అంతర్జాతీయ స్మగ్లర్‌ అరెస్ట్‌

red smuggler arrested by kadapa police - Sakshi

సాక్షి, కడప : దశాబ్దాల కాలంగా పోలీసులకు కంటిమీద నిద్ర లేకుండా చేసి తప్పించుకుతిరుగుతున్న అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అశోక్ కుమార్ అగర్వాల్‌ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. వైఎస్‌ఆర్‌ జిల్లాలో గత కొన్నేళ్లుగా పోలీసుల కన్నుకప్పి కోట్లాది రూపాయల విలువ చేసే ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నాడు. పలుసార్లు దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు. ఈసారి మాత్రం పోలీసులకు దొరికిపోయాడు.

పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అశోక్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి సుమారు నాలుగు కోట్లు విలువ చేసే 3 టన్నుల ఎర్రచందనం దుంగలు, వాటితో తయారు చేసిన బొమ్మలను స్వాధీన పరుచుకున్నారు. అగర్వాల్‌ ఇప్పటి వరకు 1000  టన్నుల ఎర్రచందనం అక్రమ రవాణా చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈమేరకు జిల్లాఎస్పీ బాబూజీ అట్టడా వివరాలు వెల్లడించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top