Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

LIVE AP CM YS Jagan Public Meeting at Ponnur
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ పొన్నూరు (గుంటూరు జిల్లా)

Watch Live:  సీఎం జగన్ బహిరంగ సభ పొన్నూరు (గుంటూరు జిల్లా)

కావ్యా మారన్‌ (PC: IPL)
ఎంత పనిచేశావు కమిన్స్‌!.. కావ్య రియాక్షన్‌ వైరల్‌

పవర్‌ హిట్టింగ్‌తో దుమ్ములేపుతూ ఐపీఎల్‌-2024లో రికార్డులు సృష్టించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతోంది. బారీ విజయాల తర్వాత తొలుత ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన ప్యాట్‌ కమిన్స్‌ బృందం.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో చిత్తైంది.చెపాక్‌ వేదికగా 78 పరుగుల తేడాతో ఓడి.. ఐపీఎల్‌ చరిత్రలోనే తమ భారీ పరాజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌ చూస్తున్నంత సేపు అసలు బ్యాటింగ్‌ చేసేది సన్‌రైజర్స్‌ జట్టేనా అనేంత మందకొడిగా బ్యాటింగ్‌ సాగింది. Batting 🤝 Bowling 🤝 Fielding @ChennaiIPL put on a dominant all-round performance & continue their good show at home 🏠 Scorecard ▶️ https://t.co/uZNE6v8QzI#TATAIPL | #CSKvSRH pic.twitter.com/RcFIE9d46K— IndianPremierLeague (@IPL) April 28, 2024 అదే విధంగా.. తొలుత ఫీల్డింగ్‌ చేసిన సమయలోనూ సన్‌రైజర్స్‌ ఏమాత్రం ఆకట్టులేకపోయింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ సహ యజమాని కావ్యా మారన్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.చెపాక్‌లో చెన్నైతో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు స్కోరు చేసింది.ఓపెనర్‌, కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్ 98 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. అయితే, గైక్వాడ్‌ 97 పరుగుల వద్ద ఉన్నపుడు రనౌట్‌ అయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది.కానీ సన్‌రైజర్స్‌ ఫీల్డర్ల తప్పిదం వల్ల అతడు బతికిపోయాడు. చెన్నై ఇన్నింగ్స్‌ పందొమ్మిద ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఉనాద్కట్‌ బౌలింగ్‌లో నాలుగో బంతిని అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ దిశగా.. ఆఫ్‌ కట్టర్‌గా సంధించగా..  గైక్వాడ్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు.బంతిని అందుకున్న కమిన్స్‌ వికెట్లకు గిరాటేయడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో గైక్వాడ్‌ రెండు పరుగులు తీసుకుని సింగిల్‌ తీసి రెండో పరుగు పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కావ్యా మారన్‌ స్పందిస్తూ.. ‘‘నో.. దేవుడా ఎంత పనిపోయింది’’ అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.pic.twitter.com/eBuDpO6WgK— Cricket Videos (@cricketvid123) April 28, 2024

pothina mahesh fires on chandrababu and pawan kalyan
‘కాపులను పవన్ కల్యాణ్‌ ఎదగనీయటం లేదు’

సాక్షి, తాడేపల్లి: 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పుకోలేకపోతున్నారని వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌ అన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియాతో  మాట్లాడారు.‘‘చెప్పింది చేసి చూపించిన  గొప్ప వ్యక్తి సీఎం జగన్. హామీలు నెరవేర్చి ఎన్నికలకు వెళ్తున్న వ్యక్తి సీఎం జగన్‌. సీఎం జగన్‌.. అక్కా చెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చారు. ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేశారు. పేద ప్రజల నమ్మకం సీఎం జగన్‌. పేదల పట్ల సీఎం జగన్‌కు ప్రేమ ఉంది. కూటమి వల్ల ప్రజలకు ఉపయోగం​ లేదు.  పారిశ్రామికవేత్తలకు దోచిపెట్డడానికే బాబుకు అధికారం కావాలి...14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ మేలూ చేయని వ్యక్తి చంద్రబాబు. చేసిన పనులు చెప్పుకుని ఓటెయ్యమని అడుగుతున్న నేత జగన్.  ఓటమి భయంతో చంద్రబాబుకు ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నారు. అందుకే జగన్‌పై దాడి చేయమంటున్నారు. సీఎం జగన్‌.. ప్రభుత్వ స్కూళ్లను సమూల మార్పులు చేసి, పేదలకు ఇంగ్లీషు మీడియం చదివిస్తున్నారు.  చంద్రబాబు, పవన్ ఒకరిపై ఒకరు గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఏం చేస్తారో ఎందుకు చెప్పటం లేదు?. సీఎం జగన్ ఎంతో మేలు చేస్తున్నందునే ఆయన ఫోటో ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది....నిరుద్యోగం, ఉద్యోగాల కల్పనలపై చర్చకు మేము సిద్ధం. దీనిపై చర్చించేందుకు టీడీపీ కూటమికి ధైర్యం ఉందా?.  అంబేద్కర్ భావాజాలాన్ని వాస్తవరూపంలోకి తెచ్చిన నేత సీఎం జగన్.  అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారు. కాపులకు మేలు చేసినదే వైఎస్ జగన్. కాపులను పసుపు సైన్యంగా మార్చే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. చంద్రబాబు మీద అంతటి విశ్వాసం చూపడానికి పవన్ ఎంత ప్యాకేజీ తీసుకున్నారు?...చంద్రబాబు గురించి భజన చేయటం, బాకా ఊదటం తప్ప ఇంకేం చేశారు?. పవన్ కళ్యాణ్ కాపులను ఎదగనీయటం లేదు. కాపుల ఆత్మగౌరవం దెబ్బ తింటోంది. ముద్రగడ కుటుంబంపై చంద్రబాబు దాడి చేయిస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదు? హరిరామజోగయ్య రాసిన లేఖలకు ఎందుకు సమాధానం చెప్పలేదు?.  పవన్ కళ్యాణ్ జీవితంలో ఏదీ పర్మినెంట్‌గా ఉండదు. అన్నీ తాత్కాలిక వ్యవహారాలే...2019 తర్వాత జనసేన నుంచి కాపులు మాత్రమే ఎందుకు వైదొలిగారు?. వారందరినీ చంద్రబాబు ఆదేశాలతో బయటకు పంపారా?. లేక చంద్రబాబు బ్రోకర్ నాదెండ్ల మనోహర్ వలన బయటకు వెళ్లారో పవన్ సమాధానం చెప్పాలి. పవన్‌కు ఎప్పుడూ సేవలు చేసిన అంజిబాబు ఎందుకు బయటకు వెళ్లాడో చెప్పాలి?’’ అని పోతిన మహేష్‌  ధ్వజమెత్తారు. 

Delhi Police Notices To Cm Revanth Reddy Over Amit Shah Fake Video
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు

న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా డీప్‌ఫేక్‌ వీడియో కేసులో మే 1న విచారణకు రావాలని ఆదేశించింది. తన వెంట గ్యాడ్జెట్స్‌ తీసుకురావాలని తెలిపింది.కాగా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను కాంగ్రెస్‌ వైరల్‌ చేసింది. దీనిపై బీజేపీ, హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేయగా.. ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపైన స్పెషల్ సెల్  ఇంటెలిజెన్స్(IFSO) దర్యాప్తు చేస్తోంది.అయితే  తెలంగాణ పీసీసీ అధికారిక ట్విటర్‌ హ్యాండీలో అమిత్‌ షా వీడియో పోస్టు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ చీఫ్‌‌ రేవంత్‌కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఎంతోపాటు తెలంగాణ డీజీపీ, సీఎస్‌కు కూడా ఢిల్లీ నోటీసులు జారీ అయ్యాయి.కాగా దేవంతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి అమిత్ షా కామెంట్స్‌ చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్‌ షా మాట్లాడినట్టుగా ఉంది. అయితే, అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్టు బీజేపీ స్పష్టం చేసింది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడంపై అమిత్ షా ఏమీ మాట్లాడలేదని బీజేపీ తెలిపింది

AP Elections 2024: CM YS Jagan Public Meeting Speech at Chodavaram
చంద్రబాబుని నమ్మితే గోవిందా.. గోవిందా!: సీఎం జగన్‌

అనకాపల్లి, సాక్షి: చంద్రబాబుని నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అ‍న్నారు.  జరగబోయే ఎన్నికలు  ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు.. ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.ఎన్నికల ప్రచార భేరీలో భాగంగా రెండో రోజు సోమవారం ఉత్తరాంధ్ర అనకాపల్లి జిల్లా చోడవరం కొత్తూరు జంక్షన్‌లో నిర్వహించిన ప్రచార సభలో సీఎం జగన్‌ మాట్లాడారు.‘‘జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. అంటే.. మళ్లీ మోసపోవడమే. చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇది. పేదల వ్యతిరేకుల్ని ఓడించేందుకు చోడవరం సిద్ధమా? అని పార్టీ శ్రేణుల్ని, అభిమాన గణాన్ని ఉద్దేశించి గర్జించారు సీఎం జగన్‌.(అందుకు సిద్ధం అని సమాధానం వచ్చింది)మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. ఒక బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుంది?.. గోవిందా.. గోవిందా.. ఇది ఆ తిరుపతిలో స్వామివారికి చెప్పే గోవిందా.. గోవిందా కాదు. చంద్రబాబు మోసానికి ప్రజలు ఎంతలా అతలాకుతలం అయ్యారో చెప్పే గోవిందా.. గోవిందా.రుణమాఫీ అంటూ రైతుల్ని మోసం చేశారు. డ్వాక్రా రుణమాఫీల పేరుతో మోసం చేశారు. 2014 ఎన్నికలకు ముందు జాబ్‌ రావాలంటే బాబు రావాలంటూ మోసం చేశారు. తన పాలనలో చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గోవిందా.. గోవిందా. 2014 టైంలో ఇదే కూటమి మన ముందుకు వచ్చింది. హామీల పేరుతో పెద్ద మోసం చేసింది. ఇప్పుడు ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు అంటున్న చంద్రబాబును నమ్మొచ్చా?.బాబు అధికారంలో ఉంటే వర్షాలు గోవిందా.. రిజర్వాయర్‌లలో నీళ్లు గోవిందా. ఓటుకు నోటుకేసులో అడ్డంగా దొరికిపోయి.. మన రాజధాని గోవిందా. గ్రాఫిక్స్‌ రాజధాని కూడా గోవిందా.. గోవిందా. సింగపూర్‌ను మించిన రాజధాని అంటూ విశాఖను వదిలేశారు. కేంద్రంతో రాజీ పడి.. ప్రత్యేక హోదా గోవిందా.. గోవిందా. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్‌ అయినా గుర్తుకు వస్తుందా?. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని, అభివృద్ధి-సంక్షేమాల విషయంలో గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించి జాగ్రత్తగా ఓటేయాలని, ఎవరు అధికారంలో ఉంటే మంచి జరిగిందో ఆలోచన చేయండని సీఎం జగన్‌, చోడవరం వేదికగా ప్రజలకు పిలుపు ఇచ్చారు. 

World tallest woman Maria Feliciana dos Santos dies
ప్రపంచంలోనే అతిపొడవైన మహిళ కన్నుమూత

ప్రపంచంలోని అతిపొడవైన మహిళల్లో ఒకరిగా ఖ్యాతిగాంచిన బ్రెజిల్‌కు చెందిన మరియా ఫెలిసియానా దోస్‌ శాంటోస్‌ (77) కన్ను మూశారు. 'క్వీన్ ఆఫ్ హైట్'గా ఫెలిసియానా డాస్ శాంటోస్ అనారోగ్యంతో అరకాజులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. న్యుమోనియాతో బాధపడుతున్న చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.ఆమెమరణంతో బ్రెజిల్ వాసులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అభిమానులు, రాజకీయ నాయకులు, ఇతర అధికారులు,  ఆమె మృతిపై సంతాపం ప్రకటించారు.  ఈ సందర్భంగా అరకాజు మేయర్ ఎడ్వాల్డో నోగ్వేరా రాజధాని నగరంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.యుక్త వయసులో ఏకంగా 7 అడుగుల 3.8 అంగుళాల ఎత్తు పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా ఏళ్లపాటు ఆమెను ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన మహిళగా నిలిచారు. అయితే ఆ తర్వాతి కాలంలో ఆమె ఎత్తు కాస్త తగ్గుతూ వచ్చారు.గాయని, బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి మారియా తన టీనేజీలో అసాధారణ రీతిలో ఎత్తు పెరిగింది. యుక్త వయసులో ఆమె దేశంలోని వివిధ నగరాల్లో జరిగే సర్కస్‌లలో పనిచేస్తూ వీక్షకులను అబ్బురపరిచేంది.   ఆ తరువాత జాతీయంగా అంతర్జాతీయంగా పాపులర్‌ అయింది. 1960లో క్వీన్‌ ఆఫ్‌హైట్‌ బిరుదు గెలుచుకోవడంతో బ్రెజిల్‌ అంతటా ఆమె పేరు మార్మోగింది. అలాగే 2022 మేలో బ్రెజిల్‌లోని మ్యూజియం ప్రవేశద్వారం వద్ద మారియా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం. కాగా ఆమె భర్త అష్యూయిర్స్ జోస్ డోస్ శాంటోస్‌.  వీరికి ముగ్గురు పిల్లలు.   మరియా తండ్రి, ఆంటోనియో టింటినో డా సిల్వా, 7 అడుగుల 8.7 అంగుళాలు, ఆమె తాత 7 అడుగుల 5.4 అంగుళాల ఎత్తు ఉండే వారట. 

Entire chiranjeevi family to campaign for Pawan kalyan
ఒక్కడి కోసం ఫ్యామిలీ మొత్తం దిగింది

పార్టీ పెట్టి పుష్కరం దాటినా అసెంబ్లీ  గేటును తాకలేకపోయిన పవన్ కళ్యాణ్ను ఈసారైనా గేటు దాటించేందుకు ఆ ఫ్యామిలీ మొత్తం శ్రమిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలుమార్లు పిఠాపురంలో పర్యటించారు. వర్మ కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ.. మొత్తానికి  తనను అసెంబ్లీకి పంపే బాధ్యత వర్మదే అని పూర్తిగా సరెండర్ అయ్యారు పవన్. ఇక నాగబాబు.. ఇంకా జబర్దస్త్ టీమ్ ఆది, గెటప్ శ్రీను ఇలా చాలామంది అక్కడ ప్రచారం చేస్తూనే ఉన్నారు. దీంతోబాటు మొన్న వరుణ్ తేజ్ సైతం రాడ్ షో నిర్వహించి బాబాయ్‌ను గెలిపించాలని కోరారు.ఇది కూడా సరిపోవడం లేదని భావించిన పవన్ ఇక ఏకంగా తన పెద్దన్న చిరంజీవిని సైతం రంగంలోకి దించుతున్నారు. తానూ రాజకీయాలకు దూరమని, అసలు పక్క రాష్ట్ర పాలిటిక్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని, తానిప్పుడు పూర్తిగా సినిమాల మీద దృష్టిపెట్టానని, తనను పాలిటిక్స్‌లో ఇన్వాల్వ్ చేయవద్దని ఆమధ్య మీడియాముఖంగా ప్రజలకు వివరణ ఇచ్చారు. ఐతే ఇప్పుడు పవన్ పరిస్థితి దారుణంగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నా తరుణంలో చిరంజీవి ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబులతో కూర్చుని ఒక వీడియోను సైతం రిలీజ్ చేసారు.ఇక అవనీ కాదు కానీ నేనే వస్తాను అని ఫిక్స్ అయిన చిరంజీవి ఇప్పుడు పిఠాపురం వస్తున్నారు. త్వరలో అయన ప్రచారం చేస్తారు. వాస్తవానికి ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పవన్ మీద పోటీ చేస్తున్న వంగా గీత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచారు. అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా వర్మ పోటీ చేశారు. ఆనాడు చిరంజీవి వంగా గీతకు పిఠాపురంలో ప్రచారం చేశారు. అప్పుడు గీత ఏకంగా వర్మను ఓడించి అసెంబ్లీకి వెళ్లారు.  అయితే ఆ వంగా గీత ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున మళ్ళీ అదే పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఐతే ఇప్పుడు అదే చిరంజీవి గీతకు వ్యతిరేకంగా తమ్ముడు పవన్ కోసం ప్రచారం చేస్తున్నారు. గతంలో గీతను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేసిన చిరంజీవి ఇప్పుడు అదే గీతను ఓడించాలంటూ తమ్ముడి కోసం ప్రచారం చేయబోతున్నారు. మొత్తానికి సీఎం వైఎస్ జగన్ ప్రభావంతో పవన్‌కు ఓటమి భయం పట్టుకుంది. దానికితోడు స్థానికురాలు అయిన గీతను ఓడించడం తనకు అసాధ్యం అని పవన్ కు అర్థం కావడంతో కనీసం జీవితంలో ఒకసారి అయినా ఎమ్మెల్యే అవ్వాలన్న జీవితాశయం నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.:::: సిమ్మాదిరప్పన్న

శివం దూబే (PC: IPL.com)
T20 WC: తుదిజట్టులో చోటివ్వాల్సిందే.. కెప్టెన్‌ కూడా కాదనలేడు!

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ శివం దూబే మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 20 బంతుల్లో ఒక ఫోర్‌, నాలుగు సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(98), డారిల్‌ మిచెల్‌(52)తో కలిసి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు 212 పరుగుల భారీ స్కోరు అందించాడు. తద్వారా రైజర్స్‌పై 78 పరుగుల తేడాతో గెలుపొందడంలో తన వంతు పాత్ర పోషించాడు.కాగా ఐపీఎల్‌-2024లో ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. సీఎస్‌కే తరఫున మిడిలార్డర్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగుతున్న దూబే.. తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 350 పరుగులు చేశాడు.ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టు ఇప్పటి దాకా సాధించిన ఐదు విజయాల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌-2024 ఆడనున్న టీమిండియాలో అతడికి తప్పక చోటివ్వాలని డిమాండ్లు పెరిగాయి.ఈ నేపథ్యంలో సీఎస్‌కే తాజా విజయం నేపథ్యంలో దూబే ఇన్నింగ్స్‌పై స్పందించిన భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పిల్లాడు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతడిని కేవలం ప్రపంచకప్‌ జట్టుతో పంపించడమే కాదు.తుదిజట్టులోనూ అతడిని తప్పక ఆడించాలి. కేవలం ఎంపిక గురించి కాదు.. ప్లేయింగ్‌ ఎలెవన్‌లోనూ చోటివ్వాలని సెలక్టర్లు ఫిక్సైపోవాలి. కెప్టెన్‌గానీ.. మేనేజ్‌మెంట్‌ గానీ అతడిని విస్మరించడానికి వీల్లేదు.ప్రస్తుత టీమిండియా ప్లేయర్లలో అతడి కంటే బెటర్‌గా హిట్టింగ్‌ ఆడే బ్యాటర్‌ మరొకరు లేరు. ఒకవేళ అతడిని గనుక బెంచ్‌కే పరిమితం చేస్తే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌-2024 మొదలుకానుంది. ఈ నేపథ్యంలో జట్ల ప్రకటనకు మే 1 ఆఖరి తేదీగా పేర్కొంది ఐసీసీ.  

NEET aspirant hangs self in Rajasthan's Kota 9th suicide this year
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో తొమ్మిదో ఘటన

దేశంలోనే ‘కోచింగ్‌ హబ్‌’గా ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువు ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నీట్‌పరీక్షకు సిద్ధమవుతున్న మరో విద్యార్థి తాజాగా తనువు చాలించాడు.హర్యానా రోహ్‌తక్‌కు చెందిన సుమిత్‌ అనే 20 ఏళ్ల విద్యార్థి నీట్‌ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. ఏడాదిగా కోటాలోని కున్హాడి ల్యాండ్‌మార్క్‌ సిటీలో ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ సెంటర్‌లో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అతను తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఆదివారం  సుమిత్‌కు అతడి తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. అనుమానం వచ్చి వారు హాస్టల్‌ వార్డెన్‌కు ఫోన్‌ చేశారు. సిబ్బంది సుమిత్‌ గది వద్దకు వెళ్లి చూడగా.. డోర్‌ లాక్‌ చేసుకొని రూమ్‌లో ఉరేసుకొని కనిపించాడు. దీంతో హాస్టల్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.కాగాా కోటాలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు కలకలం రేపుతున్నాయి.  తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. ఇక గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్ధులు ప్రాణాలు విడిచారు.

Gutta Amit Joined In Congress Party
బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు మరో​ షాక్‌ తగలింది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.కాగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి సోమవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్‌ సమక్షంలో గుత్తా అమిత్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ గార్ల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్.జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్… pic.twitter.com/4YkyrxJvSy— Telangana Congress (@INCTelangana) April 29, 2024 ఇదిలా ఉండగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గుత్తా అమిత్‌.. బీఆర్‌ఎస్‌ నుంచి పార్లమెంట్‌ స్థానం ఆశించారు. భువనగిరి లేదా నల్లగొండ స్థానం ఆశించి భంగపడ్డారు. బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ దక్కకపోవడంతో ఆయన తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మరోవైపు.. గుత్తా సుఖేందర్‌ కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement