కనీ కుశ్రుతి.. ఈమె ఒక మలయాళ నటి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్‌గా సినిమాలు చేసింది. వెబ్‌సిరీస్‌ల వల్ల బోలెడంత గుర్తింపు సంపాదించింది.
‘మనుష్యపుత్రి’ సినిమాతో మాలీవుడ్‌లో అడుగుపెట్టింది.
బిర్యానీ మూవీతో ఫేమస్ అయింది.
సినీ పరిశ్రమలో ఎదురైన లైంగిక వేధింపుల వల్ల ఒకానొక దశలో సినిమాలే మానేయాలనుకుంది..
కొన్నాళ్లు బ్రేక్ కూడా తీసుకుంది. కానీ చిత్రపరిశ్రమలోని మంచి పాత్రలు రారమ్మని పిలవడంతో మళ్లీ కెరీర్‌లో బిజీ అయింది.
దేశంలో మైనారిటీలు, దళితుల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ 2019లో 48 మంది సెలబ్రిటీలతో కలసి ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసింది కనీ.
2021లో 50వ కేరళ స్టేట్ సినీ అవార్డుల ఫంక్షన్‌కి ఆమె రెడ్ కలర్ లిప్‌స్టిక్ వేసుకుని వెళ్లినందుకు సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌కి గురైంది.
ఫెయిర్ స్కిన్ వాళ్లే కాదు.. డార్క్ స్కిన్ వాళ్లూ రెడ్ కలర్ లిప్‌స్టిక్ వేసుకోవచ్చని.. వేసుకోకూడదనే టాబూని బ్రేక్ చేయడానికే అలా రెడ్ కలర్ లిప్‌స్టిక్ వేసుకున్నానని కనీ వివరణ ఇచ్చింది.
థియేటర్, సినిమాలతోపాటు కనీ వెబ్‌తెర మీదా నటిస్తోంది.
ఆమె నటించిన ‘కిల్లర్ సూప్’ నెట్‌ఫ్లిక్స్‌లో.. ‘పోచర్’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి.
ఎన్నో హేళనలు, అవమానాలను ఎదుర్కొన్నాను. కానీ అవేవీ నన్నుగానీ.. నా లక్ష్యాన్ని గానీ ప్రభావితం చేయలేకపోయాయి.
ఆ స్ట్రెంత్ వచ్చింది మా పేరెంట్స్ నుంచే. ఈ నిజాన్ని గ్రహించి ఉంటే నా బ్రాటప్‌ని గేలి చేసేవారు కాదేమో! అంటోంది కనీ కుశ్రుతి.


