breaking news
Akshat Rajan
-
జాన్వీకపూర్ బాయ్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఫోటో వైరల్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ధడక్, గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ వంటి సినిమాలతో మెప్పించినా కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు. స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ స్టార్ హీరోయిన్ లిస్టులోకి ఇంకా వెళ్లలేదు జాన్వీ. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దివాళీ సెలబ్రేట్ చేసుకున్న జాన్వీ ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసింది. ఇందులో తన చిన్ననాటి స్నేహితుడు, బాయ్‌ఫ్రెండ్ అక్షత్ రాజన్‌తో జాన్వీ క్లోజ్‌గా దిగిన ఓ ఫోటో కూడా ఉంది. కొంతకాలం క్రితమే వీళ్లిదరు బ్రేకప్ చెప్పేసుకున్నారంటూ బీటౌన్‌లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీరిద్దరూ మళ్లీ కలిసి కనిపించడంతో ఈ ఫోటో నెట్టింట తెగ షికార్లు కొడుతుంది. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే.. జాన్వీ త్వరలోనే 'మిలి' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. -
శ్రీదేవి కూతురి ఫొటోలపై దుమారం
ప్రఖ్యాత నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ పెద్ద కూతురు జాహ్నవి కపూర్ తన సినిమా అరంగేట్రానికి సంబంధించిన సమాచారం కంటే బాయ్‌ఫ్రెండ్ (బాయ్‌ఫ్రెండ్స్?) వల్లే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. 19 ఏళ్ల జాహ్నవి పార్టీలు, పబ్‌లలో బాయ్‌ఫ్రెండ్స్‌తో కలసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మాయి కౌగిలింతలు, లిప్ లాక్ దృశ్యాలతో ఉన్న ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్‌కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాహ్నవి లవ్‌లో పడినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ కార్యక్రమానికి జాహ్నవి తన లవర్ శిఖర్‌తో పాటు తల్లిదండ్రులతో కలసి ఒకే కారులో రావడం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. కూతురి ప్రేమకు శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరో ట్విస్ట్ ఏంటంటే జాహ్నవి అక్షత్ రాజన్ అనే మరో కుర్రాడితో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావడం దుమారం రేపుతోంది. అక్షత్ జాహ్నవిని ముద్దు పెట్టుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అక్షత్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో జాహ్నవితో కలిసున్న ఫొటోలను ఈ మధ్య తరచూ పోస్ట్ చేస్తున్నాడు. ఈ ఫొటోలను చూసిన నెటిజెన్లు జాహ్నవి అక్షత్‌తో డేటింగ్ చేస్తుందా అని షాక్ తిన్నారు. ఇంతకీ జాహ్నవి డేటింగ్ చేస్తోంది శిఖర్తోనా లేక అక్షత్తోనా? అని అయోమయంలో పడ్డారు. జాహ్నవి లవర్ ఎవరన్నది ఆ అమ్మాయికే తెలియాలి..!