breaking news
ABVP State Committee
-
జాతీయ పునర్నిర్మాణ శక్తిగా...
ఒక దేశ అభివృద్ధి కేవలం ప్రభుత్వాల నిర్ణయాలతోనే సాధ్యం కాదు. సమాజంలోని ప్రతి వర్గం, ముఖ్యంగా యువత తమ బాధ్యతను గుర్తించి దేశ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయినప్పుడే సంపూర్ణమైన ప్రగతి సాధ్యమవుతుంది. ఈ ఆలోచనకు కార్య రూపమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ). 1948 జూన్‌లో ప్రారంభమైన ఈ సంస్థ 1949 జూలై 9న అధికారికంగా నమోదు అయ్యింది. ఏబీవీపీ మొదటి రోజు నుంచే జాతీయ పునర్నిర్మాణం తన లక్ష్యం అని స్పష్టంగా ప్రకటించింది.విద్యార్థులు కేవలం విద్యను పొందే వ్యక్తులు కాకుండా, సమాజ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలను అన్వేషించే బాధ్యత గల పౌరులుగా ఎదగా లని పరిషత్ భావించింది. ఈ లక్ష్య సాధన కోసం నిర్మాణా త్మక కార్యక్రమాలు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలు, విద్యార్థి వ్యవస్థల్లో భాగస్వామ్యం అనే మూడు ప్రధాన మార్గాలను అనుసరించింది.భారతదేశ వైవిధ్యంలో ఏకత్వాన్ని బలపరిచే లక్ష్యంతో ఏబీవీపీ చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో సేయిల్ (స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్ స్టేట్ లివింగ్ ) ఒకటి. దీని ద్వారా ఈశాన్య భారత రాష్ట్రాల విద్యార్థులు దేశంలోని ఇతర ప్రాంతాల కుటుంబాలతో కలిసి నివసిస్తూ భిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం పొందారు. ఇది కేవలం పరిచయ కార్యక్రమం కాకుండా భావోద్వేగపూర్వక జాతీయ ఐక్యతకు ఒక వేదికగా నిలిచింది. ప్రత్యేక తెలంగాణ అంశంపై 1998లో తీర్మానం చేయడం, 2001లో ‘తెలంగాణ సస్యశ్యామల యాత్ర’ నిర్వహించడం, మలిదశ ఉద్యమ సమయంలో విద్యార్థులను సంఘటితం చేయడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టింది.కాలం మారుతున్న కొద్దీ విద్యార్థి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు మారుతున్నాయి. ప్రపంచీకరణ, సాంకేతిక విప్లవం, కృత్రిమ మేధస్సు, పర్యావరణ మార్పులు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏబీవీపీ తన కార్యక్రమాలను విస్తరించింది. అలాగే ‘ఖేలో భారత్’ ద్వారా క్రీడాస్ఫూర్తిని, ‘రాష్ట్రీయ కళా మంచ్’ ద్వారా భారతీయ కళా సంస్కృతిని, ‘స్టూడెంట్స్ ఫర్ డెవలప్మెంట్’ ద్వారా పర్యావరణ బాధ్యతను, ‘స్టూడెంట్స్ ఫర్ సేవ’ ద్వారా సేవా భావాన్ని ప్రోత్సహిస్తోంది. మెడివిజన్, అగ్రివిజన్, టెక్నికల్ సెల్, లా సెల్, పరిశోధన, విద్యా విధానాలపై చర్చలు, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. యువ శక్తిని జాతీయ పునర్నిర్మాణ దిశగా నడిపించే ఈ ప్రయాణాన్ని ఏబీవీపీ నిరంతరం కొనసాగిస్తోంది.– రావుల కృష్ణ, ఏబీవీపీ తెలంగాణ అధ్యక్షుడు, (నేడు ఏబీవీపీ ఆవిర్భవించిన రోజు) -
బంద్ పాటించిన విద్యా సంస్థలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో తరగతులను బహిష్కరించిన విద్యార్థులు సంగారెడ్డి మున్సిపాలిటీ: ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం సంగారెడ్డి పట్టణంలోని పలు విద్యాసంస్థలు బంద్ పాటించాయి. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల విడుదల విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. ఈ సందర్భంగాఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరికాంత్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని శాంతి యుతంగా ఆందోళన చేపడుతున్న విద్యార్థి నేతలపై టీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడి, అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా భయపడేది లేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను, స్కాలర్ షిప్‌లను వెంటనే విడుదల చేయాలన్నారు. బంద్ సందర్భంగా పట్టణంలో పలు విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. కార్యక్రమంలో కన్వీనర్ అనిల్‌రెడ్డి, నెహ్రూ పాల్గొన్నారు. ఖేడ్‌లో కళాశాలల బంద్ విజయవంతం నారాయణఖేడ్: ఏబీవీపీ రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు గురువారం ఖేడ్‌లోని పలు విద్యాసంస్థలు బంద్ పాటించాయి. ఈసందర్భంగా ఏబీవీపీ నాయకులు ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలను బంద్ చేయించారు. అనంతరం పలువురు విద్యార్థి నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి చేయడం సమంజసం కాదన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని ఏబీవీపీ ఖేడ్ డివిజన్ నాయకులు వడ్ల రమేశ్, ఆకాష్, కృష్ణ, సతీష్ నీలేశ్, రామకృష్ణారెడ్డి, ప్రవీణ్, ముజ్జు, సూరి, రాజు హెచ్చరించారు.


