నా జీవితంలో అవి చీకటి రోజులు : ప్రియాంక చోప్రా | Priyanka Chopra Opens Up On Lonely Time In Hollywood | Sakshi
Sakshi News home page

Priyanka Chopra: నా జీవితంలో అవి చీకటి రోజులు

Apr 28 2024 8:58 AM | Updated on Apr 28 2024 10:19 AM

Priyanka Chopra Opens Up On Lonely Time In Hollywood

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న ప్రియాంకా చోప్రా ఇప్పుడు హాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. హాలీవుడ్‌ నటుడు, గాయకుడు నిక్‌ జోనస్‌ని ఆమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఓ పాడ్‌ కాస్ట్‌ ఇంటర్వ్యూలో తొలి నాళ్లల్లో హాలీవుడ్‌లో తన ప్రయాణం గురించి ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత నా కెరీర్‌ మళ్లీ మొదట్నుంచి మొదలైందా? అనే భావన కలిగింది. హాలీవుడ్‌లో నాకు తెలిసిన వారు ఎవరూ లేరు. ఒంటరిగా ఫీలయ్యాను. చాలా భయం వేసింది. కొన్ని తిరస్కరణలూ ఎదురయ్యాయి.

ఇలా హాలీవుడ్‌లో నా కెరీర్‌ తొలి రోజులు ఓ చీకటి అధ్యాయంలా గడిచాయి. ఇండియాలో నేనో స్టార్‌ హీరోయిన్‌ని అనే భావనను పక్కన పెట్టి హాలీవుడ్‌లో నా పని చేసుకుంటూ వెళ్లాను. అందుకే ఇప్పుడు హాలీవుడ్‌లో మంచి స్థాయిలో ఉండగలిగానని నా నమ్మకం’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్‌లో ‘హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌’ ఫిల్మ్‌లో నటిస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement