breaking news
Alaya F
-
నాకు యాక్టింగ్ రాదు.. అందుకే బాడీ చూపించా: పూజా బేడీ
చాలామంది హీరోయిన్లకు యాక్టింగ్ రాదు. ఏదో గ్లామర్‌తో మేనేజ్ చేసేస్తుంటారంతే! అయితే తమకు నటించడం రాదని ఎవరైనా చెబుతారా? కానీ బాలీవుడ్ నటి పూజా బేడీ ఇప్పుడు అదే చేసింది. తనకు అస్సలు యాక్టింగ్ రాదని, దీని నుంచి తప్పించుకునే బాడీ పార్ట్స్ చూపించి తప్పించుకునేదాన్ని అని షాకింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: మొదటి భర్త గురించి అమలాపాల్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్)బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ కూతురు పూజా బేడీ. పలు హిందీ సినిమాల్లో ఈమె నటించగా, అవి హిట్ అయ్యాయి. కాకపోతే ఈమె పెద్దగా మూవీస్ చేయలేదు. తెలుగులో చిట్టెమ్మ గారి మొగుడు, ఎన్టీఆర్ 'శక్తి' చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇవి రెండూ డిజాస్టర్స్ కావడంతో తెలుగులో మరో అవకాశం రాలేదు.రీసెంట్గా ఫిక్కీ (FICCI) ఈవెంట్లో పాల్గొన్న ఈమె.. తనో దారుణమైన నటి అని చెప్పింది. క్లీవేజ్(ఛాతీ భాగం) చూపించి మేనేజే చేసేదాన్ని అని పూజా బేడీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజా బేడీ కూతురు ఆలయ.. బాలీవుడ్లో హీరోయిన్గా చేస్తోంది. తన కుమార్తె మాత్రం తనలాంటిది కాదని, ఉదయం 6 గంటలకే నిద్రలేస్తుందని.. యాక్టింగ్ ప్రొఫెషన్ అంటే ఆమెకు డెడికేషన్ అని చెప్పుకొచ్చింది. సరే ఇదంతా పక్కనబెడితే పూజా బేడీ చేసిన లేటెస్ట్ కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి.(ఇదీ చదవండి: డబ్బు లాక్కొని హీరోయిన్ని భయపెట్టిన బిచ్చగాడు) -
నాన్న రెండో పెళ్లి.. మా అమ్మ వెళ్లి ఆశీర్వదించింది!: నటి
కట్టుకున్న భర్త పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూస్తేనే మహిళలు భరించలేరు. కానీ ఇక్కడ చెప్పుకునే మహిళ మాత్రం భర్త రెండో పెళ్లి చేసుకుంటే వారి పెళ్లికి వెళ్లి మరీ ఆశీర్వదించింది. ఇంతకీ ఆ మహిళ మరెవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటి పూజా బేడీ. భర్త రెండో పెళ్లి చేసుకుంటే ఆమెతో స్నేహం కూడా చేసిందట. ఈ విషయాలన్నింటినీ పూజా బేడీ కూతురు, నటి ఆలయ ఎఫ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.నాన్న రెండో పెళ్లికి..'నా తల్లిదండ్రులు విడిపోయారు. కానీ ఎప్పుడూ కలిసే కనిపించేవారు. మంచి ఫ్రెండ్స్‌లా కలిసిమెలిసుంటారు. ఇప్పటికీ గొప్ప మిత్రులుగానే కొనసాగుతున్నారు. ఎంతలా అంటే.. మా నాన్న రెండో పెళ్లి చేసుకుంటే ఆ వేడుకకు అమ్మ కూడా హాజరైంది. నాక్కూడా ఆ పిన్ని అంటే చాలా ఇష్టం. ఆ పిన్నికి పుట్టిన కుమారుడిని నా సొంత సోదరుడిలానే భావిస్తాను. వాళ్లిద్దరూ నాకెంతో ఇష్టం.విడాకులు మంచి నిర్ణయంనా జీవితంలో వాళ్లు లేకపోయుంటే అన్న ఆలోచనే చాలా భయంకరంగా అనిపిస్తుంది. నా వరకైతే అమ్మానాన్న విడాకులు తీసుకుని మంచి పనే చేశారు. విడాకులను అంత పెద్ద సమస్యగా చూడకుండా చక్కగా హ్యాండిల్ చేశారు. వీళ్లు విడిపోయాక నాకు మంచి మనసున్న పిన్ని, తమ్ముడు దొరికారు.అమ్మ, పిన్ని ఎలా ఉంటారంటే?విడిపోయారన్న మాటే కానీ అమ్మానాన్నలు ఎప్పుడూ ఒకరిగురించి మరొకరు చెడుగా మాట్లాడుకోవటం నేను వినలేదు. పైగా అమ్మ, పిన్ని కూడా ఫ్రెండ్స్‌లా కలిసిపోవడం విశేషం' అని ఆలయ చెప్పుకొచ్చింది. పూజా బేడీ, బిజినెస్మెన్ ఫర్హాన్ 1994లో పెళ్లి చేసుకున్నారు. 2003లో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. కాగా ఆలయ ఎఫ్.. ఈ ఏడాది రిలీజైన బడే మియా చోటే మియా, శ్రీకాంత్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.చదవండి: Laya: రోడ్డునపడ్డా.. అడుక్కుతింటున్నా అని ప్రచారం చేశారు.. బాధేసింది!