బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ గురించి బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేదు.
సల్మాన్ ఖాన్ సరసన వీర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది.
కానీ ఈ ముద్దుగుమ్మకు పెద్దగా కలిసి రాలేదు.
జరీన్ ఖాన్ చివరిసారిగా హమ్ బీ అకేలే ఔర్ తుమ్ బీ అకేలే అనే చిత్రంలో అన్షుమన్ ఝాకు జోడిగా కనిపించింది.
అయితే ఆమెను వెంకటేశ్‌తో మల్లీశ్వరి చిత్రంతో నటించిన కత్రినా కైఫ్‌తో పోల్చడంతో ఇబ్బందులు పడినట్లు తెలిపింది.
సినిమాల్లోకి రాకముందు ఓ కాల్ సెంటర్‌లో జాబ్ చేసింది.


