Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

Daily Horoscope Rasi Phalalu April 29-04-2024 Telugu
Horoscope Today: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.పంచమి ఉ.5.37 వరకు, తదుపరి షష్ఠి తె.4.27 వరకు (తెల్లవారితే మంగళవారం), నక్షత్రం: పూర్వాషాఢ రా.2.28 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: ప.12.22 నుండి 1.54 వరకు, దుర్ముహూర్తం: ప.12.23 నుండి 1.11 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.44 వరకు, అమృతఘడియలు: రా.9.40 నుండి 11.32 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.40, సూర్యాస్తమయం: 6.14. మేషం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. బంధువుల నుంచి సమస్యలు. పనులు వాయిదా. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు.వృషభం: కుటుంబసభ్యులతో అకారణ వైరం. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో గందరగోళం.మిథునం: పనుల్లో  విజయం. ఆర్థిక లాభాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.కర్కాటకం: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.సింహం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు.కన్య: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. పనులలో ఆటంకాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.తుల: కీలక నిర్ణయాలు. విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు అధిగమిస్తారు.వృశ్చికం: పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఆటంకాలు.ధనుస్సు: ఆర్థిక విషయాలలో పురోగతి. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఉద్యోగాన్వేషణలో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో  అనుకూల పరిస్థితి.మకరం: ర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. వ్యాపార, ఉద్యోగాలు సాధారణస్థాయిలో కొనసాగుతాయి.కుంభం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.మీనం: కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. బంధువుల కలయిక. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. 

KTR comments on Congress Party and BJP
హైదరాబాద్‌పై కన్నేశారు.. జాగ్రత్త!

కరీంనగర్‌/ వేములవాడ:  హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్రలకు కాంగ్రెస్, బీజేపీ తెరలేపాయని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నాయని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే వారి కుట్రలను ఛేదిస్తామని పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తలు, బూత్‌ లెవల్‌ కమిటీలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేలా ఒప్పందం జరిగింది. వచ్చే జూన్‌ 2తో ఆ గడువు ముగుస్తోంది. హైదరాబాద్‌పై కన్నేశారు.. తస్మాత్‌ జాగ్రత్త. కాంగ్రె స్, బీజేపీలు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటింపజేసేందుకు కుట్రలు మొ దలుపెడతాయి. అలా చేస్తే అడ్డుకునే శక్తి గులాబీ పార్టీకి మాత్రమే ఉంది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కయ్యాయి. పరస్పరం సహకరించుకుంటూ.. బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలిపాయి. రాష్ట్రంలో పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే తెలంగాణ ప్ర యోజనాలే లక్ష్యంగా ఆ రెండు పారీ్టల కుట్రలను ఛేదిస్తాం. దేశంలో 400 ఎంపీ సీట్లలో గెలిస్తే.. రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లను ఎత్తివేస్తా మని బీజేపీ నాయకులు ప్రగ ల్భాలు పలుకుతున్నారు. అలాంటి వాటిని కూ డా అడ్డుకునే శక్తి కూడా గులాబీ పారీ్టకే ఉంది.వారితో ఒరిగేదేమీ లేదు..2014 నుంచి కేంద్రంలో బడేభాయ్‌ మోదీ.. వంద రోజుల నుంచి రాష్ట్రంలో చోటే భాయ్‌ రేవంత్‌.. ఇద్దరూ ప్రజలను మోసం చేస్తున్నారు. గాలి మాటల సీఎం రేవంత్‌రెడ్డి, మాయమాటల ప్రధాని మోదీలతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఇచి్చన హామీలను మోదీ సర్కార్‌ అమలు చేయలేదు. హైదరాబాద్‌కు ప్రకటించిన ఐటీఐఆర్‌ను కూడా ఎత్తివేసింది. మోదీ పదేళ్ల పాలనలో ప్రజలకు తీరని ద్రోహం చేశారు. రైతుల ఆదాయాన్ని డబుల్‌ చేస్తామని.. వారి కష్టాలను మాత్రం డబుల్‌ చేశారు. 2014లో రూ.400 ఉన్న సిలిండర్‌ ధరను ఇప్పుడు రూ.1,200కు పెంచారు.సామాన్యులపై పెను భారం పడుతోంది. జాతీయ రహదారుల కోసం సెస్‌ పేరిట రూ.30లక్షల కోట్లు వసూలు చేసి.. ఇందులో సగం రూ.14 లక్షల కోట్లు అదానీ, అంబానీ వంటి కార్పొరేట్‌ రుణ ఎగవేతదారులకు అందించారు. యువతలో మతవిద్వేషాలు నింపి తప్పుదోవ పట్టిస్తున్నారు..’’అని కేటీఆర్‌ మండిపడ్డారు. ప్రజలు, యువత మరోసారి బీజేపీ మాయలో పడొద్దన్నారు. ఈ సమావేశాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

YSR family in election campaign at ysr kadapa district
సకుటుంబ సపరివార సమేతంగా

సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌ కుటుంబానికి కంచుకోట అయిన వైఎస్సార్‌ జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఘనవిజయానికి ఆయన కుటుంబమంతా కదిలింది. పులివెందుల అసెంబ్లీ స్థానంలో సీఎం వైఎస్‌ జగన్‌కు, కడప ఎంపీ స్థానంలో వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, పార్టీ ఇతర అభ్యర్థులకు గత ఎన్నికల్లోకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించే బాధ్యతలను కుటుంబ సభ్యులు భుజాన వేసుకున్నారు. అందరూ కలిసి ప్రణాళిక ప్రకారం జిల్లా ప్రజల ముందుకు వెళ్తున్నారు. వైఎస్సార్‌ సోదరులు, సమీప బంధువులు నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు.సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతమ్మ సహా మరికొందరు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అందించిన సంక్షేమం, సాధించిన అభివృద్ధి, సుపరిపాలనను వివరిస్తూ గత ఎన్నికలకంటే మరింత ఎక్కువ మెజార్టీతో ఘనవిజయాన్ని అందించాలని ప్రజలను కోరుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, సామాన్యుల ఉన్నతే లక్ష్యంగా, విశేష పారిశ్రామిక ప్రగతి సాధించిన సీఎం వైఎస్‌ జగన్‌ను, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించారని, మరోమారు ఎమ్మెల్యేగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, కడప ఎంపీగా వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కుటుంబ సభ్యులకు బాధ్యతలిలా.. వైఎస్సార్‌ సోదరులు వైఎస్‌ రవీంద్రనాథరెడ్డి, వైఎస్‌ సు«దీకర్‌రెడ్డి, వైఎస్‌ మధుకర్‌రెడ్డి కడప నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల మున్సిపాలిటీకి వైఎస్‌ మనోహర్‌రెడ్డి, లింగాలకు వైఎస్‌ అభిõÙక్‌రెడ్డి, తొండూరుకు వైఎస్‌ మదన్‌మోహన్‌రెడ్డి ఇన్‌చార్జిలుగా ఉన్నా­రు. పులివెందుల రూరల్, కొండాపురం మండలాలకు చవ్వా దుష్యంత్‌రెడ్డి, జమ్మలమడుగుకు చవ్వా జగదీష్రెడ్డి ప్రచార బాధ్యతలు చేపట్టారు. వేముల మండల ఇన్‌చార్జిగా డాక్టర్‌ ఈసీ దినేష్‌రెడ్డి, సింహాద్రిపురానికి గండ్లూరు వీరశివారెడ్డి, చక్రాయపేటకు వైఎస్‌ కొండారెడ్డి, వేంపల్లెకు వైఎస్సార్‌ మేనల్లుడు యువరాజ్‌రెడ్డి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ విజయం కోసం సీఎం వైఎస్‌ జగన్‌  సతీమణి భారతమ్మ, ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి సతీమణి వైఎస్‌ సమతారెడ్డి, సోదరి వైఎస్‌ శ్వేతారెడ్డి, చవ్వా సునీతారెడ్డి, వైఎస్‌ తేజారెడ్డి, దివ్య (వైఎస్సార్‌ మేనకోడలు) విస్తృతంగా పర్యటిస్తున్నారు. వీరంతా ఇప్పటికే పులివెందుల, కడప, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో పర్యటించారు. జగన్‌ చెబితే చేస్తారు.. చంద్రబాబు చెప్పినా చేయరు: వైఎస్‌ భారతమ్మ పులివెందుల/తొండూరు: సీఎం వైఎస్‌ జగన్‌ చెబితే చేస్తారని, చంద్రబాబు చెప్పినా చేయరని సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతమ్మ చెప్పారు. రాష్ట్ర ప్రజలందరిదీ కూడా ఇదే అభిప్రా­యమన్నారు.  ఆమె ఆదివారం వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం ఇనగలూరులో ప్రజలతో మమేకమయ్యారు. పులి­వెందులలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ప్రజలతో మాట్లా­డారు.తమకు సీఎం జగన్‌ వల్ల అన్ని పథకాలూ అందుతున్నాయని అక్కడున్న వారంతా చెప్పారు. తమ కుటుంబాలన్నీ ఎంతో సంతోషంగా ఉన్నాయని, తమ ఓట్లు వైఎస్సార్‌సీపీకే అని బదులిచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు భారతమ్మ స్పందించారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి గత ఎన్నికల్లోకంటే మరింత ఎక్కువ మెజార్టీని ఇస్తారని చెప్పారు. ఇందుకు వారే నిదర్శనమంటూ ప్రజలను చూపించారు. అక్కడున్న ప్రజలంతా జగన్‌మోహన్‌రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీని అందిస్తామంటూ నినదించారు. మేనిఫెస్టో గురించి భారతమ్మ మాట్లాడుతూ ఇప్పు­డున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆ పథకాలకు సీఎం జగన్‌ మరింత మెరుగులు దిద్ది అందిస్తారని చెప్పారు. పులివెందుల అంటే వైఎస్‌ కుటుంబానికి బలమని,   40 ఏళ్లుగా ప్రజలు ఆదరిస్తున్నారని, వారి రుణం ఎప్పటికీ తీర్చు­కోలేమన్నారు. ఆమెతో పాటు వైఎస్‌ సమత, వైఎస్‌ మధురెడ్డి కోడలు చైతన్య, డాక్టర్‌ చందన ఉన్నారు.ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో ఎదురు లేని వైఎస్సార్‌ కుటుంబం​​​​​​​ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్సార్‌ కుటుంబానికి ఇప్పటివరకు ఎదురే లేదు. కడప పార్లమెంటు నుంచి 1989లో తొలిసారి వైఎస్సార్‌ ఎంపీగా ఎన్నికయ్యారు. వరసగా నాలుగు పర్యాయాలు ఆయనదే విజయం. 1989 నుంచి 2019 వరకు 10 సార్లు కడప పార్లమెంటుకు ఎన్నికలు జరగ్గా, అన్ని ఎన్నికల్లో జిల్లా ప్రజానీకం వైఎస్‌ కుటుంబానికే పట్టం కట్టారు. నాటి నుంచి నేటి వరకు వైఎస్‌ కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.   

Complaint by Civil Societies to Election Commission
రాజ్యాంగబద్ధ సంస్థలను కించపరిచేలా ఈనాడు రాతలు

సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఎన్నికల సంఘం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నేతృత్వంలో పనిచేసే కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అగాధం సృష్టించడం, వాటిని కించపరచడమే లక్ష్యంగా ఈనాడు దురుద్దేశపూర్వక కథనాలను ప్రచు­రిస్తోందంటూ పౌర సంఘాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. రెండు వ్యవస్థల ప్రతిష్టను దిగజార్చి, ప్రజల్లో చులకన చేసే లక్ష్యంతో పెన్షన్ల పంపిణీపై ‘ఎవరి ఆధీనంలో ఎవరు’ అంటూ కథనాన్ని ప్రచురించారంటూ ఏపీ ఇంటిలెక్చువల్‌ అండ్‌ సిటిజన్స్‌ ఫోరం, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ ఫోరం ఆదివారం ఫిర్యాదు చేశాయి.ఈ సందర్భంగా  ఏపీ ఇంటిలెక్చువల్‌ అండ్‌ సిటిజన్స్‌ ఫోరం అధ్యక్షుడు పి. విజయబాబు మాట్లాడుతూ.. ఈనాడు కథనం ప్రజల్లో అపోహలు సృష్టించేలా ఉందన్నారు. ఎన్నికల సంఘం పారదర్శకత, సమగ్రత, నిబద్ధ­తను ఈ కథనం ప్రశి్నంచేదిగా ఉందన్నారు. ఈ కథనాన్ని ప్రచురించిన ఈనాడుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  ఈ తరహా వార్తలు పత్రికా విలువలను, నైతికతను దిగజార్చేలా ఉన్నందున, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కూడా జోక్యం తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు.ఏపీ ఎడి­టర్స్‌ అసోసియేషన్‌ ఫోరం అధ్యక్షుడు వీవీఆర్‌ కృష్ణంరాజు మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీపై ఎన్ని­కల సంఘం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచి్చందని, వాటిని కార్యనిర్వాహక వ్యవస్థ కూడా పాటించిందని చెప్పారు. అయినప్పటికీ, ఈ రెండు వ్యవస్థల మధ్య సమన్వయం లేదనే విధంగా ఈనాడు కథనం ఉండటం శోచనీయమన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో ఎన్నికల సంఘం ఇస్తున్న ఆదేశాలను సీఎస్‌ తూచ తప్పకుండా పాటిస్తున్నప్పటికీ, ఆయన పనితీరుపై అపోహలు కలి్పంచేలా తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వాలను దించి వేయడం, వాటికి అనుకూలమైన పార్టీలను అందలం ఎక్కించడం అనే రాజ్యాంగ విరుద్ధమైన బాధ్యతను భుజాలకెత్తుకున్నాయని కృష్ణంరాజు విమర్శించారు. ప్రభుత్వాల పనితీరుపై ఎన్నికల సమయంలో ప్రజలే వారి నిర్ణయాన్ని ప్రకటిస్తారని, కానీ వారి నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా తప్పుడు కథనాలను ప్రచురించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. 

YS Jagan to visit Anakapalli District on April 29
నేడు సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభలు ఇలా..

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మూడు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొంటారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. 29వ తేదీన సీఎం జగన్‌ పాల్గొనే ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ను తలశిల రఘురాం ఆదివారం ప్రకటించారు.ఆ వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అమలాపురం పార్లమెంట్‌ పరిధిలోని పి.గన్నవ­రం నియోజకవర్గంలో ఉన్న అంబాజీపేట బస్టాండ్‌ రోడ్డులో జరిగే సభలో.. మధ్యా­హ్నం 3 గంటలకు గుంటూరు పార్లమెంట్‌ పరిధిలోని పొన్నూరు ఐలాండ్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

Chandrababu in Andhra Pradesh has put pensioners in trouble
అవ్వాతాతలకు బాబు బ్యాచ్‌ తెచ్చిన కష్టాలు

సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్రంలోని లక్షలాది అవ్వాతాతలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీరికి జీవనాధారమైన ప్రభుత్వ పింఛను అందకుండా కుట్రలు పన్నుతున్నారు. సీఎం జగన్‌ వలంటీర్ల ద్వారా 65,49,864 మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛను లబ్ధిదారులకు నెలనెలా ఠంఛనుగా ఒకటో తేదీనే వారున్న చోటునే పింఛను అందిస్తున్నారు. గత ఐదేళ్లుగా నిరి్వఘ్నంగా ఇంటి వద్దే పింఛను అందుతుండటం చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో బ్యాచ్‌కు కంటగింపయింది. దీంతో బాబు బ్యాచ్‌ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుల కారణంగా పింఛన్‌ లబ్ధిదారులు గత నెలలో సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు బ్యాచ్‌ పచ్చ కళ్లు చల్లబడకపోవడంతో వీరికి మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. చంద్రబాబు హయాంలో పింఛను మంజూరవడమే గగనమైతే, ఆ వచ్చే కాస్త పింఛను కోసం అవ్వాతాతలు,  దివ్యాంగులను నానా అగచాట్లకు గురిచేసే వారు. అందులోనూ కమీషన్లు గుంజేవారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛన్‌దారుల అవస్థలకు చెల్లుచీటీ పాడారు. సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఎప్పటికప్పుడే కొత్త పింఛన్ల మంజూరు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛనుగా పింఛను ఇంటి వద్దే అందించేవారు. సీఎం జగన్‌ చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమంతో గత 58 నెలలుగా పింఛనుదారులు ఎటువంటి ఇబ్బందీలేకుండా వారి డబ్బులు అందుకున్నారు. ఇదే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ లు, ఎల్లో బ్యాచ్, ఎల్లో మీడియాకు మింగుడుపడలేదు. ఎన్నికల కోడ్‌ నెపంతో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్‌ తదితరులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని నెల కిత్రమే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. డీబీటీ విధానంలో లేదంటే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్ద పంపిణీ చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ఏప్రిల్‌ నెల పింఛను డబ్బును సచివాలయాల వద్ద పంపిణీ చేస్తూనే, విభిన్న దివ్యాంగులు, కదల్లేక మంచానికి లేదా వీల్‌చైర్‌కే పరిమితమైన వారికి, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు వారి ఇంటి వద్దే పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీ ఈ నెల 3న మొదలుపెట్టి 8వ తేదీకల్లా పూర్తిచేశారు. సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకొనే క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. చల్లారని పచ్చ కళ్లు ఏప్రిల్‌ నెలలో పింఛను లబ్ధిదారులను నానా అగచాట్లకు గురి చేసినప్పటికీ, పచ్చ కళ్లు చల్లబడలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి మళ్లీ ఫిర్యాదులు చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నతాధికారులందరినీ బ్లాక్‌మెయిల్‌ చేస్తూ, వ్యక్తిగతంగా వారి ప్రతిష్ట దిగజార్చేలా టీడీపీ అనుకూల మీడియాలో పింఛన్ల పంపిణీపై రకరకాల తప్పుడు కథనాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై పలు సూచనలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా లబ్ధిదారులకు నేరుగా డబ్బుల పంపిణీకి బదులు బ్యాంకుల్లో జమ చేసేలా అధికారులు మళ్లీ మార్పులు చేయాల్సి వచి్చంది. 48,92,503 మంది అవ్వాతాతలు, ఇతరుల పింఛన్‌ డబ్బులు ఆధార్‌ నంబర్‌తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. మే, జూన్‌ రెండు నెలల పాటు వీరు కుటుంబంలో లేదా తెలిసిన వారిలో ఎవరో ఒకరి వెంట బెట్టుకొని బ్యాంకుల దాకా వెళ్లి ఆ డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. గత నెలలో సచివాలయాల్లో డబ్బు తీసుకున్న వీరికి ఇప్పుడు బ్యాంకులకు వెళ్లాలంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉంటుంది. సాధారణంగా అన్ని గ్రామాల్లో బ్యాంకులు ఉండవు. బ్యాంకులో పని ఉంటే సమీపంలోని పెద్ద పంచాయతీలకో, మండల కేంద్రాలు, లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లాలి. ఈ రెండు నెలలూ పింఛను కోసం అవ్వాతాతలకు  ఈ అవస్థలు తప్పవు. మండుటెండల్లో ఎవరో ఒకరిని వెంటబెట్టుకొని ఆటోలోనో, బస్సులోనో పక్క ఊరు లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లి డబ్బు తెచ్చుకోవాలి. దీని కోసం ఒక కుటుంబంలో ఇద్దరు ఒకట్రెండు రోజులు పనులు మానుకొని, డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్లిరావాల్సి ఉంటుంది. వీరు కాకుండా విభిన్న దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో పింఛను పొందే వారు, మంచం లేదా వీల్‌చైర్‌కు పరిమితమైన వారు, యుద్ధ వీరుల వృద్ధ వితంతువులతో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం లేని వారు, అసలు బ్యాంకు ఖాతాలే లేని వారికి శాశ్వత ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2.66 లక్షల మంది వలంటీర్లు ఐదు రోజుల్లో నిర్వహించే కార్యక్రమాన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్న శాశ్వత ఉద్యోగుల ద్వారా వారి ఎన్నికల విధులకు ఆటంకం కలగకుండా ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు 20 రోజుల దాకా సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి నిర్ణయం వల్ల ఒక గ్రామంలో రోజుకు కొందరికి అంది, మరికొందరికి అందకపోతే పింఛనుదారులలో అలజడి రేగే అవకాశమూ ఉందని అధికారులు అంటున్నారు. అయినప్పటికీ, సకాలంలో పింఛన్ల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.గత చంద్రబాబు ప్రభుత్వంలో పింఛనుదారులకు అన్నీ కష్టాలే.. 2014 – 19 మధ్య రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పింఛనుదారులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవ్వాతాతలు, దివ్యాంగులు పింఛను మంజూరు కోసం ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేది. పింఛన్ల మంజూరు మొదలు, తొలగింపులు వంటి వాటిని కూడా జన్మభూమి కమిటీలకే చంద్రబాబు అప్పగించారు. ఆ జన్మభూమి కమిటీల్లో గ్రామాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలే పూర్తిగా ఉండడంతో వాళ్లు టీడీపీకి ఓటు వేసిన వారికి లేదా లంచాలు ఇచి్చన వారికే కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు.ప్రత్యర్ధి పార్టీల సానుభూతిపరులకు పింఛన్లు మంజూరయ్యేవే కావు. ఒకవేళ అప్పటికే ఎవరికైనా మంజూరై ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగించారన్న ఆరోపణలున్నాయి. పింఛన్లు మంజూరైన వారు కూడా ఆ డబ్బు కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఊరిలో ఎప్పుడు పింఛను పంపిణీ జరుగుతుందో తెలియక ప్రతి రోజూ ఆఫీసు దాకా వచ్చి ఎండలో కూర్చొని ఊసూరుమంటూ తిరిగి వెళ్లే పరిస్థితి ఉండేది. 

Sakshi Guest Column On AP CM YS Jagan Govt
సామాజిక న్యాయపాలనే గెలిపిస్తుంది!

ఇటీవల విశాఖపట్టణంలో ఓ దళిత మేధావుల సమా వేశంలో పాల్గొన్నప్పుడు ఏపీ ముఖ్యమంత్రిపై చర్చ జరి గింది. ఈ సమావేశంలో 90 శాతం దళితులు, క్రైస్తవులు ఉన్నారు. జగన్‌ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇచ్చే విధంగా అసెంబ్లీ తీర్మానం చేసిన కారణంగా, ఎస్సీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ఈ ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. నయా మనువాది చంద్రబాబు నాయుడుకీ, అతని కూటమికీ ఓటు వేయకుండా తిరిగి రెండవసారి జగన్‌మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే దృక్పథంతో దళిత సమాజం ఉందనేది వారి మాటల సారాంశం.విద్యా, వైద్య రంగాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు జగన్‌. ఒకసారి ఒక కుటుంబం ఉన్నత చదువులు చదివితే, ఆ కుటుంబం ప్రభుత్వ రాయితీల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండదు. ఆదాయం పెరగడం మూలంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముఖ్యంగా సబ్సిడీ బియ్యం, వృద్ధాప్య పింఛన్లు, గృహ నిర్మాణ పథకాలపై ప్రభుత్వ భారం తగ్గిపోతుంది. పదేళ్ల కాలంలో 40 శాతం, మరో పది సంవత్సరాల కాలంలో మరో 50 శాతం మొత్తం 20 సంవత్సరాల కాలంలో 90 శాతం సబ్సిడీ పథకం కింద లబ్ధిపొందే వారు, అభివృద్ధి పథకాల కింద లబ్ధిపొందే వారు అభివృద్ధి చెంది ఈ పథకాలను అంటే పెన్షన్‌ పథకం, సబ్సిడీ పథకాలు వద్దనే స్థాయికి ఈ కుటుంబాలు ఎదిగి పోతాయి. వీటిపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న బడ్జెట్‌లో 90 శాతం బడ్జెట్‌ తగ్గిపోతుంది. సామాజిక న్యాయాన్ని దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా జగన్‌ మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం.తాజాగా ఎన్నికల కోసం వైఎస్సార్‌సీపీ ప్రకటించిన ఎంపీ సీట్లలో 11 సీట్లనూ; అసెంబ్లీ సీట్లలో 48 సీట్లనూ బీసీలకు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ,  మైనారిటీలకు మొత్తం కలిపి 100 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. ఇది దేశంలోనే ఓ రికార్డు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇంత ప్రాతినిధ్యం  ఆ యా వర్గాలకు ఇవ్వడం కనిపించదు. అలాగే ఇటీవల 18 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 11 సీట్లు బీసీలకు కేటాయిస్తే దేశంలోని బీసీలందరూ ఆశ్చర్య పోయారు. పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్‌ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించి చరిత్రను తిరగరాశారు.గత ఏప్రిల్‌ 11న చేపట్టిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో 25 మందితో కూడిన మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించడం ద్వారా సరికొత్త సామాజిక మహా విప్లవాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించారు. నామినేటెడ్‌ పోస్టులలో 50 శాతాన్ని వెనుకబడిన వర్గాలకు ఇచ్చారు. అలాగే కాంట్రాక్టు పనులలో వారికి 50 శాతం కోటా కేటాయిస్తూ అసెంబ్లీలో చట్టం చేశారు. 56 బీసీ కులాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు 56 చైర్మన్లు, 672 డైరెక్టర్ల పోస్టులకు గాను మొత్తం 100 శాతం బీసీలకే  కేటాయించారు. ఫలితంగా ఆ కులాలలో నాయకత్వ లక్షణాలు పెరిగాయి. రాజ్యసభలో మొత్తం 9 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు ఉంటే... అందులో నలుగురు బీసీలు. శాసనసభ స్పీకర్‌; శాసన మండలి చైర్మన్, డిప్యుటీ చైర్మన్‌ పదవుల కేటాయింపు కూడా జగన్‌ సామాజిక న్యాయ దృష్టికి నిదర్శనంగా నిలిచాయి. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ ఆ మేర బీసీలకు జరిగే నష్టాన్ని పూరించడానికి పార్టీ పరంగా అదనంగా 20 శాతం ఆ వర్గానికి పెంచి మొత్తం 44 శాతం స్థానాలను బీసీలకు కేటాయించారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో మొత్తం 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్‌సీపీ గెలువగా అందులో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కేటాయించారు. మండల పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ 635 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులను గెలిస్తే అందులో ఈ వర్గాలకు 442 స్థానాలు (67 శాతం) కేటాయించారు. చివరగా ముగించే ముందు మూడు రాజ ధానుల అంశం కూడా పరిపాలన విభజనలో భాగంగా నేను చూస్తాను. సంపద సృష్టి జరగా లన్నా, సంపద పంపిణీ జరగాలన్నా ఒకే ప్రాంతం / లేదా సిటీ అభివృద్ధి చెందితే జరగదు. అందుకే కోస్తాంధ్రా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వహణ రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును చేయాలని జగన్‌ సంకల్పించారు. అభివృద్ధి చెందిన దేశాల అభివృద్ధి నమూనా కూడా ఇదే. ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడాలంటే జగన్‌మోహన్‌ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ సామాజిక న్యాయ కోవిదులు కూడా ఆశిస్తున్నారు.ప్రొ‘‘ గాలి వినోద్‌ కుమార్‌ వ్యాసకర్త ఉస్మానియా, తెలంగాణ విశ్వ విద్యాలయాల మాజీ డీన్‌–ఫ్యాకల్టీ ఆఫ్‌ లా

కత్తి దాడిలో కుడికన్నును కోల్పోయిన సల్మాన్‌ రష్దీ
హింసకు కళాత్మక ప్రతీకారం!

న్యూయార్క్‌లోని చౌటక్వా ఇన్‌స్టిట్యూషన్‌లో రెండేళ్ల క్రితం ఆగస్టు 12న ఉపన్యాసం ఇచ్చేందుకు సిద్ధమౌతున్న భారత సంతతి రచయిత సల్మాన్‌ రష్దీ అతి పాశవికంగా పదిహేను కత్తిపోట్లకు గురయ్యారు. చావు తప్పి కన్ను పోగొట్టుకున్న ఆ ప్రాణాపాయం నుండి మెల్లగా కోలుకుంటున్న స్థితిలో ఉన్న రష్దీ... నాటి ఘటనపై తాజాగా ‘నైఫ్‌: మెడిటేషన్స్‌ ఆఫ్టర్‌ యాన్‌ అటెంప్టెడ్‌ మర్డర్‌’ పుస్తకం రాశారు. భయంకరమైన ఆ దాడి గురించి ఈ పుస్తకంలో సల్మాన్‌ రష్దీ నేరుగా పాఠకులతో సంభాషించారు. నేటికీ వెంటాడుతున్న తన బాధను, అంతఃసంఘర్షణలను బహిర్గతం చేస్తూ... నెమ్మదిగానే అయినా ఆత్మవిశ్వాసంతో తనెలా కోలుకున్నదీ హృద్యంగా వివరించారు. అదొక గొప్ప మానవీయ పద స్వరీకరణ.మునుపటి తన కళాఖండాల మాదిరిగా కాకుండా, తన తాజా పుస్తకం ‘నైఫ్‌: మెడిటే షన్స్‌ ఆఫ్టర్‌ యాన్‌ అటెంప్టెడ్‌ మర్డర్‌’లో... దాదాపుగా తనను చంపి నంత పని చేసిన ఆనాటి భయంకరమైన దాడి గురించి సల్మాన్‌ రష్దీ నేరుగా పాఠకులతో సంభాషించారు. సన్నిహితంగా, నిజాయితీగా, ఒప్పించే ప్రయత్నంలో విశ్వాసాన్ని చొరగొనే విధంగా, తన అనిశ్చిత స్థితిని పంచుకుంటూ, తన బాధను, అంతఃసంఘర్షణలను బహిర్గతం చేస్తూ, నెమ్మదిగానే అయినా ఆత్మవిశ్వాసంతో నిలకడైన ప్రయాణంగా తనెలా కోలుకున్నదీ చక్కగా వివరించారు. అదొక గొప్ప మానవీయ పద స్వరీకరణ. పూర్తిగా వ్యక్తిగతమైనది. రష్దీ కంటే సల్మాన్‌గానే ఆయన ఎక్కువగా మాట్లాడారని చెప్పొచ్చు.   ఆయన తన పైన జరిగిన దాడి(2022) గురించి రాస్తారని నాకు కచ్చితంగా తెలుసు. అయినా ఒక నవలా రచయిత రాయకుండా ఎలా ఉండగలరు? నాకెప్పుడో తెలుసు అని నేను అనడం ఒక పాఠకుడి అంచనాగా మాత్రమే. దాడి ప్రభావాన్ని తనెలా మానసికంగా తట్టుకుని నిలబడ్డారన్న దానిపై పుస్తకంలో రష్దీ చేసిన విశదీకరణ ఆయన ప్రయత్నబలం ఎంత పటిష్టమైనదో చెబుతోంది. ‘‘జరిగిన దానిని అర్థం చేసుకునేందుకు, దానిని అధిగమించేందుకు, నాదిగా అలవాటు చెందేందుకు, ఒక బాధితుడిగా మాత్రమే ఉండటాన్ని నిరాకరించేందుకు నేను ఎంచుకున్న మార్గం ఈ రాయటం అన్నది కావచ్చు. హింసకు నేను చెప్పే సమాధానం కళ ’’ అంటారు రష్దీ.ఈ పుస్తకం రష్దీ ప్రతిస్పందన అయితే, పుస్తకపు శీర్షిక రష్దీ ఉద్దేశపూర్వకమైన ఎంపిక. అతి దారుణంగా ఆయనపై కత్తిపోట్ల దాడి జరిగింది. కత్తి అన్నది తుపాకీకి చాలా భిన్నమైనది. ‘‘కత్తిపోటు ఒక విధమైన హత్తుకోలు. మనిషికి దగ్గరగా వచ్చి పొడిచే ఆయుధం. కత్తిపోట్లు అతి సమీప నేరాలు’’ అంటారు రష్దీ. అయితే కత్తి ఒక ఉపకరణం కూడా. ఉపయోగించే దాన్ని బట్టి ఆయుధమో, సాధనమో అవుతుంది. ఆ కోణంలో చూస్తే భాష కూడా పదునైన కత్తి వంటిదే. ‘‘భాషే నా కత్తి’’ అని చెబుతారాయన. ‘‘నేనొకవేళ అనుకోకుండా ఒక అవాంఛనీయమైన కత్తి పోరాటంలో చిక్కుకున్నట్లయితే, ఎదురుదాడికి నేను తిప్పే కత్తి బహుశా నా భాషే కావచ్చు. నా ప్రపంచాన్ని నేను పునర్నిర్మించుకోటానికి, తిరిగి నా అధీనంలోకి తెచ్చు కోటానికి నేను వాడే పరికరం అదే కావచ్చు’’ అంటారు.దాడి గురించి రష్దీ వర్ణన సూక్ష్మ సునిశితంగా, వెన్నులో వణుకు పుట్టించేలా, ఆ ఘటనను అదే రీతిలో తిరిగి చూపించినట్లుగా ఉంది. ‘‘నేను ఇప్పటికీ ఆ క్షణాన్ని నెమ్మదిగా కదిలే దృశ్యంలా చూడగలను. అతడు ప్రేక్షకుల నుంచి ఒక్క ఉదుటున దుమికి పరుగున నన్ను సమీపిస్తున్న ప్పుడు నా కళ్లు అతడిని అనుసరించాయి. దూకు డుగా పడుతున్న అతడి ప్రతి అడుగును నేను గమనిస్తున్నాను. చప్పున నేను నా కాళ్లపై లేవటం నాకు తెలుస్తూ ఉండగా అతడి వైపు తిరిగాను. ఆత్మరక్షణగా నా ఎడమ చేతిని పైకి లేపాను. ఆ చేతిపై అతడు తన కత్తిని దిగపొడిచాడు.’’  బాధితుడిలా కాకుండా, జరుగుతున్న దానిని బయటి నుంచి చూస్తున్న వ్యక్తిగా... ‘‘అతడు చాలా పాశవికంగా పోట్లు పొడు స్తున్నాడు. పొడు స్తున్నాడు, కత్తిని నాపై తిప్పుతున్నాడు. కత్తి దాని కదే ప్రాణం కలిగి ఉన్నట్లుగా నాపై విరుచుకుపడింది’’ అని రష్దీ రాశారు. రష్దీ స్పృహ కోల్పోయినట్లు లేదు. జరుగుతున్న దాడి ఎలాంటిదో తెలుస్తూనే ఉన్న దిగ్భ్రాంత స్థితిలో ఆయన ఉన్నారు. ‘‘నేలపై పడి ఉన్న నేను నా శరీరం నుంచి కారుతున్న రక్తపు మడుగును చూస్తూ ఉండటం నాకు గుర్తుంది. చాలా రక్తం. అప్పుడు నాకు అనిపించింది: ‘నేను చనిపోతున్నాను’ అని. కానీ అదేమీ నాకు భయం కలిగించ లేదు. ఊహించనిది జరుగబోతున్నట్లుగానూ లేదు. బహుశా అలా జరిగే అవకాశం ఉంది అనుకున్నాను. జరగవలసిందే జరిగిపోతున్న దనే ఆలోచన.’’ ఆ సమయంలో రష్దీ గ్రహించని విషయం ఏంటంటే, బతికి బట్టకట్టాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ‘‘నా క్రెడిట్‌ కార్డులు ఈ జేబులో ఉన్నాయి. ఇంటి తాళాలు మరో జేబులో ఉన్నాయి’’ అని, ఆ స్థితితో ఎవరైతే తన పట్ల శ్రద్ధ వహిస్తున్నారో వారితో అస్పష్టంగా చెబుతున్నారు. ‘‘ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే, నా బొంగురు గొంతు దైనందిన వస్తువుల గురించి పట్టింపుతో ఉందంటే, నేననుకోవటం నా దేహంలోని ఒక భాగం – లోలోపలి పోరాడే భాగం – చనిపోయేందుకు సిద్ధంగా ఏమీ లేదని; ఆ క్రెడిట్‌ కార్డులు, ఇంటి తాళాలు మళ్లీ ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఉందని, ‘బతుకు, బతుకు’ అని నాతో గుసగుసలాడుతోందని’’అంటారు రష్దీ.  ఆయన శరీరంపై పదిహేను కత్తిపోట్లు పడ్డాయి. మెడ, కుడి కన్ను, ఎడమ చెయ్యి, కాలేయం, పొత్తి కడుపు, నుదురు, చెంపలు, నోరు, ఇంకా... తల నుంచి కింది భాగమంతటా. ‘బీబీసీ’ ప్రతినిధి ఎలాన్‌ యెన్తోబ్‌తో మాట్లాడుతూ, మెత్తగా ఉడికించిన గుడ్డును తన పైచెంప మీద ఉంచినట్లుగా తన కుడికన్నుకు అనిపించిందని రష్దీ అన్నారు. ఆ కన్ను పోవటం అనే తీవ్రమైన కలత గురించి పుస్తకంలో ఆయన మనోభావనతో కాక ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడారు. ‘‘ఇప్పుడు కూడా, ఇది రాస్తున్నప్పుడు ఈ నష్టంతో సర్దుకుని పోవడం నా వల్ల కావటం లేదు. అది శారీరకంగా కష్టమైనది. మానసికంగా మరింత కష్టమైనది. ఇది నా జీవితాంతం ఇలాగే ఉండిపోతుందని అంగీకరించడం నిస్పృహను కలిగిస్తోంది’’ అని రాశారు రష్దీ. మెక్రాన్‌ (ఫ్రాన్స్‌ అధ్యక్షుడు), బైడెన్‌ (అమెరికా అధ్యక్షుడు), ఆఖరికి రష్దీ అంటే ఎప్పుడూ ఇష్టపడని బోరిస్‌ జాన్సన్‌ (ఆ సమయంలో బ్రిటన్‌ ప్రధాని) కూడా రష్దీపై దాడి జరగటం పట్ల భయాన్ని,ఆందోళనను వ్యక్తం చేశారు. ‘‘అతని పోరాటం మా పోరాటం’’ అని మెక్రాన్‌ ప్రముఖంగా ప్రకటించారు. కానీ రష్దీ జన్మించిన దేశంలో, తన జన్మభూమి అని రష్దీ చెప్పుకునే దేశంలో మౌనమే అధికారిక ప్రకటన అయింది. ‘‘నను గన్న నా భారతదేశానికి, నాకు లోతైన ప్రేరణ అయిన భారతదేశానికి ఆ రోజున మాటలే దొరకలేదు’’ అన్నారు రష్దీ.  ఎంత సిగ్గుచేటు!కరణ్‌ థాపర్‌ వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Narendra Modi comments on Rahul Gandhi
బాద్‌షాల అరాచకాలు కన్పించ లేదా?

బెళగావి/సిర్సీ/దావణగెరె:  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ప్రధాని నరేంద్ర∙మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మన దేశానికి చెందిన రాజులు, మహారాజులను కించపర్చిన రాహుల్‌ నవాబులు, నిజామ్‌లు, సుల్తాన్లు, బాద్‌షాలు సాగించిన అరాచకాలపై మాత్రం నోరుమెదపడం లేదని మండిపడ్డారు. కేవలం బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలతో లబ్ధి పొందడానికి రాహుల్‌ ఆరాటపడుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం కర్ణాటకలోని బెళగావి, దావణగెరె, ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సీ, హోస్పేట్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. మన దేశ చరిత్ర, స్వాతంత్య్ర పోరాట గాథలను కాంగ్రెస్‌ పార్టీ పాలనలో బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని రాశారని, ఆ పాపాన్ని రాహుల్‌ గాంధీ ఇప్పటికీ కొనసాగిస్తున్నారని విమర్శించారు. భారతదేశ రాజులు, మహారాజులు పేద ప్రజలపై క్రూరమైన అణచివేత, దౌర్జన్యాలకు పాల్పడ్డారని, ఆస్తులు, భూములు బలవంతంగా లాక్కున్నారంటూ రాహుల్‌ ఇటీవల ఆరోపించారని గుర్తుచేశారు. ఛత్రపతి శివాజీ, కిత్తూరు రాణి చెన్నమ్మ వంటి గొప్ప పాలకులను రాహుల్‌ అవమానించారని చెప్పారు. దేశ చరిత్రలో నవాబులు, నిజామ్‌లు, సుల్తాన్లు, బాద్‌షాలు సాగించిన అఘాయిత్యాలు, దారుణాల గురించి మాట్లాడాలంటే కాంగ్రెస్‌ రాజకుమారుడి నోటికి తాళం పడుతోందని ఎద్దేవా చేశారు. మొఘల్‌ రాజు ఔరంగజేబు మన ఆలయాలను అపవిత్రం చేశాడని, కూలి్చవేశాడని అన్నారు. అలాంటి ఔరంగజేబును ఆరాధించే పారీ్టలతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుందని ఆక్షేపించారు. ఔరంగజేబు దుశ్చర్యలపై రాహుల్‌ ఏనాడూ మాట్లాడలేదన్నారు. రాజులు, మహారాజులు మన దేశానికి ఎన్నో సేవలు చేశారని, వారి త్యాగాలు మరువలేమని పేర్కొన్నారు. రాజులకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఉన్న ధైర్యం సుల్తాన్లకు వ్యతిరేకంగా మాట్లాడడానికి రాహుల్‌కు లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు మైండ్‌సెట్‌ ఆ పార్టీ మేనిఫెస్టోలో కనిపిస్తోందని వెల్లడించారు. ఓట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) మద్దతు  తీసుకుంటోందని ఆరోపించారు. వయనాడ్‌లో నెగ్గడానికి పీఎఫ్‌ఐకి లొంగిపోతారా? అని రాహుల్‌ని ప్రశ్నించారు.  ప్రజల ఓట్లతోనే నాకు ధైర్యంఓటు బ్యాంకు రాజకీయాలు మరింత నీచంగా, విధ్వంసకరంగా తయారవుతున్నాయని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ చివరి క్షణం వరకూ ఎన్నో అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. ఆలయ నిర్మాణం జరగకుండా కాంగ్రెస్, దాని కోటరీ 70 ఏళ్లపాటు కుట్రలు సాగించాయని దుయ్యబట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటి రోజే అయోధ్యలో ఆలయ నిర్మాణంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, అప్పటి పాలకులు ఆ పని చేయలేదన్నారు. నిర్ణయం తీసుకొని, అమలు చేయడానికి 56 అంగుళాల ఛాతీ(మోదీ) కావాల్సి వచి్చందన్నారు. ప్రభుత్వ సొమ్ముతో గానీ, పన్ను చెల్లింపుదార్ల డబ్బుతో గానీ ఆ ఆలయం నిర్మించలేదని, శ్రీరాముడి భక్తుల విరాళాలతోనే ఆలయ నిర్మాణం జరిగిందని వివరించారు. రామమందిర ప్రాణప్రతిష్టకు హాజరు కావాలంటూ ఆహా్వనం అందజేస్తే కాంగ్రెస్‌తోపాటు కొన్ని పారీ్టలు తిరస్కరించాయని గుర్తుచేశారు. ఆ పార్టీలను ఎన్నికల్లో తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలకాలని, మరింత బలం చేకూర్చాలని కోరారు.వారసత్వ పన్నును ఆమోదించను  కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే వారసత్వ పన్నుతో ఆస్తులు పోగొట్టుకోవాల్సి వస్తుందంటూ ప్రజలను ప్రధానమంత్రి అప్రమత్తం చేశారు. పిల్లల కోసం ఆదా చేసుకున్న డబ్బులను సైతం లాక్కుంటారని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు 45 శాతం ఆస్తులను మాత్రమే బదిలీ చేసే అవకాశం ఉంటుందని, మిగతా 55 శాతం ఆస్తులను కాంగ్రెస్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, ఓటు బ్యాంక్‌కు కట్టబెడుతుందని పేర్కొన్నారు. అయితే, తాను జీవించి ఉన్నంతకాలం ఇలాంటి వారసత్వ పన్ను ఆమోదించే ప్రసక్తే లేదని మోదీ తేలి్చచెప్పారు. మీ ఉద్దేశాలు వదిలేసుకోండి అంటూ కాంగ్రెస్‌         పారీ్టకి హితవు పలికారు. కర్ణాటకలో ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందువులపై దాడులు పెరిగిపోయాయని ప్రధానమంత్రి అన్నారు.  2014 కంటే ముందు బ్రోకర్ల రాజ్యం  కొన్ని దేశాలు, సంస్థలు మన దేశం, మన ప్రభుత్వం బలహీనపడాలని కోరుకుంటున్నాయని, అలాగైతే లాభపడొచ్చని, ఆటలు సాగించుకోవచ్చని భావిస్తున్నాయని మోదీ చెప్పారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతుండడం ఆయా దేశాలకు, సంస్థలకు ఇష్టం లేదన్నారు. భారత్‌ బలమైన దేశంగా ఎదగడం కొందరికి కంటగింపుగా మారిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉంటే అవినీతికి పాల్పడడం, దోచుకోవడం సాధ్యం కాదని కొన్ని దుష్టశక్తులు భావిస్తున్నాయని పేర్కొన్నారు.2014 కంటే ముందు బ్రోకర్ల రాజ్యం నడిచిందని, ఢిల్లీ పవర్‌ కారిడార్లలో వారే అధికారం చెలాయించారని గుర్తుచేశారు. ఢిల్లీలోని హోటళ్లలో సంవత్సరాల తరబడి తిష్ట వేసి లాబీయింగ్‌ చేస్తూ ఉండేవారని తెలిపారు. 2014లో తాము అధికారంలోకి వచి్చన తర్వాత పవర్‌ కారిడార్లను శుద్ధి చేసే ప్రక్రియ చేపట్టామని వివరించారు. బ్రోకర్లకు, లాబీయిస్టులకు అక్కడ స్థానం లేకుండా చేశామని చెప్పారు. బీజేపీని అణగదొక్కడం సాధ్యం కాదన్న సంగతిని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తెలుసుకోవాలన్నారు. 

ఆదివారం రాత్రి హనుమకొండ చౌరస్తాలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. హాజరైన జనం
బీఆర్‌ఎస్‌తోనే రక్ష! : మాజీ సీఎం కేసీఆర్‌

సాక్షి, వరంగల్‌: ‘‘ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా బీజేపీకి 400 సీట్లు కాదు.. కనీసం 200 సీట్లు దాటేలా లేవు. మనకు ఇదే మంచి సమయం. తెలంగాణలో లోక్‌సభ సీట్లన్నీ గెలిస్తే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పేగులు తెగేదాకా కొట్లాడుతాం. కేంద్రంలో హంగ్‌ వస్తే కీలకపాత్ర పోషించే అవకాశం ఈ రోజు తెలంగాణకు ఉంది..’’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మన గోదావరి నీళ్లను ఎత్తుకుపోతామన్న బీజేపీకి.. హామీలిచ్చి అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రయోజనం ఉండదన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ చేపట్టిన బస్సుయాత్ర ఆదివారం హనుమకొండకు చేరుకుంది. పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి హనుమకొండ చౌరస్తా వరకు కేసీఆర్‌ రోడ్డు షో నిర్వహించారు. కూడలి వద్ద ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘గోదావరి నదిని తీసుకొని పోతా అంటూ ఓట్లు పడే టైంలో నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్‌ పంపించాడు. ప్రాణం పోయినా ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ పెట్టాలి. నేనున్నప్పుడు అదే పంచాయతీ పెట్టిన. ఆయనేమో ఎత్తుకుపోతా అంటరు. ఈ చేతకాని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నోరు మూసుకొని పడి ఉంది. అందులో ఏం మతలబు దాగి ఉంది. ఎవరూ కాపాడాలి? దయచేసి మన గోదావరిని, కృష్ణాను కాపాడుకోవాలన్నా.. తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా.. మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా.. నిరుద్యోగ సమస్య తీరాలన్నా.. మన బతుకులు బాగు పడాలన్నా.. కచ్చితంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలవాలి. అదే తెలంగాణకు క్షేమం. దయచేసి ఆలోచన చేయాలి. లంచాల కోసమే కాంగ్రెస్‌ పర్మిషన్లు ఆపింది తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రమంతా భూముల ధరలు బ్రహ్మాండంగా పెరిగాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పెరిగింది. కానీ ఇప్పుడు డౌన్‌ అయింది. దాని మీద బతికే వేల మంది రోడ్ల మీద పడ్డారు. రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు పెద్ద పట్టణాల్లో ఐదు నెలలుగా బిల్డింగ్‌ పర్మిషన్లు ఇస్తలేరు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో టీఎస్‌ బీపాస్‌ తెచ్చి.. అప్లికేషన్‌ పెడితే 21 రోజుల్లో ఆటోమేటిగ్గా పర్మిషన్లు ఇచ్చేయాలని చట్టం చేసినం. ఇప్పుడున్న సీఎం, వారి మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసా. ఎవరైనా బిల్డింగ్‌లు కడితే చదరపు మీటర్‌కు ఇంత అని కాంగ్రెస్‌కు లంచం ఇవ్వాలట. దానికోసం మొత్తం రాష్ట్ర ప్రగతిని, అభివృద్ధిని ఆపేశారు. అంతేకాదు పూర్తయిన భవనాలకు కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదు. ఈ బండారమంతా బయటపెడతాం. త్వరలోనే దీనిపై పార్టీ కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు. భూగోళం తెలియదు. మొన్న ఎక్కడనో మాట్లాడుతూ కృష్ణానది కూడా నేనే కట్టిన అంటడు. ప్రపంచంలో ఎవరైనా నది కడతారా? ‘ఏరి కోరి మొగుడిని తెచ్చుకుంటే ఎగిరి ఎగిరి తన్నిండంట’ అన్నట్టు ఉన్నది. అడ్డగోలు హామీలు చూసి ఓట్లేస్తే.. నాలుగైదు నెలల్లోనే ఆగమాగం చేసేశారు. తెలంగాణకు ఏమైందో అర్థం కావడం లేదు. కరెంట్‌ ఎక్కడికి పోయింది? సాగునీళ్లు ఏవి? పంటలు ఎందుకు ఎండుతున్నాయి? మంచి నీళ్ల కరువు ఎందుకు వస్తోంది? కాంగ్రెస్‌ సర్కారు ఒక్క హామీ కూడా సరిగా అమలు చేయలేదు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నారు. ఏమైంది? రైతుబంధు అందరికీ రాలేదు. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. డిసెంబర్‌ 9 నాడే రూ.2 లక్షల రుణమాఫీ అన్నారు. ఏదీ కాలేదు.అచ్ఛేదిన్‌ కాదు.. సచ్చేదిన్‌..బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ. దానికి ఎంతసేపూ పంచాయతీలు పెట్టించడం, విద్వేషం నింపడమే. ఆ పార్టీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉండవు. దయచేసి యువతను కోరుతున్నా.. ఆవేశం కాదు.. ఆలోచన చేయాలి. ఈ దేశం మీది. ఈ రాష్ట్రం మీది. రేపటి భవిష్యత్‌ మీది. ప్రధాని మోదీ భేటీ బచావో, భేటీ పడావో, జన్‌ ధన్‌ యోజన వంద నినాదాలు చెప్పారు. విదేశాల నుంచి నల్లధనమంతా తెచ్చి ఇంటికి రూ.15 లక్షల చొప్పున ఇస్తానన్నారు. ఎవరికైనా కనీసం ఐదు రూపాయలన్నా వచ్చాయా? అచ్ఛే దిన్‌ అచ్ఛే దిన్‌ అన్నారు.. అది రాలేదు కానీ సచ్చేదిన్‌ వచ్చింది. ధరలు విపరీతంగా పెరిగాయి. రూపాయి విలువ పడిపోయింది. కేంద్రంలో 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క ఖాళీ కూడా నింపలేదు. విభజన చట్టంలో కాజీపేటకు కోచ్‌ ఫ్యాక్టరీ ఇస్తామని ఉంటే.. మోదీ దానిని గుజరాత్‌కు ఎత్తుకెళ్లారు. అలాంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలి?’’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు. 

తప్పక చదవండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement