మెగా కోడలు లావణ్య త్రిపాఠి తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు.
గతేడాది వరుణ్ తేజ్‌ను పెళ్లాడింది ముద్దుగుమ్మ.
అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలతో మెప్పించింది.
ఇవాళ తన 33వ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంటోంది.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించిన లావణ్య త్రిపాఠి ముంబయిలో విద్యను అభ్యసించింది.
మొదట ప్యార్ కా బంధన్ అనే సీరియల్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది.
అంతేకాకుండా 2006లో ఉత్తరాఖండ్ ఫెమినా మిస్‌గా నిలిచింది.


