితంగా వైఎస్ జగన్ ఆమెకు మంత్రిగా అవకాశం కల్పిస్తూ హోంశాఖను అప్పగించారు. -
మావోయిస్టులతో చర్చలకు సిద్ధం: హోం మంత్రి
జనజీవన స్రవంతిలోకి రావాలని మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్.చినరాజప్ప పిలుపునిచ్చారు. మావోయిస్టులతో చర్చలకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మహిళల రక్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అందుకు సంబంధించిన ఫైల్‌పై చినరాజప్ప సంతకం చేశారు. అనంతరం చినరాజప్ప మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను పూర్తిగా అరికడతామని తెలిపారు. శేషాచల అడవుల్లో యథేచ్చగా సాగుతున్న స్మగ్లింగ్‌ను కట్టడి చేయడమే కాకుండా స్మగ్లర్లను పూర్తిగా నిర్మూలిస్తామని వెల్లడించారు. ఈ సందర్బంగా పలువురు పోలీసు ఉన్నతాధికారులు, టీడీపీ నాయకులు చినరాజప్పను కలసి అభినందనలు తెలిపారు.