breaking news
ambika chaudary
-
ములాయంకు మరో ఎదురుదెబ్బ
-
ములాయంకు మరో ఎదురుదెబ్బ
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిన్న మొన్నటివరకు తనకు కుడిభుజంగా భావించిన పార్టీ సీనియర్ నాయకుడు అంబికా చౌదరి పార్టీకి రాజీనామా చేసి.. బీఎస్పీలో చేరారు. పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నానని, ఇక తనను తాను పూర్తిగా బహుజన సమాజ్ పార్టీకి అంకితం చేసుకుంటున్నానని ఆయన ప్రకటించారు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో తొలుత వెనకబడిన తరగతులు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన అంబికా చౌదరి.. మరో ఎనిమిది మందితో పాటు ఉద్వాసనకు గురయ్యారు. ఈయన ఒకప్పుడు ములాయంకు సన్నిహితుడిగా ఉండేవారు. కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తి కూడా పార్టీని వీడి వెళ్లిపోవడం ఆయనకు వ్యక్తిగతంగా నష్టమే అవుతుందని అంటున్నారు.