breaking news
Aamer Jamal
-
ఎక్కువ సేపు ఆపలేకపోయాను చిట్టి తల్లి..! పాక్ క్రికెటర్ హృదయ విదారక పోస్ట్
పాకిస్తాన్ అప్ కమింగ్ ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్ (Aamer Jamal) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జమాల్ అప్పుడే పుట్టిన తన బిడ్డను కోల్పోయాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నాడు.చనిపోక ముందు బిడ్డ తన చేతి వేళ్లను పట్టుకున్న దృష్యాన్ని షేర్ చేస్తూ.. "అల్లా దగ్గరి నుండి వచ్చి, తిరిగి అల్లానే చేరుకుంది. నిన్ను ఎక్కువ సేపు ఆపలేకపోయాను చిట్టి తల్లి. అమ్మా, నాన్న నిన్ను చాలా మిస్ అవుతారు. స్వర్గంలో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నానంటూ" బాధను వ్యక్తం చేశాడు.ఈ పోస్ట్‌కు సోషల్‌మీడియాలో విపరీతమైన స్పందన వస్తుంది. బిడ్డను కోల్పోయిన బాధలో జమాల్ పెట్టిన సందేశం నెటిజన్లను కలిచి వేస్తుంది. జమాల్‌కు సానుభూతి సందేశాలు వెల్లువలా వస్తున్నాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా క్రికెట్ అభిమానులు జమాల్‌ను ఓదారుస్తున్నారు.జమాల్ ఇటీవలే పీసీబీ కాంట్రాక్ట్‌ను కూడా కోల్పోయాడు. ప్రస్తుతం అతను పాకిస్తాన్ దేశవాలీ టోర్నీ Quaid-e-Azam Trophyలో ఆడుతున్నాడు. 28 ఏళ్ల జమాల్ పాక్ తరఫున 8 టెస్ట్‌లు, 3 వన్డేలు, 6 టీ20లు ఆడి మొత్తంగా 26 వికెట్లు తీశాడు. టెస్ట్‌ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 352 పరుగులు, వన్డేల్లో 5, టీ20ల్లో 88 పరుగులు చేశాడు. కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన జమాల్ 2022లో టీ20ల ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది సిడ్నీలో ఆస్ట్రేలియాపై అతనాడిన 82 పరుగుల ఇన్నింగ్స్ హైలైటైంది. జమాల్ ఫస్ట్ క్లాస్ కెరీర్ కూడా అద్భుతంగా ఉంది. 40 మ్యాచ్‌ల్లో 99 వికెట్లు తీసి, 1103 పరుగులు చేశాడు. చదవండి: శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం -
PAK VS ENG 1st Test: జమాల్ 'కమాల్' క్యాచ్
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో పాక్ ఆటగాడు ఆమెర్ జమాల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. నసీం షా బౌలింగ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ ఆడిన పుల్ షాట్‌ను జమాల్ 'కమాల్' క్యాచ్‌గా మలిచాడు. మిడ్ వికెట్ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న జమాల్ ఒంటి చేత్తో సూపర్ మ్యాన్‌లా క్యాచ్ అందుకున్నాడు. జమాల్ కమాల్ విన్యాసాన్ని చూసి ఓలీ పోప్‌కు ఫ్యూజులు ఔటయ్యాయి. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.UNBELIEVABLE CATCH 😲Aamir Jamal pucks it out of thin air to send back the England captain 👌#PAKvENG | #TestAtHome pic.twitter.com/MY3vsto4St— Pakistan Cricket (@TheRealPCB) October 8, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ భారీ స్కోర్ చేసింది. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. సైమ్ అయూబ్ 4, బాబర్ ఆజమ్ 30, నసీం షా 33, మొమహ్మద్ రిజ్వాన్ 0, ఆమెర్ జమాల్ 7, షాహీన్ అఫ్రిది 26, అబ్రార్ అహ్మద్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే కెప్టెన్ ఓలీ పోప్ వికెట్‌ను కోల్పోయింది. పోప్ ఖాతా తెరవకుండానే నసీం షా బౌలింగ్‌లో ఆమెర్ జమాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 96/1గా ఉంది. జాక్ క్రాలే (64), జో రూట్ (32) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 460 పరుగులు వెనుకపడి ఉంది. చదవండి: హాంగ్‌కాంగ్ సిక్సర్స్ టోర్నీలో పాల్గొననున్న టీమిండియా -
సత్తా చాటిన బాబర్.. మరోసారి బ్యాట్ ఝులిపించిన ఆమెర్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో పెషావర్ జల్మీ మరోసారి భారీ స్కోర్ సాధించింది. ముల్తాన్ సుల్తాన్స్‌తో ఇవాళ (మార్చి 5) జరుగుతున్న మ్యాచ్‌లో పెషావర్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్‌కు ఓపెనర్లు సైమ్ అయూబ్ (22 బంతుల్లో 46;3 ఫోర్లు, 5 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (40 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరికి వికెట్‌కీపర్ హసీబుల్లా ఖాన్ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్), రోవ్‌మన్ పావెల్ (15 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ఆసిఫ్ అలీ (10 బంతుల్లో 11; 2 ఫోర్లు) తోడయ్యారు. ఆఖర్లో ఆమెర్ జమాల్ (5 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) గత మ్యాచ్ తరహాలో (జమాల్ నిన్న ఇస్తామాబాద్తో జరిగిన మ్యాచ్‌లో పూనకం వచ్చినట్లు ఊగిపోయి 49 బంతుల్లో 8 ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేశాడు) రెచ్చిపోయాడు. సుల్తాన్స్ బౌలర్లలో ఉసామా మిర్, క్రిస్ జోర్డన్లు పెషావర్ బ్యాటర్లకు అడ్డుకట్ట వేయగలిగారు. ఉసామా 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. జోర్డన్ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. వీరిద్దరు మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మొహ్మద్ అలీ 3 ఓవర్లలో 46, డేవిడ్ విల్లే 4 ఓవర్లలో 36, ఇఫ్తికార్ ఓవర్లో 12, ఖుష్దిల్ షా ఓవర్లో 13, అఫ్తాబ్ 3 ఓవర్లలో 30 పరుగులు సమర్పించుకున్నారు. -
ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి విధ్వంసం.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో! వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో పెషావర్ జల్మీ మరో ఓటమి చవిచూసింది. రావల్పిండి వేదికగా ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో పెషావర్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో పెషావర్ ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు యువ ఆల్‌రౌండర్ అమీర్ జమాల్ తన విరోచిత పోరాటంతో అందరని అకట్టుకున్నాడు. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్ కేవలం 18 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అమీర్ జమీల్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. మరో ఎండ్‌లో ఉన్న వాల్టర్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బౌండరీలు వర్షం కురిపించాడు. జమాల్ ఇన్నింగ్స్ చూసి పెషావర్ మరో విజయం తమ ఖాతాలో వేసుకుంటుందని అంతా భావించారు. కానీ ఆఖరిలో జమాల్ ఔట్ కావడంతో పెషావర్ ఓటమి చవిచూసింది. ఓవరాల్‌గా 49 బంతులు ఎదుర్కొన్న జమాల్ 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 87 పరుగులు చేశాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి సంచలన ఇన్నింగ్స్ ఆడిన జమాల్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా లక్ష్య ఛేదనలో పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. AAMER JAMAL PLAYING LIKE HE DID IN THE TESTS IN AUSTRALIA 🔥🔥🔥#HBLPSL9 #tapmad #HojaoAdFree pic.twitter.com/UeiRi24PSB — Farid Khan (@_FaridKhan) March 4, 2024 ఇస్లామాబాద్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్, హునైన్ షా తలా రెండు వికెట్లు సాధించారు.ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇస్లామాబాద్ బ్యాటర్లలో కెప్టెన్ షాదాబ్(51 బంతుల్లో 80, 4ఫోర్లు,6 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. Aamer Jamal REMEMBER THE NAME !🤝#HBLPSL9 #IUvPZ #PSL2024 pic.twitter.com/7Dgqv69zTD — Aussies Army🏏🦘 (@AussiesArmy) March 4, 2024 -
ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్ సరసన చేసిన పాక్ సంచలన ఆల్‌రౌండర్
ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్తాన్‌కు ఓ ఆణిముత్యం లభించింది. ఈ పర్యటనలో తొలి టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన 27 ఏళ్ల పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్.. ఆసీస్ గడ్డపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీస్తున్నాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో 6 వికెట్ల ప్రదర్శనతో (మొత్తంగా 7 వికెట్లు, 10 పరుగులు) చెలరేగిన జమాల్.. ఆ తర్వాత మెల్బోర్న్లో జరిగిన రెండో టెస్ట్‌లో 5 వికెట్లు, 33 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న జమాల్.. తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపు అర్ధ సెంచరీ (97 బంతుల్లో 82; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించిన జమాల్.. ఆతర్వాత బౌలింగ్‌లోనూ విజృంభించి (6/69) ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను తునాతునకలు చేశాడు. జమాల్ ప్రదర్శన కారణంగా పాక్ ఈ పర్యటనలో తొలిసారి మ్యాచ్ గెలిచే అవకాశం దక్కించుకుంది. అయితే పాక్ సెకెండ్ ఇన్నింగ్స్ 68 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి జమాల్ అందించిన సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఈ ఇన్నింగ్స్‌లో జమాల్ (0) ఇంకా క్రీజ్‌లోనే ఉండటంతో పాక్ అతనిపై భారీ అంచనాలే పెట్టుకుంది. అతనికి జతగా రిజ్వాన్ (6) క్రీజ్‌లో ఉన్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జమాల్ సహా రిజ్వాన్ (88), అఘా సల్మాన్ (53) రాణించడంతో పాక్ 313 పరుగులు చేసింది. అనంతరం జమాల్ ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్ సరసన చేసిన పాక్ సంచలన ఆల్‌రౌండర్ పాక్ సంచలన ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్.. దిగ్గజ ఆల్‌రౌండర్లైన ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్ సరసన చేరాడు. ఆస్ట్రేలియా గడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 125 అంత కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు 15 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన పర్యాటక జట్టు ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో బోథమ్, వసీం అక్రమ్ మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. స్కోర్ వివరాలు.. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్: 313 ఆలౌట్ (రిజ్వాన్ 88, జమాల్ 82, కమిన్స్ 5/61) ఆస్ట్రేలియా తొల ఇన్నింగ్స్: 299 ఆలౌట్ (లబూషేన్ 60, మిచెల్ మార్ష్ 54, జమాల్ 6/69) పాకిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్: 68/7 (సైమ్ అయూబ్ 33, రిజ్వాన్ 6 నాటౌట్, జమాల్ 0 నాటౌట్, హాజిల్‌వుడ్ 4/9) మూడో రోజు ఆట ముగిసే సమయానికి 82 పరుగుల ఆధిక్యంలో పాక్ మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ తొలి రెండు మ్యాచ్‌లను నెగ్గి ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది.


