breaking news
-
ప్రైవేటుకే పత్తి
● తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు విక్రయం ● క్వింటా పత్తికి ఎక్కడా రూ.7 వేలు దాటని వైనం ● అధిక వర్షాలతో గణనీయంగా తగ్గిపోయిన దిగుబడి ● జిల్లాలో దయనీయంగా పత్తి రైతుల పరిస్థితి గుదిబండగా మారిన సీసీఐ నిబంధనలు, తేమ శాతం కొర్రీలు నాగర్‌కర్నూల్ మండలంలోని వనపట్ల గ్రామానికి చెందిన రాములు తనకున్న 7 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశాడు. ఈసారి దిగుబడి సగానికి తగ్గి ఎకరాకు 8 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. పంటను గగ్గలపల్లిలోని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా.. పత్తిలో తేమ 11.5 శాతం ఉండగా, అధికారులు క్వింటాల్‌కు రూ.7,700 మాత్రమే నిర్ణయించారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు గ్రేడ్ 3 రకమైన క్వింటాల్‌కు రూ.8,010 కనీస ధర సైతం ఎవరికీ దక్కడం లేదు. ఇప్పటికే దిగుబడి తగ్గి సగం నష్టపోయిన తాము కనీస ధర దక్కక మరింత నష్టపోతున్నామని రైతు వాపోయాడు. సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈసారి అధిక వర్షాలకు పత్తి పంట దెబ్బతిని దిగుబడి గణనీయంగా పడిపోయింది. అరకొరగా పండిన పంటను విక్రయించేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వెళ్తే అక్కడ ఇబ్బందులు తప్పడం లేదు. సీసీఐ నిబంధనల మేరకు పింజరకం గ్రేడ్–1 పత్తి క్వింటాల్‌కు రూ.8,110, గ్రేడ్–3 ప్రకారం కనీస మద్దతు ధర రూ.8,010 చొప్పున దక్కాల్సి ఉండగా.. ఎక్కడా క్వింటాల్‌కు రూ.7,600 వేలు దాటడం లేదు. తేమశాతం పేరుతో అధికారుల నుంచి తిరస్కరణకు గురవుతుండటంతో దిక్కులేని పరిస్థితుల్లో అధిక శాతం రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఇదే అదునుగా వ్యాపారులు అతి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సగానికి తగ్గిన దిగుబడి.. ఈసారి పత్తి సాగుచేసిన రైతులు అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా పంట దిగుబడిపై ఆశలు వదులుకున్నారు. నిరంతరం కురుస్తున్న వర్షాలతో పంటలో నీరు నిలిచి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పింద దశలోనే పత్తిమొక్కలు ఎర్రబారి ఆశించిన స్థాయిలో ఎదగలేదు. గతంలో ఎకరాకు కనీసం 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా.. ఈసారి గరిష్టంగా 6 క్వింటాళ్లు కూడా దాటడం లేదని రైతులు వాపోతున్నారు. పెట్టుబడి, ఎరువులు, కూలీల ఖర్చులు సైతం వచ్చేలా లేవని దిగులు చెందుతున్నారు. -
ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేయాలి
వెంకటాచలం: తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయ, సహకారాలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేయాలని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోరారు. వెంకటాచలంలోని కనుపూరు చెరువును మంగళవారం సాయంత్రం కాకాణి పరిశీలించారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆయా గ్రామాల వైఎస్సార్సీపీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. కాకాణి మాట్లాడుతూ తుఫాన్ తీరం దాటాక మరో 24 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప నివాసాల్లో నుంచి ప్రజలు బయటకు రావద్దని, చెట్ల కింద, కరెంట్ స్తంభాల కింద ఉండొద్దని తెలియజేశారు. అవసరమైన మందులు, నిత్యవసర వస్తువులు, కూరగాయలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలను తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఏ అవసరం వచ్చినా అండగా నిలిచేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ప్రజల అవసరాల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని ఎవరికి ఏ అవసరం వచ్చినా, సహాయక చర్యలు చేపట్టేందుకు అందుబాటులో ఉంటామని, ఎవరికై నా ఇబ్బందులు వస్తే 8712603258 నంబర్‌కు కాల్ చేస్తే, తమ పార్టీ శ్రేణులు స్పందించి, సమస్య పరిష్కారానికి, సహాయక చర్యలకు కృషి చేస్తారని కాకాణి వివరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో నిర్మించిన భవనాలు తుఫాన్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండే వసతులు ఏర్పాటు చేస్తున్నారు. నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ వసతులు కల్పించడంతో , ప్రస్తుతం ఆ స్కూళ్లు పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కలిగిందని చెప్పారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో ప్రజలకు సచివాలయ ఉద్యోగుల ద్వారా సమగ్రంగా సేవలు అందించే అవకాశం ఏర్పడిందని తెలియజేశారు. ఉద్యోగులంతా పూర్తిస్థాయిలో సహాయ, సహకారాలు అందించి ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, కనుపూరు సర్పంచ్ నాటకం శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ నాయకులు మందల పెంచలయ్య, మందల మస్తానయ్య, ఏడుకొండలు, ఉప్పు అశోక్, తురకా హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఏ అవసరమొచ్చినా 87126 03258 నంబర్‌కు కాల్ చేయొచ్చు వైఎస్సార్సీపీ శ్రేణులు స్పందించి సహాయక చర్యలు చేపడుతారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి -
హడలెత్తించిన మోంథా
బుధవారం శ్రీ 29 శ్రీ అక్టోబర్ శ్రీ 2025పెనుగొండ: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంగళవారం సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈదురుగాలుల బీభత్సం అధికంగా ఉండడంతో రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. లంక గ్రామాల్లో ప్రజలు పరిస్థితులకు అనుగుణంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువులకు, ఇతర ప్రాణులకు ఇబ్బందులు లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): మోంథా తుపానును ఎదుర్కొనేందుకు అధికారులందరూ 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, కలెక్టర్ చదలవాడ నాగరాణిలతో కలసి కలెక్టరేట్లో మంగళవారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బియ్యపుతిప్ప, వేములదీవి గ్రామాలకు చెందిన ప్రజలను అవసరమైతే నరసాపురం పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చెప్పారు. ఈదురు గాలుల వల్ల కరెంటు తీగలు తెగిపోవడం ద్వారా ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవా లని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. చింతలపూడి : మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో మంగళవారం అధికారులు 1200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రెండు నెలలుగా పడుతున్న భారీ వర్షాలకు తమ్మిలేరు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. తమ్మిలేరు ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 347.45 అడుగులకు చేరుకుందని తమ్మిలేరు ఇరిగేషన్ ఏఈ లాజరుబాబు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 100 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోందన్నారు. ప్రాజెక్టులో 350 అడుగుల వరకు నీటిని నిల్వ చేసుకోవచ్చనని అధికారులు చెప్పారు. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు డీఈ తెలిపారు.సాక్షి, భీమవరం: మోంథా తుపాను జిల్లాపై విరుచుకుపడింది. తీరానికి చేరువయ్యేకొద్దీ బలమైన గాలులతో, ఎడతెరిపిలేని వర్షాలతో జిల్లా వాసులను వణికించింది. ఈదురు గాలుల తీవ్రతకు చెట్లు, విద్యుత్ స్తంభాలతో పాటు పలుచోట్ల భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం తీవ్ర తుపానుగా బలపడిన తర్వాత నుంచి మోంథా విశ్వరూపం చూపించింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి అలలు ఎగసిపడుతూ నరసాపురం రూరల్ చినమైనివాలంక నుంచి పెదమైనివానిలంక వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల పొడవునా సముద్రం అర కిలోమీటరు మేర ముందుకు చొచ్చుకువచ్చింది. ఈదురుగాలులకు విరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు.. గాలుల తీవ్రతకు నరసాపురం రూరల్ రాజుల్లంక, సారవ, ఎల్బీ చర్ల, లక్ష్మణేశ్వరం, సీతారాంపురం, తూర్పుతాళ్లు, వీరవాసరం మండలంలో మత్స్యపురి, బలుసుకుయ్యలపాలెం, రాయకుదురు, నవుడూరు, అండలూరు, పాలకొల్లు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిశాయి. పాలకొల్లు వీరావారివీధి, యలమంచిలి మండలం మేడపాడు, పెనుమంట్ర మండలం పొలమూరు, ఆలమూరు, వెలగలేరు, కొయ్యేటిపాడు, బ్రాహ్మణచెరువు, పెనుగొండ మండలం ఇలపర్రు, తణుకులోని పిండిమరల వారి వీధి, వెంకటరాయపురం, పెంటపాడు మండలం ముదునూరు తదితర గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. హోర్డింగులు, ఫ్లెక్సీలు ఎగిరిపడ్డాయి. రోడ్లపై చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఉదయం నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తెరిపివ్వని వర్షం తుపాను ప్రభావంతో రెండు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల సమయానికి జిల్లాలో 583 మిల్లీమీటర్ల వర్షం కురవగా 20 మండలాల్లో సగటు వర్షపాతం 29.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల సమయానికి 116, మూడు గంటల సమయానికి 130 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆచంట, నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు తదితర చోట్ల అధిక వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు నీటమునిగాయి. అప్రమత్తంగా... జిల్లా యంత్రాంగం తాడేపల్లిగూడెంలో 3, నరసాపురంలో 30, భీమవరం డివిజన్లో 3 ముంపు ప్రాంతాలు, 10 తీవ్ర ప్రభావిత గ్రామాలను గుర్తించారు. తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆర్అండ్బీ పరిధిలో 28, రవాణా శాఖ పరిధిలో 40 చొప్పన మొత్తం 69 జేసీబీలు, 79 పవర్ సాలను, 96 డీజిల్ జనరేటర్లను అందుబాటులో ఉంచారు. నరసాపురంలో 34 మంది సభ్యులతో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని, ఏపీఎస్పీ ప్లటూన్ ఒకటి భీమవరంలో, మరొకటి నరసాపురంలో సిద్ధంగా ఉంచారు. గ్రేహౌండ్స్‌కు చెందిన 60 మంది సిబ్బందిని ఉండిలో మోహరించారు. 150 వరకు వైర్లెస్ సెట్లు, ఒక శాటిలైట్ ఫోను, ఒక డ్రోను అందుబాటులో ఉంచారు. భీమవరం ప్రాంతంలో వర్షాలతో నేలనంటిన వరి పంట నరసాపురం : 12వ వార్డులో కూలిన భారీ వృక్షం తుపాను పరిస్థితులు చక్కబడే వరకు కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పనిచేస్తాయని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజలు ఏదైనా అత్యవసర సమాచారాన్ని తెలియజేయడానికి, సహకారాన్ని పొందడానికి కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్ 08816 299219 భీమవరం ఆర్డీవో కార్యాలయం 98484 13739 నరసాపురం ఆర్టీవో కార్యాలయం 93911 85874తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయం 93817 01036 జిల్లా అంతటా ఈదురుగాలులతో కూడిన వర్షాలు నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు 3581 ఎకరాల్లో నేలనంటిన వరి పైర్లు నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ పునరావాస కేంద్రాలను పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు బాధితులకు వైఎస్సార్సీపీ నేతల పరామర్శ.. మోంథా తుపాను బాధితులను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ప్రభుత్వాన్ని కోరారు. తీరప్రాంత గ్రామాల ప్రజల కోసం నరసాపురం, మొగల్తూరు మండలాల్లో ఏర్పాటుచేసిన పలు పునరావాస కేంద్రాలను మంగళవారం ఆయన సందర్శించారు. అక్కడి ఏర్పాట్లపై స్థానికులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు తుపాను బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని ప్రసాదరాజు తెలిపారు. పునరావాస కేంద్రాలకు 4,150 మంది తరలింపు జిల్లాలోని నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం డివిజన్ల పరిధిలో 44 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయగా 37 కేంద్రాలను వినియోగంలోకి తెచ్చారు. ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి 9,409 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాలని నిర్ణయించగా, మంగళవారం సాయంత్రానికి 4,150 మందిని మాత్రమే తరలించారు. ఆయా కేంద్రాలను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, తుపాను పర్యవేక్షణ జిల్లా ప్రత్యేకాధికారి వి.ప్రసన్నవెంకటేష్, కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు.భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్ నాగరాణి సెలవును ప్రకటించారు. ఉత్తర్వులను అన్ని విద్యాసంస్థలూ తూచ తప్పకుండా పాటించాలని ఆదేశించారు. పిల్లలు బయట తిరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. 3581 ఎకరాల్లో పంట నష్టం తుపాను ప్రభావంతో మంగళవారం నాటికి జిల్లాలోని 3581 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈదురుగాలులతో ఇరగవరం, పెంటపాడు, తాడేపల్లిగూడెం రూరల్, కాళ్ల, ఆకివీడు, వీరవాసరం, పాలకోడేరు తదితర మండలాల్లో వేల ఎకరాల్లోని వరిపైరు నేలనంటింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉప్పుటేరు, యనమదుర్రు, ఎర్రకాలువ, చినకాపవరం, గునిపూడి సౌత్, బక్లెస్, కాజ తదితర డ్రెయిన్లు, పంట కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ముంపునీరు బయటకు పోయేదారి లేక పొలాలు నీట మునిగాయి. మరో పది రోజుల్లో కోతకు రానున్న పంట కళ్లముందే నీట మునిగిపోయిందని రైతులు వాపోతున్నారు. -
బుధవారం శ్రీ 29 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
కూలిన గృహాలు మోంథా తుపానుతో జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు 12 గృహాలు, రెండు రేకుల షెడ్లు నేలమట్టమయ్యాయి. దీంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మోంథా తుపాను జిల్లాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. గంట గంటకూ వర్ష బీభత్సం పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం నుంచి భారీగా వర్షం కురిసింది. తీరందాటే సమయానికి గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో విరుచుకుపడింది. కుంభవృష్టితో ఒంగోలు నగరం నీట మునిగింది. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ప్రధాన రోడ్లు చెరువులను తలపించాయి. జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఈదురుగాలులతో తీరప్రాంతం భయానకంగా మారింది. భారీగా అలలు ఎగసిపడుతుండడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆర్టీసీ 30 శాతం బస్సులను రద్దు చేసింది. పలు రైళ్లు రద్దయ్యాయి. ప్రయాణికులు రాక బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు నిర్మానుష్యంగా మారాయి. పశ్చిమ ప్రకాశంలోని పలు ప్రాంతాలు, నల్లమల అటవీ ప్రాంతంలో కూడా భారీ వర్షం కురిసింది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా వాసులు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకూ పలు మండలాల్లో 10 నుంచి 16 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటించి పునరావాస ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారీ వర్షాలకు సింగరాయకొండ పోలీస్ స్టేషన్, నగరంలో పోలీస్ ట్రైనింగ్ కళాశాలలు నీట మునిగాయి.జలదిగ్బంధంలో ఒంగోలు నగరంలోని కొత్తకూరగాయల మార్కెట్ కల్లోల మోంథా.. -
ఒక్కసారి కాదు.. పదిసార్లు అంటా
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి మంత్రివర్గం కచ్చితంగా దండుపాళ్యం ముఠాయేనని మాజీమంత్రి టి.హరీశ్‌రావు మరోమారు విమర్శించారు. ఇదే విషయాన్ని ఒక్కసారి కాదు..పదిసార్లు అయినా అంటానని, ఉన్న విషయం మాట్లాడితే కొందరు మంత్రులు ఉలిక్కి పడుతున్నారని మండిపడ్డారు. మంత్రుల మధ్య పంచాయితీల పరిష్కారం కోసమే కేబినెట్ సమావేశాలు పెట్టుకుంటున్నారా అని ప్రశ్నించారు. దక్కన్ సిమెంట్స్ కంపెనీ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించిన వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని నిలదీశారు.నిర్మల్ నియోజకవర్గ బీజేపీ నేత సిందే దీక్షిత్ తన అనుచరులతో కలిసి సోమవారం తెలంగాణభవన్ వేదికగా బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘అన్ని వర్గాల ప్రజలు రేవంత్ పాలనపై ఆగ్రహంతో ఉన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగు ణంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో పరుగులు పెట్టాలి’అని పిలుపునిచ్చారు. అనంతరం జరిగిన రజక సంఘం సమావేశంలోనూ హరీశ్‌రావు మాట్లాడారు. రేవంత్ రెండేళ్లలో విపక్షాలను దుర్భాషలాడటం మినహా రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. అడ్డమైన భాషతో అధికారంలోకి వచ్చాడని, ప్రస్తుతం ప్రజలు కూడా అదే భాషతో సీఎంపై తిరుగుబాటు చేస్తున్నారని చెప్పారు. ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్ కుట్రలు ‘జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో చపాతీ మేకర్, రోడ్ రోలర్ వంటి గుర్తులతో అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తుంది. అయినా ఉప ఎన్నికలో కాంగ్రెస్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రతీ మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.60 వేలు బాకీ పడింది. అధికారంలోకి వచ్చేందుకు అలవికాని హామీలు ఇచ్చిన రేవంత్ వాటిని నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేశాడు. మద్యం ధరలను పెంచి ప్రజల నుంచి విచ్చలవిడిగా డబ్బు దండుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓటమితోనే తెలంగాణకు లాభం జరుగుతుంది’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
కొత్తపేట: మోంథా పెను తుపాను నేపథ్యంలో పునరావాస కేంద్రాలకు తీసుకువచ్చిన నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధికారులు, సిబ్బందికి సూచించారు. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని, పలు గ్రామాలను మంగళవారం జెడ్పీ చైర్మన్ సందర్శించారు. అక్కడ ఉన్నవారి వివరాలు, వసతి సౌకర్యాలు, కేంద్రంలో వారికి అందిస్తున్న సేవల గురించి సెంటర్ పర్యవేక్షణ అధికారులు, సిబ్బందిని ఆరా తీశారు. వారికి పాలు, ఆహారం, అవసరమైన వైద్యం అందించాలని సూచించారు. తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలులు, భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలను అప్రమత్తం చేయాలని సర్పంచ్, సచివాలయం, ఆరోగ్య కేంద్రం సిబ్బందికి సూచించారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండవద్దని, ముఖ్యంగా చెట్లు, విద్యుత్లైన్ల కింద, శిథిలావస్థకు చేరిన ఇళ్లు, షెడ్లు, పూరిపాకల్లో ఉండవద్దని హెచ్చరించారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. లైన్లపై చెట్ల కొమ్మలు పడి వైర్లు తెగినా ప్రమాదం జరగకముందే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు తీసుకునేలా సిద్ధంగా ఉండాలని సూచించారు.జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు -
దౌర్జన్యంగా భూమిని కబ్జా చేస్తున్నారు
సుండుపల్లె : భూమి కనిపిస్తే చాలు.. కబ్జా చేసెయ్ అన్న రీతిలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తన భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని బాధితుడు డేరంగుల సతీష్ కన్నీరుమున్నీరవుతున్నారు. మండలంలోని భైరవగుట్ట సమీపంలో సుండుపల్లె గ్రామ సర్వే నెంబర్–426లో తన తాత డేరంగుల కృష్ణయ్య పేరుమీద 3.59 సెంట్ల డీపట్టా భూమి ఉందని తెలిపారు. తమ ఐదుగురు అన్నదమ్ములకు నేటికీ దానిపై సమాన వాటా ఉందన్నారు. అయితే ఇటీవల సుండుపల్లెకు చెందిన ఇద్దరు టీడీపీ ముఖ్య నాయకులు ఆ స్థలం ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తమకు హక్కుగా ఉన్న భూమిలో ఫెన్సింగ్ వేసి రాతి కూసాలు వేశారని, భూమిలోకి రావద్దంటూ బెదరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా తమ పలుకుబడి వినియోగించి భయపెడుతున్నారని ఆరోపించారు. పిత్రార్జితంగా సంక్రమించిన భూమికి రక్షణ కల్పించాలని, ఆక్రమణదారుల నుండి తనను కాపాడాలని వేడుకున్నారు. ఈ విషయమై సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి సంతోష్ నాయక్‌ను చరవాణి ద్వారా వివరణ కోరగా కోర్టు విషయమై వేరే ప్రదేశంలో ఉన్నానని కార్యాలయానికి వచ్చిన తర్వాత సదరు సర్వే నెంబర్ పరిశీలించి వివరాలు తెలుపుతానన్నారు. రక్షణ కల్పించాలని పట్టాదారుడి వేడుకోలు -
పోచంపల్లి చేనేత వస్త్ర తయారీపై అధ్యయనం
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ పరిశ్రమ, చేనేతపై అధ్యయనం చేయడానికి మంగళవారం యునైటెడ్ వే హైదరాబాద్ ఆధ్వర్యంలో ఫెర్నాడ్ రికార్డ్స్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో ప్రీలూమ్స్, మగ్గాలపై శిక్షణ పొందుతున్న 50 మంది ట్రైనీ కార్మికులు భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. చేనేత కళాకారులైన రాపోలు శ్రీను, చెరిపల్లి రాము, ఆడెపు ఆంజనేయులు, మంగళపల్లి శ్రీహరి గృహాలను సందర్శించి అక్కడ మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలు, నూలు వడికే విధానం, చిటికి కట్టడం, ఆసుపై గ్రాఫ్ డిజైన్ వేయడం, రంగులద్దకం, మార్కెటింగ్ విధానాలు, చేనేతలో ఆధునిక పరికరాల వినియోగం తదితర అంశాలను పరిశీలించారు. పద్మశ్రీ చింతకింది మల్లేశం తాను ఆసుయంత్రాన్ని రూపొందించడానికి కల్గిన ప్రేరణ, ఇబ్బందులు, సాధించిన విజయాలను ట్రైనీ కార్మికులకు వివరించారు. వీరి వెంట యునైటెడ్ వే హైదరాబాద్ ప్రతినిధులు దిలీప్‌కుమార్, కోమల్ ఉన్నారు. -
● పంట మునిగింది..
కడప అగ్రికల్చర్/సిద్దవటం: మోంథా తుఫాన్ ధాటికి వైఎస్సార్ జిల్లాలో నాలుగు మండలాల పరిధిలోని 25 గ్రామాల్లో 470 మంది రైతులకు సంబంధించి 270 హెక్టార్ల పంటనష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ సూచించారు. సిద్దవటం మండలంలో 60 హెక్టార్లలో వరిపంట, గోపవరం మండలంలో 20 హెక్టార్లలో వరి, 5 హెక్టార్లలో మొక్కజొన్న, పోరు మామిళ్లలో 150 హెక్టార్లలో వరిపంట, బి.మఠంలో 35హెక్టార్లలో వరిపంట తెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమింగా నష్టాన్ని అంచనా వేశారు. సిద్దవటం మండలంలోని లింగంపల్లి, మంగలవారిపల్లె, కడపాయపల్లె గ్రామాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది. -
దెబ్బతిన్న పంటలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాకు మోంథా తుపాను... ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది. భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని తేల్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. తేలికపాటి వర్షాలు కురిశాయి. ఇదీ మరింత బలపడనుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చింది. వాయుగుండం మరో రెండు రోజుల పాటు జిల్లాపై పంజా విసరనుందని అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ముప్పు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తోంది. తుపానుతో లోతట్టు ప్రాంతాలకు ముప్పు ఏర్పడితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. అధికారులు అప్రమత్తం మోంథా తుపానుతో కంట్రోల్ రూమ్ అలర్ట్ అవుతోంది. జిల్లాలో ఎప్పటికప్పుడు తుపాను పరిస్థితులను తెలుసుకోవడానికి జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ తుపాను పరిస్థితులను అంచనా వేసుకుంటూ అందుకు తగ్గట్టుగా తగిన చర్యలు తీసుకునేలా జిల్లా యంత్రాంగం సూచనలిస్తోంది. మండల అధికారులు వారి పరిధిలో జరిగే సంఘటనలను ఎప్పటికప్పడు చేరవేసేలా ఆదేశాలిచ్చింది. ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు, మాత్రలు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయి సిబ్బందిని హెచ్చరించింది. జిల్లాపై తుపాను దెబ్బ పడుతోంది. చిత్తూరు నగరంలో పలుచోట్ల చెట్లు పడి కొమ్మలు వాలిపోయాయి. పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఆయా ప్రాంతాల వాసులు రోడ్డు దాటని పరిస్థితి ఏర్పడింది. తవణంపల్లిలో మండలంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. పండ్ల తోటలు, సాగు భూములు చెరువులను తలపిస్తున్నాయి. నగరిలోని కుశస్థలి నది ప్రవాహం పుంజుకుంది. జిల్లా ప్రత్యేక అధికారి గిరీషా నదిని పరిశీలించారు. నిండ్ర మండలంలో వర్షం కారణంగా బస్సుకు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులకు పెద్ద ముప్పు తప్పింది. పలమనేరు నియోజకవర్గంలో కౌండిన్య నది పరివాహక ప్రాంతాల్లో నీటి ప్రవాహం కారణంగా వరి పంట నేలమట్టం అయింది. టమాట పంట నాశనమవుతోంది. బంగాళదుంప భూమి లోపలే కుళ్లిపోతోంది. కూరగాయల పంటలు రైతు చేతికి నష్టాన్ని మిగుల్చుతోంది. భారీ వర్షం పడితే ఈ పంటలు పూర్తిగా నీటమునిగే అవకాశాలున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. జీడీ నెల్లూరు మండలంలోని బంగారెడ్డిపల్లి వద్ద చెరువు నుంచి నీరు రోడ్డుపై జోరుగా ప్రవహిస్తోంది. అలాగే బలిజపల్లి, వెంకటాపురం గ్రామం వద్ద కూడా చెరువులు మొరవపారుతున్నాయి. దీని కారణంగా ఆ చుట్ట్టు పక్కల గ్రామస్తులు రానూపోను అవస్థలు పడుతున్నారు. అక్కన్నగారిపల్లెలో రెండు పూరి గుడిసెలు కూలిపోయాయి. పాలసముద్రం మండలం వీర్లగుడిలో పూరిగుడిసె పడిపోయింది. వెంగమాంబపురం, తిరుమలరాజుపురం, వనదుర్గాపురంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎస్ఆర్పురం మండలం డీకే మర్రిపల్లి గ్రామంలోని ఓ గుడిసెలోకి వరదనీళ్లు చేరాయి. కార్వేటినగరం మండల కేంద్రంలో సుద్దగుంట, పెద్దహరిజనవాడ, చిన్న హరిజనవాడ పక్కాగృహాలు ఉరుస్తున్నాయి. ముసురు వానలకు జిల్లా వ్యాప్తంగా జన జీవనం స్తంభించింది.
